S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/12/2019 - 23:12

శ్రీమతి కొలకలూరి భాగీరథి పురస్కారానికి (విమర్శ) ప్రముఖ రచయత బిక్కి కృష్ణ రాసిన ‘కవిత్వం - డిక్షన్’ అనే పుస్తకం ఎంపికైంది. పురస్కార ఎంపికకు ఆచార్య కె. సర్వోత్తమరావు, ఆచార్య ఎస్‌జిడి చంద్రశేఖర్, ఆచార్య ఎం. రవికుమార్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ పురస్కారానికి (పరిశోధన) శ్రీ రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి రాసిన ‘నుడి గుడి’ అనే పుస్తకం ఎంపికైంది.

02/03/2019 - 23:57

చలి అందరికీ
ఒకే తీరుగ వుండదు
ఎండలాగే

వ్యక్తి పరిస్థితి కన్నా
లోకగతి ముఖ్యం మనకు
ఏ అతినైనా ప్రతిఘటిస్తాం
వ్యతిరేకిస్తాం
అవసరమైతే పోరాటం సాగిస్తాం

ఎవరో
వెన్నుదన్నుగా ఉండాలని కాదు
మనకు మనమే ధైర్యం

కష్టాలు అందరికీ
ఒకే తీరుగ వుండవు
కొందరి కష్టాలు
నిజంగా కష్టాలే అయతే
అవి మనందరివి కూడా.

02/03/2019 - 23:56

ఎదురుగా ఉన్న రోడ్డు జగతికి నిదర్శనంగా
క్రమ్ముకున్న చీకటి అజ్ఞానానికి సూచనగా
వెలుగుతున్న నాలుగు దీపాలు
వేదాలకు గుర్తుగా
ఇంకా చెప్పాలంటే దిక్కులను తలపిస్తూ
విచిత్రమైన ఆలోచనలు మెదడును చుట్టేస్తూ
నిలవనివ్వవే ఏ క్షణమూ
కవి అంటే ఇంతేనేమో?
అనుక్షణం అనే్వషణ నేపథ్యంలోనే
తప్పు ఎక్కడ జరుగుతుందా అన్నట్లు
చూపుల బాణాలను ఎప్పుడూ ప్రసరిస్తూనే

02/03/2019 - 23:55

మరణంతో మరిచేదా ప్రేమంటే..
దూరంతో ముగిసేదా ప్రేమంటే..
నా అర్ధ భాగానివి నీవయ్యావు
మూడు ముళ్ల బంధానికి
విలువనిచ్చావు...
ఏడడుగుల బంధానికి
అర్థం చూపించావు
కష్టసుఖాల్లో పాలుపంచుకున్నావు
మన ప్రేమకు గుర్తుగా ఇద్దరు
పిల్లను నాకు ఇచ్చావు
కష్టాలు వున్నా ఆనందంగా
స్వీకరిస్తూ
చిరునవ్వును మాకందించావు

02/03/2019 - 23:52

ముఖాముఖి అంటే
నరాలకు సూదులేసినట్టుంటుంది
అందుకే నా బాల్యాన్ని
నా ముందు కూర్చోనివ్వను...

నా పాదముద్రల వెంట
ఆమె ఎందుకు వెంటపడుతోందో..
అయోమయం
ఎక్కడో ఆకాశంలో ఉన్నవాడికి
నాపై ఎందుకంత కోపమో?
వెంటాడుతూనే ఉండేవాడు...

01/21/2019 - 03:51

వడివడిగా సాగే
వాడి వేడి జీవితాల్లో
ఆడీ ఆడీ వాడిపోవడం
ఓడిపోవడం
కాలం సలిపే క్రీడలో భాగమే
అలజడులూ హిమవన్నగాలై
పాతాళపు లోతుల్లోకి
తోస్తూనే వుంటాయ
పాయసంలో పలుకుల్లా
సుఖాలూ శుభాలూ
రుచులనిస్తూనే ఉంటాయ్
గతుకు రోడ్లపై
జీవితపు బండి ఒడిదుడుకులు
సహజాతాలే సోదరీ
నీ జీవితం ఝరీభూతమై
సాగడమే జీవ రహస్యం

01/21/2019 - 03:51

చెలీ అంటూ చలి తరుముతుంది
చల్లగా మేనును తడుముతుంది
హిమ శకలాలుగా జారుతూ
సుమ పరిమళాలుగా రాలుతూ
చల్లనైన ప్రకృతి పరిష్వంగంలో వెల్లువైన
ఆకాశం దుప్పటి కింద
పరుచుకున్న పచ్చిక పరుపుమీద
విచ్చుకున్న వూహల్ని తట్టిలేపుతుంది
వేకువ ఊపిరులతో నిట్టూర్చుతుంది
మంచు స్ఫటికంలా చల్లదనాన్ని
మల్లె పరిమళాల ప్రవాహాన్ని
తనలో కలుపుకుని

01/21/2019 - 03:50

కవిసమ్రాట్ నోరి నరసింహశాస్ర్తి 120వ జయంతిని పురస్కరించుకుని నోరి పురస్కారాలను అందజేయనున్నట్లు నోరి నరసింహశాస్ర్తి చారిటబుల్ ట్రస్టు సభ్యులు నోరి శివసేనాని, నోరి కళ్యాణ సుందర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రతిష్ఠాత్మక నోరి నరసింహశాస్ర్తి పురస్కారానికి కాశీవాసి కొల్లూరు అవతారశర్మ ఎంపికయ్యారని, పురస్కారం కింద 20వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయబడుతుందని తెలిపారు.

01/21/2019 - 03:50

నేను
శబ్దసాగరం మీద
విచ్చుకున్న చంద్రోదయాన్ని
మీరు దాచుకోలేకపోతున్న ప్రహేళికల్లోంచి
పునర్జన్మిస్తున్న అవశేష క్షణాన్ని
ఏకాంకికలో బహుముఖీనమైన
పాత్రధారిని నేనే
నిగూఢమైన మీ లోలోతుల్లో
సుడులు తిరుగుతున్న గొంతుకని నేనే

01/21/2019 - 03:49

చూపులు కలిసిన శుభవేళ
అవి కంటిపాపల్ని వెలిగిస్తాయ
విరిసే వేళ
కనువిందు చేసే ప్రగతిచిహ్నాలవుతాయ
పరిమళించే వేళ
ఎద సానువులగుండా సాగిపోయే
చందన సమీరాలవుతాయ
అరుణోదయ వేళ
హరిత శోభల నడుమ వెలుగొందే
దీపాంకురాలవుతాయ
మధుమాస వేళ
మది నిండిన మకరందాలతో
మరులు గొనే అభిసారికలవుతాయ

Pages