S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/25/2018 - 19:14

చేయాలనుకొంటే మార్గాలు వాటంతట అవి తెలుస్తుంటాయి. మొట్టమొదట ఆలోచన వస్తే చాలు దాన్ని అల్లుకుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కేరళలో ప్రకృతి విలయతాండవం చూసి ప్రతి ఒక్కరి మనస్సు బెంబేలెత్తింది. ఇట్లా ప్రకృతి వికృతించడానికి కారణం మనమే కదా. ప్రకృతిని పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కనుక ఎక్కడో ఒకచోట ప్రకృతి తన కోపాన్ని చూపిస్తోంది. ఎన్నో వేల కోట్లు నష్టం జరిగిపోతుంది.

10/24/2018 - 19:32

రోజులు మారాయి. వాళ్లు వీళ్లు అనే తేడా ల్లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంట్లోకి వచ్చేసరికి మాత్రం స్ర్తిలే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. సగం సగం అని ఎంత చెప్పినా చాలామంది స్ర్తిలే ఇంట్లో పనులను చక్కబెడుతారు. అట్లానే ఇంటిని అలంకరించడంలో కూడా స్ర్తిలదే ఎక్కువ పాత్ర ఉంటుంది.

10/23/2018 - 18:46

కస్తూరీ తిలకం లలాట ఫలకే
వక్షఃస్థలే కౌస్త్భుం నాసాగ్రే నవ
వౌక్తికం కరతలే వేణుం కరే కంకణం

10/22/2018 - 22:52

నేడు పైడితల్లి సిరిమాను సంబరం
*

10/21/2018 - 23:55

‘‘భర్త అంటే భార్యకు యజమాని కాదు, వేరొకరి భార్యతో మరో పురుషుడు సంబంధం పెట్టుకుంటే- ఆ కారణంగా విడాకులు కోరవచ్చు, అది తప్పిదం తప్ప ఆ చర్య శిక్షార్హమైన నేరపూరితమైనది కాదు’’- సుప్రీంకోర్టు మన శిక్షాస్మృతిలోని 158 ఏండ్ల నాటి చట్టం చెల్లదంటూ కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు సారాంశమిది.

10/20/2018 - 00:08

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలతో సహా అనేక రాష్ట్రాల్లో దేవదాసీ వ్యవస్థ ఉండేది. అమ్మాయిలను దేవుళ్లకిచ్చి పెళ్లి చేసే సాకుతో వారిని లైంగిక బానిసత్వంలోకి నెట్టేసేవారు ఊరి పెద్దలు. ఈ సంప్రదాయం ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది. ఇలాంటి ఆచారాన్ని రూపుమాపడంలో కీలకపాత్ర పోషించింది కర్నాటకలోని బెల్గాం ప్రాంతానికి చెందిన సీతవ్వ జోడట్టి. ఈమె కూడా దేవదాసీనే.

10/17/2018 - 23:53

విశ్వాన్ని బ్రహ్మశక్తితో సృష్టిస్తుంది, జగన్మాత. సృష్టించిన ప్రపంచాన్ని విష్ణుశక్తితో రక్షిస్తుంది. ‘రుద్ర’ శక్తితో సకల చరాచర సృష్టిని సంహరిస్తుంది. ఒకప్పుడు సంహరించేందుకు బదులుగా, తన ఐశ్వర్య శక్తితో సృష్టిని తనలో లీనం చేసికొంటుంది. ఇదే- తిరోధానం. ఇది సంహారం కాదు, ఉపసంహారం. మరొకప్పుడు సదాశివ రూపంలో ప్రాణికోణినంతటిని అనుగ్రహిస్తుంది.

10/16/2018 - 04:24

‘‘ఈశానాం జగతోస్య వేంకట పతేర్విష్ణోః పరాం ప్రేయసేం
తద్వక్షస్థల నిత్యవాసి రసికాం తక్షాంతి సంవర్థనీం
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసన స్థాం శ్రీయం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్’’
-శ్రీవేంకటేశ ప్రపత్తిః

10/14/2018 - 23:47

‘‘అగ్నేనయ సుపధారాయే అస్మాన్’’ వేదకాలంనుండి అనాదిగా, అగ్నిదేవుడు ఉష్ణశక్తికి ప్రతీకగా ఆరాధింపబడుతున్నాడు. అగ్నిదేవుణ్ణి, విశ్వశక్తిని తెలిసికొనే ‘సుపధ’ అంటే మంచి మార్గాన్ని తెలుపవలసిందిగా ప్రార్థన చేశారు. పదార్థము, శక్తీ అన్న రెండూ సృష్టికి మూలకారణం. సృష్టి స్థితిక్రమంలో మరణానంతరం, జీవుడు తన కర్మ జ్ఞానాలను బట్టి అనుసరించే రెండు మార్గాలు- దేవయానం, పితృయానం. అవే వెలుగు చీకటి మార్గాలు.

10/12/2018 - 19:40

జరుగుతున్న ప్రతి క్షణంలో, జీవిస్తున్న ప్రతి ప్రాణిలో, కదిలే ప్రతి కణంలో, ప్రసరించే ప్రతి కిరణంలో, తల్లి శక్తి వ్యక్తమవుతుంది. పాంచభౌతికమయిన మన శరీరమే జగన్మాత ఆలయం. ఈ విశాల కువలయం- జగదంబ ఆలయం- విశ్వమంతా ఆమె చైతన్యమే. అశాశ్వతమైన దేహభ్రాంతిని తొలగించుకొంటేనే ఆత్మతత్త్వం బోధపడుతుంది. ఆ ఆత్మతత్త్వమే శ్రీ లలితా పరమేశ్వరి.

Pages