S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/11/2020 - 22:32

నిజం చెప్పడంవల్ల హింస, కష్టం, విపత్తు వాటిల్లుతాయని తెలిస్తే నిజం చెప్పకపోవడమే ఉత్తమం. ఇదేంటి అందరూ సత్యమే మాట్లాడాలి. ధర్మమే ఆచరించాలి అని చెప్తారు కదా. మరి ఇదేమిటి ఇలా అంటారు అనుకుంటున్నారా? ఒక్కోసారి అబద్ధాల వల్ల చెడు జరుగకుండా ఉంటుంది. మంచి జరగకున్నా ఫర్వాలేదు కానీ చెడు జరిగితే మంచిది కాదు కదా.

02/11/2020 - 22:31

ప్రకృతి పురుషుడు ఇద్దరూ పరస్పరాధారితాలు. పరస్పర సహయకారులు. ప్రకృతి లేకుంటే పురుషుని ఉనికి లేదు. పురుషుడు లేకుంటే ప్రకృతి ఉనికీ అగమ్యగోచరమే. ఇక్కడ పురుషుడంటే కేవలం మానవుడు అనే అర్థం గ్రహించాలి. గ్రహాలు, వృక్షాలు, పర్వతాలు, నదులు, జలపాతాలు, గాలి మొదలైన అనేకానేక అణువులో విశ్వం ఏర్పడింది. ఆ విశ్వంలో జీవన పరిణామక్రమానికి ప్రకృతి ఎంతో సహాయపడుతూ వస్తోంది.

02/10/2020 - 22:13

నక్షత్ర మండల మార్గాన్ని అనుసరించి చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఆ మార్గంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. సదరు మార్గాన్ని మన పూర్వీకులు ఇరవై ఏడు భాగాలుగా విభజించారు. అవి దాదాపు సమానంగా ఉంటాయి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు పెట్టారు. ఆ భాగంలో ఎక్కువ కాంతివంతంగా ఉండే నక్షత్రాన్ని బట్టి ఆ భాగానికి పేరు పెట్టారు. ఇరవై ఏడు నక్షత్రాలలో మఘ ఒకటి.

02/10/2020 - 22:12

‘‘మాతాచ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తాచ స్వదేశో భువనత్రయం’’.

02/10/2020 - 22:09

మనస్సును, బుద్ధిని నియంత్రించి కామాన్ని జయించాలి. కామశత్రు విజయమే కైవల్యం. ఆత్మానందం పొందటమే గమ్యం. కైలాసం పోనవసరం లేకుండా ఆ ఆనంద చిన్మయ స్థితిని అనుభవించవచ్చు ఇక్కడే.

02/06/2020 - 22:45

గిరిజన జాతరలలో విశిష్టమైంది మేడారం జాతర. సమ్మక్క, సారమ్మల జాతర అనీ కూడా ఈ జాతరను పిలుస్తారు. రెండేళ్లకు ఒకసారి ఈ జాతరను నిర్వహిస్తూంటారు. 900ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతర 1940 వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకుంటూ ఉండేవారు. కానీ ఆ తర్వాత తెలంగాణా ప్రజలంతా కలసి జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. 1996లో అప్పటి రాష్ట్రప్రభుత్వం ఈ పండుగను రాష్టప్రండుగగా గుర్తించింది.

02/06/2020 - 22:42

భక్తజన సందోహంతో
అడవి పల్లె విరిసింది
వన దేవతల కొలుపుతో
మేడారం మురిసింది.
పసుపు కుంకుమతో
పుడమి పూత పూసింది
మునకులు, తలనీలాలతో
జంపన్న వాగు ఎగిసింది
జమిడిక డప్పు మోతతో
చిలకల గుట్ట చిందేసింది
నిలువెత్తు బంగారు రాశితో
తల్లిగద్దె తడిసి ముద్దయింది
సిగమూగు డోలి రాగాలతో
కొమ్మరెమ్మ ఊయలూగింది
ఎదురుకోళ్లు

02/05/2020 - 22:59

విఘ్నంకరుడైన వినాయకుని పూజించనివారు ఎవరూ ఉండరు. అటువంటి వినాయకుడిని ప్రతి మంగళవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 9:30గంటల వరకు దేవాలయం నందు సామూహిక వినాయక వ్రతములు, గణపతి హోమము, మహార్చన, సాయంకాలర్చన గణపతిని ఉద్దేశించి అందరికీ అన్నదానము చేయడానికి వరంగల్ జిల్లా కాజీపేటలో ఉన్న స్వయంభూ శ్రీశే్వతార్కమూల గణపతి స్వామి ఆలయం ఉంది.

02/05/2020 - 22:56

బాబా ఉపదేశాల్లోనే అత్యం త ముఖ్యమైనది. ఎపుడూ ఓర్పు గురించే బాబా ఎక్కువగా చెప్పే వారు. భక్తి ఉండాలి. పని చేసేటపుడు, లేదా విద్య నేర్చుకునేటపుడు శ్రద్ధ తప్పని సరిగా ఉండాలి అని పదే పదే చెప్పేవారు. ఓసారి బాబా అన్నారు - ‘‘ఈ ఒక్క ఉపదేశాన్ని విను, చదువు, మననంచేయి, ధ్యానము చేయుము. భగవంతుడు నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు’’. కానీ ఎవరికీ ఏమంత్రాన్ని బాబా ఉపదేశించే వారు కాదు.

02/05/2020 - 22:54

దేనితోనూ సంబంధం లేకుండా తన బాధ్యతను మాత్రమే చిత్తశుద్ధితో నిర్వర్తించేవాడు. అంటే, ఏ విషయాలూ పట్టించుకోకుండా సోమరిలా వుండేవాడనో లేక, ఎవరెక్కడపోతే నాకేమని తన స్వార్థం తను చూసుకునే వాడనో కాదు. తనకు సంప్రాప్తించిన జన్మకు సంబంధించి ఏ కార్యములు నిర్వర్తించ తగవాడో, ఏ కర్మలు తనకోసం ఎదురుచూస్తున్నాయో వాటిని విస్మరించకుండా ఫలితములపై ఆపేక్షను చూపని వాడు.

Pages