S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/15/2018 - 21:11

ముస్లిం సోదరులకు పరమ పవిత్రమైన రంజాన్ నెల సందర్భంగా నెల రోజులపాటు నిర్వహించనున్న దీక్షలు మే 17నుండి ప్రారంభించి, జూన్ 16న రంజాన్ పండుగ వరకు కొనసాగనున్నాయి. దివ్య ఖురాన్ అవతరించిన రంజాన్ నెలలో పరమ పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలతో, ఉపవాసదీక్షా కంకణులైన ధార్మికులు, భక్తిశ్రద్దలతో అన్ని అలవాట్లకు దూరంగా ఉంటూ, నెల రోజుల దీక్షలో నిమగ్నమై ఉంటారు. మహమ్మదీయుల మతానుసారం సంవత్సరంలో 9వ నెల రంజాన్.

05/09/2018 - 21:39

‘‘ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది’’- ఇది సనాతన ధర్మసూత్రం. ఏది ధర్మం? ఏది ధర్మం కాదు!! ఇది ఆలోచన. ఓ కొడుకు తన తల్లిదండ్రులపట్ల తన బాధ్యతను నెరవేరిస్తే- అదొక ధర్మం- (ఈ సమయంలో ధర్మం పేరు కర్తవ్యం)
ఓ పంచాయతీలో న్యాయంగా మాట్లాడటం- ధర్మం (న్యాయాన్ని ధర్మశబ్దంలో ఇక్కడ వాడతారు)

05/08/2018 - 21:39

పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం....

05/03/2018 - 21:13

‘డాల్టన్ జాన్’ (1766-1884ఎడి) అను ఆంగ్లేయుడు అణు సిద్ధాంతమును కనిపెట్టినట్లు చెబుతున్నారు. లక్షల సంవత్సరముల పూర్వమే గౌతమ మహర్షి తన ‘న్యాయదర్శనమను గ్రంథమునందు’ అణువులే రుూబ్రహ్మాండమందలి చరాచర సృష్టి కంతటికి కారణమని నిరూపించాడు. ఈ అణు స్వరూపమును గురించి మన వేదములు, ఉపనిషత్తులు, ధర్మశాస్తమ్రుల యందు వందల కొలది శ్లోకములు వివరించుచున్నవి.

05/02/2018 - 21:19

ఆయువు, విత్తము, ఇంటిగుట్టు, మంత్రం, ఔషధం, సంగమం, దానం, మానము, అవమానం- అనే ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు. ఇవి రహస్యంగా ఉంచాల్సినవి.

04/29/2018 - 22:40

అవిభక్త కరీంనగర్ జిల్లా గతకీర్తికీ,ప్రాచీన చరిత్రకూ నిలువుటద్దంగా నిలిచియుంది. రాష్ట్ర పురావస్తుశాఖ రిటైర్డ్ డైరక్టర్ డాక్టర్ వి.వి.కృష్ణశాస్ర్తీ అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా ప్రాక్చచరిత్ర 50 వేల సంవత్సరాలకు పూర్వమున్నదని రుజువైతే, అది సామాన్యమైన విషయమేమీకాదు.

04/27/2018 - 23:39

మేలట్టూరు అంటే భాగవత మేళ గుర్తుకు వస్తుంది. ఐదు శతాబ్దాలుగా నిరంతరాయంగా సాగుతున్న తెలుగు కళా వారసత్వ యాత్ర. త్యాగరాజస్వామి సమాధి ఉండే తిరువయ్యూరుకు ఐదారు కిలోమీటర్ల దూరంలో వుండే చిన్న గ్రామం మేలట్టూరు. ప్రతి నరసింహ జయంతికి అక్కడ ఒక వారం పాటు తెలుగు నాట్య నాటకాలు రాత్రులంతా ప్రతిధ్వనిస్తాయి. మేలట్టూరులో ఈ వారంపాటు మేలట్టూరు వెంకట్రామశాస్ర్తీ రచించిన 12 నాట్య నాటకాలలో కొన్ని వేస్తారు.

04/27/2018 - 23:36

‘ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి’ - 1 పేతురు 3:9 మనకు దేవుని దీవెనలు కావాలంటే, ముందు మనం మన తోటివారిని దీవించాలి. ఆశీర్వాదమునకు వారసుడగుటకే దేవుడు మనలను పిలుస్తున్నాడు. అయితే ఒక షరతు. ‘కీడుకు ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ చేయకూడదు’.

04/24/2018 - 21:22

భారతీయ మహర్షులు కనుగొన్న సిద్ధ విషయాల్లో ‘యోగం’ కూడా ఒకటి. మానవుణ్ణి మోక్ష సాధనవైపు తీసుకెళ్ళే పరమోపాయం ‘యోగం’. దీన్ని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ వ్యాప్తం చేశారు. బ్రహ్మ తాను బ్రహ్మయోగాన్ని ఋషులలో వేదర్షి అయిన యాజ్ఞవల్క్య మహర్షికి ప్రబోధించాడు. యాజ్ఞవల్క్య మహర్షి ఆ ‘బ్రహ్మయోగాన్ని’ తన ‘జాయ’ అయిన గార్గి (గార్గేయి)కి ఉపదేశించాడు.

04/19/2018 - 21:36

ప్రపంచంలో ఉన్న మతములన్నింటిలోను హిందూ మతం చాలా పురాతనమైనది. ఈ మతమునే ఎక్కువమంది ప్రజలు అనుసరిస్తారు. వీరినే హిందువులని వ్యవహరిస్తారు. హిందువు అనే పదము ఎప్పుడు, ఏ విధంగా ఉద్భవించింది? అనుకొంటే ఈ పదము వేదాలలోగాని, ఉపనిషత్తులలోగాని, పురాణములలోగాని, మత గ్రంథములలో కాని కనిపించదు. త్రేతాయుగము నాటి రామాయణంలో గాని, సుమారు 5250 సం.ల నాటి ద్వాపర యుగంలోని భాగవతం, మహాభారతం, భగవద్గీతలోకాని కనిపించదు.

Pages