S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/10/2019 - 21:46

కళ్ళు నులమక ముందే
వేళ్లు తాకాలి సెల్లు
ఫేస్ కడగకముందే
ఫేస్‌బుక్ చూడాలి
టీకప్పు చేతబట్టి
వాట్సాప్ చేయాలి
టిఫిన్ ముగిసే లోగా
ట్విట్టర్ తిరగెయ్యాలి
ఇంటి గడప దాటకముందే
ఇన్‌స్టాగ్రామ్ చెక్ చెయ్యాలి
రోడ్డు దాటుతుండగా
అప్‌లోడ్, డౌన్‌లోడ్లు
సందు దొరికిన చాలు
సందేశాలూ... లైక్‌లు
సెల్లు.. నిత్యమూ అరచేతిలో శోభిల్లు

06/03/2019 - 23:40

వాసంత సమీరానివై
వలపు పల్లవమును స్పృశిస్తూ
మోహన వాహినిలో
సరాగాల రాగకృతులను
సవరిస్తున్న వేళ
నేనొక విరహ వీక్షణనై
గోపికా తరళీక్షణనై
ప్రణయ చరణాల సుధాశృతి
గ్రోలుచున్నాను
కళాతృష్ణ తెలియని
నా గళ ద్వారం చెంత
నీ ప్రేమ గీతాల రుచులను
నింపుకొనుచున్నాను
ఈ వౌన వెదురుమీద
విపంచి సవ్వడులు వినిపించినట్టు

06/03/2019 - 23:39

ఎంత చదివినా
అర్థం కాని పుస్తకం ‘స్ర్తీ’

చదవడం మరచిన
పుస్తకం ‘నాన్న’

ఇష్టపడి చదివే
పుస్తకం ‘అమ్మ’

ఎప్పటికీ చదువుతుండే
పుస్తకం ‘జీవితం’

ఈ పుస్తకం
చదవడమే కాదు..
రాయడమూ చేయాలి
బద్ధకించక...!!

06/03/2019 - 23:37

ఏంటి?
ఇంకా అర్థం కాలేదా
బతుకు పాటలోని పల్లవి
రోడ్డుమీద పారేసిన
పాచిపోయన రొట్టెముక్కలా ఉన్నది

రేపు ఉదయంచాల్సిన సూర్యుడు
ఈ సాయంత్రం వేళ నడిరోడ్డులో
దుమ్మెత్తి పోసుకుంటున్నాడేంటి!
విరగపూసిన మల్లెపువ్వుపై త్రాచుపాము;

06/03/2019 - 23:35

అతనొక నడిచే నిఘంటువు
కవితా పక్షులన్నీ పిల్లలై అతని చుట్టూ
తిరిగేవి
ఉదయాలు సాయంత్రాలు
భీమిలి బీచుల్లో సిగ్గుపడి దాక్కొనేవి
పౌర్ణమి వెలుగులో కీట్స్ పొయెట్రీని
నెమరేసుకుంటూ అలౌకిక ఆనందంలో
లోకానే్న మరిపించేవారు

మూడు భాషల్లో అనర్గళంగా
అప్రతిహతంగా ఉపన్యాస విన్యాసం
మైమరచిపోయే సమయాలు

05/26/2019 - 20:40

ఎండైనా వానైనా
చెట్టు నీడకై పరుగులు
అవి కానరాక కానలేక
మొత్తం మానవుల్ని
ఒకేమారు తిడతావు
పుడమి వేడెక్కుతున్నదని
అందరిమీదా నిందలు
ఒక మొక్క కూడా నాటని
నీ గురివింద తత్వం
ఫలానె్నలా ఇస్తుంది చెప్పు

05/26/2019 - 20:39

ఎప్పుడైనా కాలం కలిసి వస్తే
పొమ్మనకు నేస్తం
ఇన్నాళ్లు ఎందుకు రాలేదని అలిగి
గొడవ పడకు
అందర్నీ కాదని ఎందరినో వద్దనుకుని
నీ దగ్గరికి వచ్చాను సుమా

పిలిచినప్పుడు రాలేదని విసుక్కోకు
మళ్ళీ వెళ్లిపోతుందేమోనని
నన్ను బంధించకు సుమా
రాత్రికి రాత్రికి మధ్య
నిశ్శబ్దంగా జారిపోతుంటాను నేను
నేను క్యాలెండర్లో లేను
జీవితంలోనే ఉన్నాను

05/26/2019 - 20:38

వాన జల్లులు కురియగా
నాడు కళకళలాడిన చెరువు

మేఘాల చప్పుడు కానక
నేడు తడిలేక విలవిలలాడుతుంది

బంకమట్టి పండు ముసలి
చర్మంలా వేలాడుతున్న
చెరువు గుండెలు పగిలి
వెక్కి వెక్కి ఏడుస్తుంది

05/26/2019 - 20:36

భూ మాతని నేను
సహనానికి రూపాన్ని నేను
తాపాన్ని సహించలేను
పాపాన్ని భరించలేను

చెట్టుకి కాయ బరువు కాదు
కానీ కూర్చున్న కొమ్మని నరికే
మీకు ఏమని చెప్పను?
నా భూతాపం! ఆ ‘కలి’ఘోరం!
మానవా! నా మనో నేత్రమా!
వ్యర్థాలను తొలగించు
ప్లాస్టిక్‌ని నిరోధించు
నా ఉనికిని నిలబెట్టు

05/26/2019 - 20:34

సీ: కార్పొరేట్ స్కూల్ గదిన్ కాసింత చోటీను
ఎలుగెత్తుదును ‘తెల్గు-తెలుగ’టంచు;
మన వత్సరపు పేర్లనణుమాత్ర మెరుగను
అరచు చుందును నే‘నుగాది’యనుచు;
నా పేరు పొరుగింటి నరునకు తెలియదు -
అయన మహాకవిఖ్యాతిగందు;
అనుదినంబెదొ వర్గదినమే - ఇపుడు వార
లణగార్చబడి రంచు కనలు చందు;
చిత్తశాంతికై మన సంఘ సేవ చేయ
ఉరక ఉరుకుల పరుగుల దొరనెయగుదు;

Pages