S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/30/2018 - 23:18

శ్రమలేని జీవితం సుఖదాయకమే గానీ శుభదాయకం మాత్రం ముమ్మాటికీ కాదు. శాస్త్ర వినియోగం ద్వారా యాంత్రికమైన జీవితం నేటి ఆధునిక మానవులను శ్రమకు దూరం చేయడం- వారిని పరిశ్రమనుంచి పలాయనం చిత్తగించడం కళ్ళెదుట కనపడుతూన్న వాస్తవం. అలా కష్టాన్ని మరచిన మనకు సుఖపడటం అలవాటై శరీరంలో కండరాల కదలికలు, కీళ్ళ పనితీరులో మెళకువలు మరచిపోయే స్థాయికి ఎదిగిపోయాం.

09/28/2018 - 19:38

దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ఒకటి. అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి ఏటా లక్షలాది మంది ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే యాత్రికులు పవిత్రమైన పద్దెనిమిది మెట్లపై నుండి వెళ్లాల్సి ఉంటుంది. అత్యంత నిష్ఠతో నలభై ఒక్క రోజుల పాటు నియమాల మాల వేసుకుని, నలుపురంగు దుస్తులు మాత్రమే ధరిస్తూ స్వామివారిని దర్శించుకుంటారు.

09/27/2018 - 19:14

ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి మనిషి యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నాడు.. ఎలా అంటే స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్లుగా.. మనిషి ముప్ఫై రోజులు పనిచేసి ఒకటో తారీఖు కోసం ఎదురుచూస్తుంటాడు జీతంకోసం. జీతం రాగానే దేనికెంత ఖర్చుపెట్టాలో అంతా తీసి పక్కనపెట్టి మిగతావి పొదుపు చేస్తాడు.

09/26/2018 - 19:12

ప్రజల జీవితాల్లోకి సామాజిక మాధ్యమాలు ప్రవేశించాక యువత వార్తాపత్రికలను చదవడం బాగా తగ్గిపోయింది. విదేశాల్లో పెద్ద పెద్ద సంస్థలే పత్రికలను మూసేశాయి. మరికొన్ని సంస్థలయితే ఉచితంగా పత్రికలను అందిస్తున్నాయి. అలాంటి గడ్డు పరిస్థితుల్లో పనె్నండు సంవత్సరాలుగా వీణారావు అనే భారతీయ మహిళ అమెరికాలో సొంతంగా ఓ వార్తాపత్రికను నడిపిస్తోంది.

09/25/2018 - 18:57

పేగు తెంచుకు పుట్టిన బిడ్డ అన్న ఆలోచన లేకుండా తల్లులే బిడ్డల గొంతు నులిమి
చంపేస్తున్నారు. ఈ హత్యలన్నింటికీ కారణం ఒకటే.. పరువు కాపాడుకోవడమే.. నిజంగా
ఓ మనిషి ప్రాణం తీసేస్తే పరువు తిరిగొస్తుందా? ఇప్పుడు ఆ కూతురి పరిస్థితి ఏంటి? ఆరు నెలల గర్భిణి తను. మాతృత్వాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో ఈ క్షోభను ఎలా తట్టుకోగలదు?

09/24/2018 - 19:08

ఆ ముఖంలో ఆరు జతల కళ్లు..
ఆ ముఖంలో రెండు ముఖాలు..
ఆ ముఖంలో అనేక వేళ్లు మొలిచి ఉంటాయి...

09/23/2018 - 23:30

**ఎటుచూసినా ఎతె్తైన పర్వతాలు..
చుట్టూ భయంకరమైన అడవి..
కాళ్లకు అతుక్కుపోతున్న జలగలు..
కొద్దిదూరం సాగగానే.. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న
స్వచ్ఛమైన భాగీరథి నది.**...

09/21/2018 - 20:21

‘‘ఈ కాలం యువతకు జీతాన్ని ప్రేమించటం తెలిసినంతగా జీవితాన్ని ప్రేమించటం తెలీటంలేదండీ’’ అంటూ కాస్త అసహనంగా ఒక కామెంట్ పడేశాడు ఒక మిత్రరాజం..

09/20/2018 - 18:55

ఆధునిక పోకడలతో, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతోపాటుగా మెదడుకు కొంత భారం తగ్గిందనుకొంటున్నారు కదా! వాస్తవికంగా ఆలోచిస్తే మెదడులో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందేమోననే భయం వేస్తోంది. మెదడును ఎంతగా వాడుకుంటే అంతగా దాని పనితనం పెరుగుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా తయారవుతున్నాయి. మనిషి శరీరంలోని ఏదైనా అవయవం పనిచేయకపోతే నొప్పి, బాధ అనిపిస్తుంది.

09/19/2018 - 19:49

భారతదేశం ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలలో ప్రతి రంగంలోనూ పోటీపడుతూనే ఉంది. అయినప్పటికీ కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పద్ధతులను ఏమాత్రం ప్రక్కనబెట్టడం లేదంటే భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు ఎంత విలువనిస్తుందో అర్థమవుతూనే ఉంది. భారతదేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ ఒక్కో కులానికి, ఒక్కో మతానికి కొన్నికొన్ని కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలున్నాయి.

Pages