S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/30/2018 - 01:31

షిబూషీ (జపాన్), సెప్టెంబర్ 29: జపాన్‌కు దక్షిణ ప్రాంతంలోని ద్వీపంలో శనివారం శక్తివంతమైన పెనుతుపాను అల్లకల్లోలం సృష్టించింది. ఈ తుపాను తాకిడికి 17 మంది గాయాలయ్యాయి. ఈ వారంతం వరకు ఈ పెనుతుపాను, గాలుల తీవ్రత సాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. టైఫూన్ ట్రామీ అంటే పెనుగాలులతో కూడిన తుపాను సమయంలో గంటకు 134 మైళ్ల వేగంతో గాలులు వీస్తాయి.

09/30/2018 - 01:19

న్యూయార్క్, సెప్టెంబర్ 29: అంతర్గత రాజకీయ వత్తిళ్ల వల్లనే భారత్ పాకిస్తాన్‌తో చర్చలకు ముందుకు రావడం లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ అన్నారు. దేశీయంగా రాజకీయ వత్తిళ్లు, ఎన్నికల నేపథ్యంలో పాక్‌తో చర్చలను భారత్ రద్దు చేసిందన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రుల మధ్య జరగాల్సిన చర్చలు రద్దయిన విషయం విదితమే.

09/29/2018 - 05:33

న్యూయార్కు, సెప్టెంబర్ 28: దక్షిణాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరతలకు ఉగ్రవాదమే అతిపెద్ద సవాల్‌గా పరిణమిస్తోందని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. సార్క్‌దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడిన ఆమె పాకిస్తాన్‌పై పరోక్షంగా ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న అన్ని మార్గాలను మూసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆమె ఉద్ఘాటించారు.

09/29/2018 - 05:28

న్యూయార్క్, సెప్టెంబర్ 28: భారతదేశంలో పర్యటించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని, ఇటీవలి కాలంలో ఆయన చేసిన సానుకూల వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని ప్రభుత్వ ఉన్నతాధికారు ఒకరు అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కొత్త పుంతలు తొక్కించాలన్న ఆకాంక్ష ఆయన చర్యల్లోనూ, వ్యాఖ్యల్లోనూ వ్యక్తమవుతోందని తెలిపారు.

09/29/2018 - 02:32

మకస్సార్ (ఇండోనేషియా), సెప్టెంబర్ 28: ఇండోనేషియాను భూకంపం కుదిపేసింది. ఈ ద్వీపకల్పంలో భూకంప తీవ్రత వల్ల సునామీ సంభవించింది. సులావేసి ద్వీపంలోని నగరాన్ని సునామీ రాకాసి అలలు ముంచెత్తాయి. దీంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. రిక్టర్ స్కేలుపై 7.5 పరిమాణంలో భూకంప తీవ్రత నమోదైంది. సునామీ అలలు పెద్ద ఎత్తున నగరాన్ని చుట్టుముట్టాయి.

09/28/2018 - 00:30

న్యూయార్కు, సెప్టెంబర్ 27: కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసి) లేవనెత్తడానికి ఎలాంటి అధికారాలు లేవని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

09/27/2018 - 05:42

ఐక్యరాజ్య సమితి: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీరిక లేకుండా పలువురు నేతలను కలుస్తున్నారు. బుధవారం ఆమె ఫిజీ, ఇస్టోని యా, సురీనామ్ దేశాల నేతలకు ద్వైపాక్షిక సం బంధాలపై చర్చలు జరిపారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారం, మద్దతుపై ఆమె చర్చంచారు.

09/27/2018 - 05:22

హాంకాంగ్, సెప్టెంబర్ 26: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమం దాదాపు తగ్గుముఖం పట్టింది. చైనా ఆధీనంలోకి హాంకాంగ్ వెళ్లిపోయిన కొత్తల్లో ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థను నెలకొల్పాలని పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చింది. చైనా మాత్రం కొన్ని రోజులు ఓపిక పట్టినట్లు పట్టి ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని అణచివేసింది. ఈ రోజు ఏమి మాట్లాడితే ఏమవుతుందనే భ యం ప్రజలను పట్టి పీడిస్తోంది. పౌర హక్కు ల ఉల్లంఘన బాహాటంగా జరుగుతోంది.

09/26/2018 - 02:08

షిల్లాంగ్, సెప్టెంబర్ 25: ఈశాన్యరాష్ట్రాల్లో రహదారుల అభివృద్ధి, వౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.90 లక్షల కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ నిధులను మంజూరు చేసిన ఘనత బీజేపీ సర్కార్‌కు దక్కుతుందని ఆయన చెప్పారు.

09/26/2018 - 02:01

వాషింగ్టన్, సెప్టెంబర్ 25: త్వరలోనే ఉత్తర కొరియా అధినేత కిమనన్ జాంగ్‌తో రెండవ విడత చర్చలు జరపనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించారు. అణు నిరాయుధీకరణపై ఇటీవల సింగపూర్‌లో చర్చల జరిపామన్నారు. ఈ చర్చల అమలు ఎంతవరకువచ్చిందనే అంశంపై వచ్చే సమావేశంలో కూలంకషంగా మాట్లాడనున్నట్లు ఆయన చెప్పారు.

Pages