S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/18/2019 - 18:48

అగ్నికైన ఆలంబన నీటికైన నిలువ నీడ
పులుగుకైన నుండ గూడు పుట్ట భుజగమునకు

చీకటి వెలుగుల ఖేలకు మేదిని వేదిక
విశ్వంభర లేక యునికి విశ్వమ్మున కేదిక?

ఆ భూమికి అనుగుపుత్రి సీతమ్మ కాదో?
ఆ భూమిని ఉద్భవించి భూమి నిర్గమించదో?

ఆ భూమియె ఆ సీత! ఆ సీతయె సత్య!
సత్యయె సత్యమ్ము సీత సత్యమీ మాట!

02/18/2019 - 18:21

జీవితంలో విజయం సాధించచటం అంటే, అంతులేని ధనరాశులు కూడబెట్టడం విలాసవంతమైన భవనాలు నిర్మించడమని భావిస్తారు. అవి అవసరమే, కాని, వాటిని మాత్రమే సాధించడం ఘనవిజయంగా భావించడం ఉచితమేనా? ఈ విషయాలు మనసుకు అఖండ సంతృప్తి కలిగించే అపూర్వవిజయాలుగా కనిపిస్తాయా ? అనిపిస్తాయా? జీవితం ఏ కోణంలోనుంచి చూసినా పరిపూర్ణత్వపు మాధుర్యంగా పల్లవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. సాఫల్యమకుటం.

02/18/2019 - 18:22

స్తంభమును బట్టుకొని, పడిపోవుదునను భయము లేకుండ దాని చుట్టును దిర్దిర తిరుగు బాలుని తీరున భగవంతునిపై మనసు నిలిపి నీ సంసారిక ధర్మములను నిర్వర్తించుచుండుము. నీకెట్టి అపాయమును గలుగదు.

02/17/2019 - 22:09

అనగానే అక్కజమున వారు మునిగిపోయిరి
ఎప్పుడెట్టుల తేరుకొనిరొ ప్రశ్నల వర్షించిరి

కృష్ణపత్నులు
అది ఏమిటి విడ్డూరం మా సత్యే సీతయనుట?
అది ఏమిటి మీరెట్టుల రాముండా నాడు?

అష్టకష్టములను ఓడిన సీతమ్మోరెక్కడ?
అష్టైశ్వర్యాలదేలు సత్యభామ ఎక్కడ?

సతి నొక్కతెనేలుకున్నశ్రీరాముండెక్కడ?
వేనవేల కనె్నబ్రతుకులేలిన మీరెక్కడ?

02/17/2019 - 21:59

రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా..
*

02/15/2019 - 19:30

నా ప్రాణమె నన్నువీడి మరల కలిసినట్లు నన్ను
నన్నమరుని చేసెనోయి నారుక్మిణి నన్ను

తనకొంగున ఇనుని ధాత్రి ముడివేసిన రీతిని
నను సిగలో పూవువోలె ముడుచుకొనియె సత్య

ఒక మేఘం పైట జార్చినను బానిస చేసెను
ఒక చేడియ వీణియయై నన్ను కవుగిలించెను

ఒక తారక కన్నుగిలిపి నాపై వలవేసెను
ఒక కెరటం వలయమ్మై నన్ను చుట్టుముట్టెను

02/14/2019 - 19:44

మీ వనె్నల జాబిలిలో గంతులేయు కుందేటిని
మీ చినె్నల తోటలల తిరుగాడెడి తేటిని

ఈ ఒప్పుల కుప్పలపై రాలిన నెమలీకని
మీ కటారి చూపులందు నలిగిన పూరేకుని

మీ నవ్వుల రాలినట్టి పువ్వు లేరుకొంటిని
మీ కన్నుల జాలువారు రవ్వలేరుకొంటిని

మీ నడకల కులుకులందు తళుకులేరుకొంటిని
మీ కౌగిలిలోన కరిగి కర్పూరమ్మైతిని

02/13/2019 - 20:02

ఇంత వశీకరణ మెచట కొని తెచ్చితివోరుూ?
ఇంత రసిక శిఖామణివి నోరు కదపవేమోయి?

నడిచినచో నడుచుమేర తొణికిసలాడును అందం
ఒలికిపోవు సోయగాలె సృష్టికి మూలమ్ములనగ

పరుగెత్తిన వెనకపడును కాలప్రవాహమ్మే
దారులందు జారిపడిన చిరుమువ్వల నేరుకొనగ

నిలిచినచో నిలిచిపోవు నిఖిల ప్రపంచమ్మే
నిలువెత్తున నిన్ను కొలిచి నీకంజలి ఘటింపగ

02/13/2019 - 20:00

భారత దేశ నాగరికతకు మతము జీవకర్ర వంటిది. మతత్రయాచార్యులలో, వైష్ణవమత బోధకులలో అగ్రగణ్యులైన శ్రీమధ్వాచార్యులు ఒకరు. త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వమతస్తులు అంటారు.

02/12/2019 - 18:58

కృష్ణపత్నులు:
ఎంత అందమోయి నీది? ఎంత అందగాడవోయి?
ఎంత మధుర మోయి మోవి? ఎంత మధుర మోయి?

ఈ అందం, ఈ చందం నీకెక్కడివోయి?
ఈ కన్నుల సోయగాలు ఏ తారలవోయి?

నీలి నీలి దేహమ్మున సాగరమ్మె పొంగినట్లు
నీలి నీలి కురులలోన జలపాతము లీదినట్లు

చెక్కిలిలో లెక్కలేని చుక్కలు కలహించినట్లు
నవ్విన పడు సొట్టలందు నదులు సుడులు తిరిగినట్లు

Pages