S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/14/2018 - 01:39

ఖాట్మాండూ, అక్టోబర్ 13: హిమాలయ పర్వతాల్లో మంచు చరియలు ఆకస్మికంగా విరిగిపడిన ఘటనలో తొమ్మిది మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన పర్వతారోహకుల్లో విషాదం నింపింది. నేపాల్ వౌంట్ గుర్జా క్యాంపులో ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో ఐదుగురు దక్షిణ కొరియా జాతీయులు ఉన్నారు. నేపాల్ పశ్చిమ ప్రాంతంలో దౌలాగిరి పర్వతప్రాంతంలో సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తున ఆకస్మికంగా మంచుచరియలు విరుచుకుపడ్డాయి.

10/13/2018 - 23:27

వాషింగ్టన్, అక్టోబర్ 13: చైనా పక్షపాతంతో కూడిన వాణిజ్య విధానాలను అనుసరిస్తోందని, అందువల్లే తన పాలనా యంత్రాంగం గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆ దేశంపై ఆంక్షలు విధించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. చైనా అమెరికాకు ఎగుమతి చేసే సరుకులపై ట్రంప్ ప్రభుత్వం జూన్ నెల నుంచి క్రమంగా సుంకాలను పెంచుతూ వస్తోంది.

10/13/2018 - 01:12

దుషాంబే, అక్టోబర్ 12: ఉగ్రవాదం పంజాను ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సమిష్టిగా పోరాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించే వాతావరణ మార్పులపై మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని, కాలుష్య కోరల్లోంచి మానవాళికి విముక్తి కల్పించాలన్నారు. శాంతి సాధించాలంటే సహకారం అవసరమని ఆమె చెప్పారు.

10/11/2018 - 02:24

వాషింగ్టన్, అక్టోబర్ 10: మానవ శరీరంలోకి వ్యాపించి, పలురకాలపైన ఇన్‌ఫెక్షన్లను కలిగించే బాక్టీరియా, వైరస్‌ను సమర్థంగా నిరోధించడానికి సరికొత్త వైద్య విధానం త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అమెరికాలోని రట్‌గర్స్ విశ్వవిద్యాలయ శాస్తవ్రేత్తలు జరిపిన పరిశోధనా ఫలితాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

10/11/2018 - 06:25

జెనేవా: గత 20 సంవత్సరాలుగా జరిగిన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఆర్థిక నష్టంతో పోలిస్తే ఇటీవల అమెరికాలో జరిగిన వాతావరణ సంబంధిత ప్రకృతి విళయాల వల్ల దేశంలో 2.25 బిలియన్లకు పైగా నష్టం సంభవించినట్టు ఆ దేశం బుధవారం ప్రకటించింది. ఇది గతంలో కన్నా 250 శాతం అధికమని తెలియజేసింది.

10/10/2018 - 01:24

వాషింగ్టన్, అక్టోబర్ 9: భారత్ ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటోందని ప్రపంచ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. 2018లో 7.3 శాతం, వచ్చే ఏడాది 7.4 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది. చైనాతో పోల్చితే భారత్ 0.7 శాతం అధికంగా వృద్ధిరేటు నమోదు చేస్తుందని తెలిపారు. 2017లో భారత్ 6.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. దేశంలో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయని ఐఎంఎఫ్ నివేదికలో తెలిపింది.

10/09/2018 - 01:27

లాహోర్, అక్టోబర్ 8: దేశద్రోహం, ముంబయిపై ఉగ్రదాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, షాహిద్ ఖఖాన్ అబ్బాసీ కేసులు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ ఫెడరల్ ప్రభుత్వాన్ని లాహోర్ కోర్టు ఆదేశించింది. ఇరువురు మాజీ ప్రధానులపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను సోమవారం కోర్టు విచారించింది.

10/09/2018 - 00:32

స్టాక్‌హోమ్, అక్టోబర్ 8: పర్యావరణ హితంగా సాంకేతిక విజ్ఞానాన్ని మేళవిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించవచ్చునంటూ వినూత్న ప్రక్రియను తెరపైకి తెచ్చిన అమెరికా ఆర్థికవేత్తలు విలియం నార్దౌస్ (77), పాల్ రోమర్ (62) ద్వయానికి ప్రతిష్టాత్మక అర్థశాస్త్ర నోబెల్ బహుమతి లభించింది. సాంకేతిక విజ్ఞానం, పర్యావరణ పరిరక్షణను ఆర్థికవృద్ధితో సంధానం చేస్తూ

10/08/2018 - 01:25

వాషింగ్టన్, అక్టోబర్ 7: రష్యా నుంచి క్షిపణులు కొనుగోలుకు భారత్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమెరికా నీరుకార్చుస్తుందా? రష్యా నుంచి ఎస్ 400 ట్రింఫ్ మిసైళ్ల కొనుగోళ్లకు ఆ దేశాధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్‌తో భారత్ ఒప్పందం ఖరారు చేసింది. ఈ ఒప్పందం విలువ 5.4 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం పట్ల అమెరికా గుర్రుగా ఉంది.

10/08/2018 - 01:04

వాషింగ్టన్, అక్టోబర్ 7: అంతరిక్ష శోధనలో అమెరికా మరింత దూసుకుపోతోంది. నాసా ప్రయోగించిన వాయేజర్-2 వ్యోమనౌక రోదసీ లోతుల్లోకి వెళ్లిందని అక్కడ కాస్మిక్ కిరణాల తీవ్రతనూ కనిపెట్టిందని నిపుణులు వెల్లడించారు. సౌర వ్యవస్థ ఆవలి నక్షత్ర మండలి ప్రాంతాన్ని సమీపించిన ఈ వ్యోమ నౌక అక్కడ కాస్మిక్ కిరణాల ఉద్ధృతిని గుర్తించడం అంతరిక్ష పరిశోధనలో ఓ కీలక ముందడగని నాసా ప్రకటించింది.

Pages