S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/25/2020 - 22:15

84 లక్షల జీవుల్లో కేవలం మనిషికి మాత్రమే తన స్పందనను నోటి ద్వారా తెలియపర్చగలడు. మూగజీవాలు ఎంతో వేదనకు గురైనా అవి వాటి బాధను నోటితో వ్యక్తపరచలేవు. అట్లానే సుఖాన్నై, సంతోషానైన్నా అవి మాట తో వ్యక్తీకరించలేవు. కానీ మనిషి మాత్రమే తన లోని బాధనుకానీ, సంతోషాన్నీ కానీ మాటతో ఇతరులకు చెప్పగలుగుతాడు.

02/24/2020 - 22:32

సంఘజీవి మానవుడు. సమాజంలో తాను గౌరవం పొందాలనుకోవడం, తాను ఆధిక్యునిగా ఉండాలనుకోవడం చాలా సహజం. ఇలా గౌరవం పొందాలనుకుంటే కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. వాటిని చూద్దాం.
‘వస్త్రేణ వపుషా, వాచా, విద్యయా, వినయేనచ
వకారైః పంచనిర్హీనో నరో నాయాతి గౌరవమ్

02/24/2020 - 22:32

శివ శబ్దం మంగళకరమైనది. అందుకే శివుణ్ణి మంగళకరుడు, కల్యాణకరుడు అని పిలువడం జరుగుతోంది. శంకరుడు కరుణా సముద్రుడు. భక్తవశంకరుడు. అందుకే భోళాశంకరుడుగా పిల్వబడుతూన్నాడు.

02/21/2020 - 05:28

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. మాఘం అంటే (మ+అఘం) పాపం లేనిది. పాపం అంటనిది అని భావం. ఈ రోజున బ్రహ్మమురారుల మధ్య వారి తగవును తీర్చడానికి జ్యోతిర్లంగమై ఆవిర్భవించాడని శివపురాణ కథనం. ‘శివ’ అంటే ‘‘ఏది కాదో ఏది లేదో అది’’ అని శాస్త్రార్థం. శూన్యమే శివం. ఆకాశరూపం. అన్నిటినీ తనలో లయ చేసుకునే శక్తిని పొందినది. శివుడు జగమంతానే అయినవాడు. అన్నీ తానే అయినవాడు. రూపం లేని వాడు. వేదమయ స్వరూపుడు.

02/20/2020 - 22:28

శివపూజకు
వేళాయంటూ
అడవి అంతటా పూసిన
మోదుగుపూల అరుణకాంతులు
ఉషాకిరణాల సమ్మిళితమై
మిరుమిట్లు గొలుపుచుండగా
ఆకుపచ్చని చీర కట్టిన
ప్రకృతి కాంత
పంచవనె్నల రామచిలుక
కనువిందుగా
మలయ మారుత
శిశిర శీతలములకు
సోయగాలు పోగ..
సప్తవర్ణ సొబగులద్దుకున్న
లతాంతికలు
పారిజాత సుగంధ
పరిమళాలు వెదజల్లగా

02/20/2020 - 22:27

మహాశివరాత్రి పర్వదినం వేళా
మనసంతా శివనామస్మరణమే..
జగమంతా శివస్వరూపమయమే..

ప్రాతః సమయాన
పవిత్ర స్నానాలు
పరిశుద్ధ వస్త్ధ్రారణలు
మందిర పుష్పాలంకరణలు
వేనవేల దీప కాంతులతో
ప్రతి ‘హృది’ భక్తి పరవశమే..
ప్రతి ‘లోగిలి’ పవిత్ర మందిరమే..

02/19/2020 - 22:20

మానవజాతి ఈ సృష్టిలో మహోత్కృష్టమైనది. ఆలోచనా జ్ఞానం, విచక్షణ వంటి పలు విశిష్టతలతో విలక్షణమైన లక్షణాలతో మానవ మేథస్సు సృష్టించబడింది. ఈ సృష్టిలో అద్భుతమైన శక్తిసంపదల సృష్టికి మానవ మేథస్సు నిలువెత్తు సాక్షిభూతం. కొన్ని జీవరాశులు మానవ జాతి కంటే బలమైనవి అయినా వాటికి బుద్ధిబలం, విచక్షణా శక్తి లేకపోవడం పెద్ద లోటు. అందుకే అన్ని విధాలా సకల జీవరాశులలో మానవుడే అత్యంత శక్తిసంపన్నుడు.

02/19/2020 - 22:18

తేజోలింగ రూపంలో శివుడు అర్థరాత్రి ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. అందుకే ఆ రాత్రి జాగారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు శివుడు లింగ రూపం నుండి నిజరూపానికి వచ్చే శుభప్రదమైన రోజు కూడాను. మహాశివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

02/18/2020 - 22:25

కలి మానవులు అజ్ఞాన వశమున పాపరతులై యుండి పలు క్లేశాలను అనుభవిస్తూ ఉంటారు. తరుణోపాయం సాయం కొరకు తమ బాధలను దుఃఖములను బాపుమని పరమేశ్వరుని వేడుకుంటూ వుంటారు. శివుడు భోళాశంకరుడు గదా! ఇది తెలిసి కూడా నిశ్చల భక్తితో, శ్రద్ధతో, ఆరాధనలు చేయాలనే తలంపును మరచిపోతూ ఉంటారు. పరమశివుని సేవించినచో ఫలము నిండుగా లభిస్తుంది. కానీ పర్వ దినాలలోనే తమ భక్తిని చాటుకొనుటకు శివలింగారాధన చేస్తూ వుండటం జగద్విదితమే.

02/18/2020 - 22:20

మన దైనందిన జీవితంలో సంవత్సరం, మాసం, తిథులు, నక్షత్రాలు, రాశులు, గ్రహణాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మతాన్ని నమ్మేవారు, శుభ ఫలితాలను కోరేవారు మంచి శకునం, మంచి దినం చూసుకునేవారు కోకొల్లలు.

Pages