S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

05/21/2019 - 18:46

నిద్రకు ఉపక్రమించగానే స్మార్ట్ఫోన్‌ను చేతిలోకి తీసుకుని ఏదో ఒకటి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా న్యూస్ ఫీడ్స్, సోషల్ నెట్‌వర్క్స్, చాటింగ్, సంగీతం వినడం మొదలైనవి. ఇలా తెలీకుండానే ఏదో ఒక అంశానికి అడక్ట్ అవడం జరుగుతుంటుంది. క్రమంగా కొన్ని గాడ్జెట్లకు పూర్తిస్థాయిలో అలవాటు పడిపోతారు. ఎంతలా అంటే అర్ధరాత్రుల్లో బాత్‌రూంకని నిద్రలేచినా ఆయా అంశాలను పర్యవేక్షించేలా..

05/19/2019 - 22:25

కంటికి వచ్చే ఇబ్బందుల్లో నీటి కాసులు (గ్లకోమా) ఒకటి. దీనివల్ల కంటిచూపు మందగిస్తుంది. ఆ ఇబ్బంది నుండి బయటపడేందుకు వేడి టీ తాగే అలవాటు సహకరిస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజూ ఒక కప్పు వేడివేడి టీ తాగేవారికి గ్లకోమా వచ్చే ప్రమాదం 74 శాతం తగ్గుతుందని చెబుతున్నారు వీరు. కానీ టీకి, కంటి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏమిటో మాత్రం వీరు వివరించడం లేదు.

05/13/2019 - 18:49

పిల్లలకు చిన్నతనంలో తగిలే దెబ్బలు దీర్ఘకాల ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మగపిల్లల్లో ఇవి చాలా అధికం. వారిలోని చురుకుదనం, నిర్లక్ష్యం, అనుకరణ ధోరణి.. ఇవన్నీ కలగలిపి వారికి పలురకాల గాయాలు తగిలేలా చేస్తాయి. పిడిగుద్దులతో ఆడుకోవడం వల్ల కడుపులో దెబ్బలు తగులుతాయి. చూసుకోకుండా అటూ ఇటూ పరుగెట్టడం వల్ల తలకు దెబ్బలు తగులుతాయి. కర్రలు, రాళ్లు విసురుకోవడంలో కళ్ళకు గాయాలవుతాయి. కంటి చూపు దెబ్బతింటుంది.

05/09/2019 - 19:11

బరువు తగ్గడం కోసం డైటింగ్ చేస్తున్నామంటుంటారు చాలామంది. డైటింగ్ చేసినా బరువు తగ్గడం లేదంటారు మరికొందరు. ఇప్పుడు డైటింగ్‌తో బరువు తగ్గరు అంటున్నది పరిశోధన. కేవలం ఆహారం తీసుకోవడం మానేస్తే బరువు తగ్గుతారన్నది భ్రమ మాత్రమే.. వ్యాయామం, క్రమం తప్పని ఆహారపు అలవాటు వలనే బరువు తగ్గుతారు కానీ పూర్తిగా ఆహారం మానేసినంత మాత్రాన ఏం లాభం ఉండదు. డైటింగ్‌తో సన్నబడినట్లు కనిపించవచ్చు.

05/08/2019 - 19:29

నేటి జీవన విధానం కారణంగా చాలామందిలో రక్తహీనత అనేది సమస్యగా మారింది. ఎవరిని అడిగినా రక్తం తగ్గుతోంది అనే సమాధానమే వస్తోంది. సైంటిఫిక్‌గా చూసినప్పుడు రక్తం కాదు.. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గుతోంది. ఫలితంగా చాలామంది రక్తహీనత బారిన పడుతున్నారు. ప్రపంచ దేశాల్లో రక్తహీనత బారిన పడుతోన్న మహిళలు.. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలైన భారత్, పాకిస్తాన్‌లోనే ఎక్కువట. ఏ వయసు వారైనా రక్తహీనత బారిన పడొచ్చు.

05/05/2019 - 22:44

* యుక్తవయసులో ముఖంపై మొటిమలు రాకుండా ఉండాలంటే నూనెలతో చేసే వంటకాలకు దూరంగా ఉండాలి. ఆయిల్‌ఫుడ్‌తో పాటు జంక్‌ఫుడ్‌కు అలవాటుపడేవారు మొటిమల సమస్యను ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు.
* రక్తంలో మలినాలు చేరడం వల్లే మొటిమలు వస్తుంటాయి. గనుక రక్తప్రసరణ బాగా జరిగేలా శారీరక వ్యాయామం చేస్తుండాలి. నడక, ఎక్సర్‌సైజులు, పలురకాల ఆటల వల్ల రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది.

05/03/2019 - 18:40

* ఉడికించిన బంగాళాదుంపలను ఎగ్ స్లయిసర్‌తో కోస్తే ముక్కలు బాగా వస్తాయి.
* పుదీనా పచ్చడిలో కాస్త పెరుగు కలిపితే రుచి, రంగు బాగుంటాయి.
* కిచెన్‌లో బొద్దింకల బాధ తొలగిపోవాలంటే గది మూలల్లో కాస్త బోరిక్ పౌడర్‌ను చల్లాలి.
* బేకింగ్ సోడాలో ముంచిన స్పాంజితో తుడిస్తే మైక్రోఓవెన్‌లో దుర్వాసన తొలగిపోతుంది.

05/02/2019 - 19:07

ఇంట్లో ఏదైనా వేడుక ఉంటేనో, ఏదైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తేనో మనకు అందంపై, సింగారంపై మోజు కలుగుతుంది. మనకు కావాల్సినప్పుడు అందం కావాలి అనుకుంటే వెంటనే వచ్చేయదు. అందంపై అప్పుడప్పుడూ శ్రద్ధ తీసుకోవడం కాకుండా నిత్యం అందంపై శ్రద్ధ తీసుకుంటేనే నిత్యం యవ్వనంగా కనిపించడానికి సాధ్యం అవుతుంది. అంత సమయం ఎక్కడుందండీ.. అంటారా.. ప్రతిరోజూ దినచర్యలో భాగంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అందంగా ఉండచ్చు..

04/30/2019 - 18:24

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం కళే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వంటగదిలో ఎక్కడో ఒకచోట అపరిశుభ్రత తాండవిస్తుంది. ఇది కాస్తంత ఇబ్బందికరమే.. ముఖ్యంగా మైక్రోవేవ్స్ విషయానికి వచ్చేసరికి శుభ్రపరచడానికి బద్ధకం వేస్తుంది. కానీ వంటగదితో పాటు వంటగదిలోని వస్తువులను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా ముఖ్యమే.. మైక్రోవేవ్స్‌ను పరిశుభ్రపరచుకోవడం కొంత ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని శుభ్రపరచాలంటే మరింత శ్రద్ధ కనబరచాలి.

04/26/2019 - 19:33

గర్భవతిగా ఉన్నప్పుడు సహజంగానే శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. వీటికి తోడు రకరకాల అనారోగ్యాలు, అసౌకర్యాలు నిరంతరం కలుగుతూనే ఉంటాయి. కొన్ని సహజంగా కలిగే అసౌకర్యాల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ అవగాహనతో వాటిని ఎదుర్కోవడం కూడా సులువు అవుతుంది.
వికారం

Pages