S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

06/19/2019 - 19:40

తులసితో అనేక వ్యాధులను నయం చేసే సంపూర్ణ ఆరోగ్యాన్ని నిలబెట్టే అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. అయితే తులసి కోసం ఎక్కడో వెతికే పని లేకుండా, ఇంట్లోనే పెంచడం ద్వారా ప్రతిరోజూ తులసి ఆకులను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
* ప్రతిరోజూ ఉదయం నీళ్లలో తులసి ఆకులను వేసి మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కఫ సమస్యలు తగ్గడమే కాకుండా శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

06/19/2019 - 19:39

అందమైన ముఖానికి అందాన్నిచ్చే పెదవులు వాతావరణ మార్పుల వల్ల తరచూ పొడిబారుతుంటాయి. ఈ సమస్యను గుర్తించి ఎప్పటికప్పుడు పెదవుల పరిరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గులాబీ రేకుల్లా కోమలంగా ఉండాల్సిన పెదవులు గులాబీ ముళ్ళలా మారి ఇబ్బంది పెడతాయి. పొడి చర్మం ఉన్నవారిలో ఈ మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే కోమలమైన, మెరిసే పెదవులు కోరుకునే యువతులు చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే సరి.

06/17/2019 - 19:39

నేడు మనం చేసే పొదుపే.. భవిష్యత్తులో మన ఆర్థిక స్థిరత్వాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి మహిళలు కెరీర్ మొదలుపెట్టినప్పుడే పొదుపు చేయడం అలవాటు చేసుకోవడం మంచిది.
* ముందుగానే ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అంటే ఖర్చులను ముందుగానే రాసుకుని దాని ప్రకారం అమలుచేయాలి.

06/14/2019 - 19:32

చాలామంది ఏళ్లు తరబడి దిండ్లు, దువ్వెనలు, బ్రష్‌లను మార్చరు. అవే కాదు మన ఇంట్లో ఉపయోగించే చాలా వస్తువుల్ని కాలపరిమితి దాటినా కూడా వాడేస్తుంటారు. ఇవి చాలా హానికరం.
* పళ్లు తోముకునే బ్రష్‌ల ఆకృతి చెడిపోయినా, కుచ్చులు అరిగిపోయినా, గట్టిపడినా కూడా వాడేస్తూ ఉంటారు. నిజానికి మూడు నెలలకోసారైనా టూత్‌బ్రష్‌లను మారుస్తూ ఉండాలి. లేదంటే చిగుళ్లు, దంత సంబంధిత సమస్యలు వస్తాయి.

06/13/2019 - 20:26

ఎంతో ఇష్టపడి, ఖరీదు పెట్టి కొనే హ్యాండ్‌బ్యాగు ఎక్కువకాలం మనే్నలా చూడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* వేడి, చల్లదనం, తేమ ఉన్న గదిలో హ్యాండ్‌బ్యాగును పెడితే గనుక దాని రంగు పోయి అది పాతదానిలా మారుతుంది. అవసరం లేనప్పుడు దాన్ని దిండుగలేబులో ఉంచి అల్మారాలో ఓ మూల భద్రపరచాలి.

06/12/2019 - 19:25

తీర్చిదిద్దినట్లుండే పెదవుల వల్ల ముఖానికి కొత్తందం వస్తుంది. పెదవులను లిప్‌స్టిక్‌తో తీర్చిదిద్దుకోవడంలోకొన్ని మెలకువలు పాటించాలి. లిప్‌స్టిక్ వాడేముందు తెలుసుకోవలసిన మొదటి విషయం అసలు పెదవులకు ఎటువంటి లిప్‌స్టిక్ నప్పుతుందో అని.. అందుకోసం దాన్ని పెదవులకే వేసుకోవలసిన అవసరం లేదు. దాన్ని వేళ్లపై కొద్దిగా రాసుకుని పరీక్షించుకోవచ్చు.

06/12/2019 - 19:23

ఉప్పు లేకుండా ఏ కూరనూ వండలేం.. తినలేం కూడా.. అయితే ఉప్పును కూరల్లోకే కాదు.. ఉప్పుతో ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటంటే..
* తరచుగా వేసుకునే బూట్లు వాసన వస్తుంటాయి. అలాంటప్పుడు రాత్రిపూట కొద్దిగా ఉప్పు చల్లి ఉంచాలి. పొద్దునే్న బూట్లను దులిపేసి వేసుకోవడం వల్ల దుర్వాసన రాదు.

06/06/2019 - 19:11

జీవితంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం బద్ధకం. ఇది వ్యసనంలా మారితే మనిషి ఏ పనీ చేయలేదు. దీని నుంచి బయటపడాలంటే కొన్ని నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి. అప్పుడే విజయం సొంతమవుతుంది.

05/27/2019 - 18:18

ద్రాక్ష రసం ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గ్లాసు ద్రాక్ష రసం త్రాగడంవల్ల అందమైన, ప్రకాశవంతమైన చర్మాన్ని సహజసిద్ధంగా అందిస్తుంది.

05/26/2019 - 18:59

సూపర్ నట్స్‌గా చెప్పే బాదాంలో మంచి గుణాలెన్నో ఉన్నాయి. వీటిలో తల్లిపాలల్లో ఉండే ప్రొటీన్లు ఉంటాయి. బాదాంలోని ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు కోలన్ క్యాన్సర్‌ను నివారిస్తాయనీ, పిత్తాశయంలోని రాళ్లను తొలగిస్తాయన్నది పరిశోధనల ద్వారా తేలిన నిజం. రోజూ కాసిన్ని బాదంపప్పులను ఆహారంలో భాగంగా చేసుకుంటే బరువు తగ్గుతారు. వీటివల్ల పొట్టలో మంచి బాక్టీరియా పెరిగి తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Pages