S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయం

09/22/2017 - 02:25

ఖాట్మండు, సెప్టెంబర్ 21: ప్రపంచంలోనే ఎత్తయి వౌంట్ ఎవరెస్టు ఎత్తును కొలవడానికి నేపాల్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. హిమాలయ ప్రాంతంలో 2015లో సంభవించిన భూ కంపానికి ఎవరెస్టు కొలతల్లో మార్పులొచ్చినట్టు కథనాలు వెలువడిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. నేపాలే సొంతంగా ఈ లెక్కింపును చేపడుతోంది. 1955 భారత సర్వే ప్రకారం వౌంట్ ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లు.

09/22/2017 - 02:25

ఐక్యరాజ్య సమితి, సెప్టెంబర్ 21: అణ్వాయుధాలను నిషేధించడానికి కుదిరిన అంతర్జాతీయ ఒడంబడికపై 50 దేశాలు సంతకాలు చేశాయి. దీంతో ఈ ఒడంబడిక అమలులోకి వచ్చినట్లయింది. ఈ ఒడంబడికను అణ్వస్త్ర సంపన్న దేశాలయిన అగ్రరాజ్యాలు వ్యతిరేకిస్తుండగా, అణ్వస్త్ర నిషేధాన్ని సమర్థించేవారు మాత్రం ఇదో చరిత్రాత్మక ఒప్పందంగా పేర్కొంటున్నారు.

09/21/2017 - 01:15

ఫ్రిన్స్‌టన్ (అమెరికా), సెప్టెంబర్ 20: నిరుద్యోగుల్లో పెరిగిపోయిన నిరాశ, నిస్పృహల నుంచే డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీలాంటి నేతలు ఎన్నికయ్యారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణం కూడా ఇదేనని విశే్లషించారు. ‘తగినన్ని ఉద్యోగావకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైంది. అందుకే, ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది’ అన్నారు.

09/21/2017 - 00:57

మెక్సికో సిటీ, సెప్టెంబర్ 20: గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా మెక్సికో సిటీని కుదిపేసిన పెనుభూకంపంలో మృతుల సంఖ్య 225కు చేరుకుంది. రెక్టర్ స్కేలు 7.1 తీవ్రతతో సంభవించిన ఈ భయానక భూకంప తాకిడికి అనేక భవనాలు కుప్పకూలిపోయాయి. 1985లో కూడా ఈ రకమైన భూకంపం సంభవించినప్పుడు వేల సంఖ్యలోనే మరణాలు జరిగాయి. ఆ భూకంపం 31వ వార్షికోత్సవం రోజునే ఈ తాజా విలయం సంభవించింది.

09/20/2017 - 03:23

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 19: ప్రధాని పదవి నుంచి నవాజ్ షరీఫ్‌కు ఉధ్వాసన పలకడం వెనుక ఆర్మీ పాత్ర ఉందన్న వాదనను పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా కొట్టిపారేశారు. అది అబద్ధం అంటూనే, తాను నిజమైన ప్రజాస్వామ్యవాదినని చెప్పుకున్నారు. పనామా పేపర్స్ కేసులో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు గత జూలై 28న దేశ అత్యన్నత న్యాయస్థానం ఉధ్వాసన పలికడం తెలిసిందే.

09/20/2017 - 03:21

నెపిటా (మైన్మార్), సెప్టెంబర్ 19: మైన్మార్‌లోని రోహింగ్యాల విషయంలో చెలరేగుతున్న వివాదంపై ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించారు. తమ దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగడం లేదని, అంతర్జాతీయంగా ఇందుకు సంబంధించి తనిఖీలు జరిగినా తాము భయపడేది లేదని మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు.

09/20/2017 - 03:14

న్యూయార్క్, సెప్టెంబర్ 19: గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా యావత్ ప్రపంచానికి అణుయుద్ధ భయం పట్టుకుందని, అమెరికా ఉత్తర కొరియాల మధ్య ఎప్పుడు ఈ రకమైన యుద్ధం ముంచుకొస్తుందోనని తల్లడిల్లి పోతోందని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గాటరెస్ ఆందోళన వ్యక్తం చేశారు.

09/20/2017 - 01:31

వాషింగ్టన్, సెప్టెంబర్ 19: దాదాపు అయిదు నెలల క్రితం నిలిపివేసిన హెచ్-1బి వర్క్ వీసాల పరిశీలన ప్రక్రియను అమెరికా తిరిగి ప్రారంభించింది. అమెరికా వెళ్లే భారతీయ ఐటి నిపుణులందరు కూడా దాదాపుగా ఈ హెచ్-1బి వీసాలపైనే వెళ్తుండడం తెలిసిందే.

09/20/2017 - 01:25

న్యూయార్క్, సెప్టెంబర్ 19: ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాల భరతం పట్టాల్సిందేనని, వాటిని గెంటేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్వరంతో పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన ‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న, నిధులను సమకూరుస్తున్న, వారిని పెంచి పోషిస్తున్న దేశాల నిజస్వరూపం బయట పట్టాల్సిందే.

09/19/2017 - 03:45

న్యూయార్క్, సెప్టెంబర్ 18: ఐక్యరాజ్య సమితి (ఐరాస) జనరల్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. భారతదేశ విదేశాంగ విధాన లక్ష్యాలను సాధించేందుకు ఆమె వివిధ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులతో వరుసగా చర్చలు జరిపారు.

Pages