S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

10/02/2017 - 02:43

అంటనానారివో, అక్టోబర్ 1: మడగాస్కర్‌లో ప్రబలిన ప్లేగు వ్యాధిని అరికట్టడానికి ముమ్మర చర్యలు చేపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఆదివారం తెలిపింది. మడగాస్కర్‌లో ప్లేగు వ్యాధి సోకి 24 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ వ్యాధి సంక్రమణను నిరోధించడానికి ప్రభుత్వం దేశంలో బహిరంగ సమావేశాలపై నిషేధం విధించింది. మడగాస్కర్ దేశ రాజధాని అంటనానారివోలో ఇటీవల ప్లేగు వ్యాధి సోకి ఆరుగురు మృతి చెందారు.

10/02/2017 - 01:52

న్యూఢిల్లీ, అక్టోబర్ 1: అణు పరీక్షల అంశంపై ఉత్తర కొరియాతో చర్చలు జరపడం వల్ల సమయం వృథా కావడమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చేశారు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ను ‘లిటిల్ రాకెట్ మ్యాన్’గా తన ట్వీట్‌లో ట్రంప్ సంబోధించారు.

09/30/2017 - 02:08

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 29: అణ్వస్త్ర నిరాయుధీకరణ లక్ష్యాలను సాధించేందుకు గాను అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాల మధ్య విశ్వాసాన్ని పాదుకొలపడానికి ఈ దేశాల మధ్య అర్థవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని భారత్.. ఐక్యరాజ్య సమితికి నొక్కి చెప్పింది.

09/30/2017 - 02:07

కోక్స్ బజార్, సెప్టెంబర్ 29: రోహింగ్యా ముస్లింలు ఎదుర్కొంటున్న భయానక పరిస్థితుల నుంచి వారిని కాపాడాలని, వారి సమస్యలను పరిష్కరించాలని ఐక్యరాజ్య సమితి (ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరిస్ మైన్మార్ నేతలకు పిలుపునిచ్చారు.

09/29/2017 - 02:12

వాషింగ్టన్, సెప్టెంబర్ 28: అమెరికా వచ్చే ఏడాది స్వీకరించే శరణార్థుల సంఖ్యను గణనీయంగా కుదించనుంది. వచ్చే ఏడాది కేవలం 45 వేల మందిని మాత్రమే అంగీకరిస్తుందని, 2016తో అంగీకరించిన వారి సంఖ్యతో పోలిస్తే ఇది సగమే ఉంటుందని తెలుస్తోంది. అయితే అమెరికా తమ దేశంలో ఆశ్రయం కల్పించే శరణార్థుల సంఖ్యను గణనీయంగా తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని మానవతా వాదులు, అమెరికా పార్లమెంటు సభ్యులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

09/29/2017 - 02:11

బీజింగ్, సెప్టెంబర్ 28: చైనాలో ఇటీవల నిర్వహించిన సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా మొట్టమొదటిసారిగా చైనా, పాకిస్తాన్‌లకు చెందిన వైమానిక దళ పైలట్లు యుద్ధ విమానాలను నడిపారు. గురువారం మీడియా సమావేశంలో చైనా ఆర్మీ ప్రతినిధి కల్నల్ వు క్వియాన్ ఈ వీడియోను ప్రదర్శించడం ద్వారా తమ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంతగా బలమైనవో మరోసారి చాటిచెప్పారు.

09/29/2017 - 02:04

లండన్, సెప్టెంబర్ 28: ‘్భగోళం పుట్టుకకోసం రాలిన సురగోళాలెన్నో..’ అన్నారు మహాకవి ఆరుద్ర. విస్తృతమైన ఖగోళ విజ్ఞానాన్ని, ఈ భూగ్రహం ఆవిర్భావానికి దారితీసిన పరిణామాలను ఒక గేయంలో చక్కగా, సమర్థవంతంగా, వినసొంపుగా పొందుపరిచారు ఆరుద్ర. అంటే కోట్లాది మంది జీవిస్తున్న ఈ భూగోళం పుట్టుక అంత సవ్యంగా సాగిందేమీ కాదు.

09/28/2017 - 00:39

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: ఉత్తర కొరియాపై ఏ క్షణంలోనైనా సైనిక దాడి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. క్షిపణి, అణు పరీక్షల విషయంలో ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో ఇక సైనిక చర్యే మిగిలిందన్న సంకేతాలను ఆయన అందించారు.

09/27/2017 - 23:13

వాషింగ్టన్, సెప్టెంబర్ 27: విద్యార్థుల్లో అవగాహనా పటిమ పెంపొందించినప్పుడే స్కూలు విద్యకు సార్థకత ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంక్ స్పష్టం చేసింది. భారత్ వంటి దిగువ, మధ్య ఆదాయ దేశాల్లో ఈ రకమైన అవగాహనా సంక్షోభం, నేర్చుకునేందుకు అందుబాటులో ఉండాల్సిన అవకాశాల రాహిత్యం చాలా తీవ్రంగా ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

09/27/2017 - 23:11

* వారి కష్టాల్లో పాలుపంచుకుందాం
* చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన పోప్

Pages