S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

03/19/2018 - 00:51

ఉదయాస్తమయాల రంగులు కలసిన
పొలిమేర మీద
పరిమళ నిశ్వాసాల్లో పరవశిస్తున్న నిశ్శబ్దాన్ని
సుమగాత్రి ఎవరో రాత్రిగా మార్చింది
పగటి బాధను దిగమ్రింగి
చెరువులోని చెంగల్వ
వెనె్నల వేణువు నూదుతోంది
శీతల కిరణ సంస్పర్శకు
చేరువైన కాలదూరం
తళుకు నీలి తారళ్యంగా
మధ్యమావతిని మలపించింది...

03/19/2018 - 00:49

విశాఖపట్టణం వేదికగా సాహిత్య, సాంస్కృతిక కార్యాచరణ చేస్తున్న మొజాయక్ సాహిత్య సంస్థ తొలిసారిగా ప్రదానం చేస్తున్న మొజాయక్ సాహితీ పురస్కారానికి ప్రముఖ కథ, నవలా రచయత సయ్యద్ సలీమ్‌ను ఎంపిక చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 24వ తేదీన ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

03/19/2018 - 00:49

ఇంతలో ఇంత అందం పోయిందా! అనుకుంది ఓ యింతి
అద్దంముందు కోతి మనసున్న మనిషి వయస్సు,
తుళ్ళిపడే వయసునుంచి,
‘గుర్తుకొస్తున్నాయ’నుకొనే వయసువరకు
మధ్యలో ఎన్ని జీవన మజిలీలో!

03/19/2018 - 00:47

విశ్వవిజేత సముద్రగుప్త
రచన: పాలంకి సత్య
వెల: రూ.100, పేజీలు: 151
ప్రతులకు: సాహిత్య నికేతన్
3-4-852, కేశవ నిలయం
బర్కత్‌పుర, హైదరాబాద్-27
040-27563236
*

03/12/2018 - 06:52

కాలం అప్పుడప్పుడు
కన్నీటి గాయాల మీంచి నడిచెళుతుంది
పగిలిన అద్దాల్లాంటి రోజుల్ని ఏరుకుంటూ
విడిపోయ వగర్చే క్షణాల్ని దోసిలిలో పట్టుకుంటూ
ఆవిరైపోయన ఆశల పొగని బుడ్డీలో దాచుకుంటూ
కాలం అప్పుడప్పుడు కన్నీటి గాయాల
మీదనుంచి నడిచెళుతుంది..
ముసుగు కప్పుకుని
తాగివాగే మైకాన్ని చీత్కరించుకుంటూ
ఎదుటివారి మీదకు చూపులను చెక్కి

03/12/2018 - 06:51

నేను మోయలేను
ఈ నిదురపట్టని రాత్రిని
ఇది భూగోళం కంటే భారమైంది!

మెలుకువ ఎంతున్నా
చీకటిని జయించలేని స్థితి
క్షణమొక పెనుభారం!

అందరూ నిద్రలో
తరిస్తుంటే...
ఆ అనీజీనెస్ అనుభవించాల్సిందే!

03/12/2018 - 06:49

ఎన్ని వింటున్నా, ఎన్ని కంటున్నా
ఏదో తెలియని అలజడి
అంతరంగాన్ని తొలిచేస్తోంది
అందుకే
ఇంకా చీకట్లోనే వున్నాననుకుంటున్నా
భవిష్యద్యుతులు
బాలభాను కిరణాల్లా
విశ్వగోళంలో జ్వలించాలని ఊహిస్తున్నా
మానవ మనుగడలో
మధురిమలెలా నింపాలని ఆలోచిస్తున్నా
కను మూసినా లోమనసులో
భావతీరాలను చేరలేకపోతున్నా
నాలోని శతకోటి భావాలు

03/12/2018 - 06:46

కవిసంధ్య, ఎస్.ఆర్.కె. ఆర్ట్స్ కళాశాల సంయుక్త నిర్వహణలో మార్చి 21న యానాంలో ప్రపంచ కవితా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు కవిసంధ్య అధ్యక్షులు శిఖామణి ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ కవుల చిత్రపటాలు, చేతిరాతల ప్రదర్శన, ఆధునిక కవిత్వంపై జాతీయ సదస్సు, కావ్య సంపుటాల ఆవిష్కరణ, కవితల పోటీల బహుమతి ప్రదానం జరుగుతుందని పేర్కొ న్నారు.

03/12/2018 - 06:45

వర్ణన ప్రధానమైంది కవిత్వం. కవిత్వానికి ఇతివృత్తం ప్రాణం. ఇతివృత్తం అంటే కథాంశం. వర్ణించదగిన పదార్థం. ‘పిండికొద్దీ రొట్టె’ అనే సామెత పిండి ఎలా ఉంటే రొట్టె అలా తయారౌతుందనే సత్యాన్ని చెబుతుంది. దేనికైనా ‘పిండి’ ఉండాలి. పిండి అంటే మూలపదార్థం. వౌలికద్రవ్యం. గాలిలో మేడలు కట్టడం ఎలా అసాధ్యమో, వస్తువు లేనిదే కవిత్వం రాయడం అలాగే అసాధ్యం. చిన్న కవిత కూడా విషయానికి లోబడే ఉంటుంది.

03/05/2018 - 00:51

మనకు చిన్నప్పటి నుండి కథలు వినడం తెలుసు. పేదరాసి పెద్దమ్మ దగ్గర్నుండి ఎన్నో జానపదాలు, పౌరాణికాలు, చారిత్రకాలు మనకు వినపడుతూనే ఉన్నాయి. కొన్ని ఆశ్చర్యాన్ని, కొన్ని అద్భుతాన్ని, కొన్ని ఆనందాన్ని, కొన్ని భయాన్ని కలిగించాయి. కొన్ని మాత్రమే మళ్లీ మనం చెప్పగలిగే స్థాయిలో మనలో ఇమిడిపోయాయి. మాటలను వెతుక్కుంటూ, కథను గుర్తుంచుకుంటూ చెప్పడంలోని తడబాటు మనకు తెలుస్తూనే ఉంటుంది. మనం చాలా పుస్తకాలు చదువుతాం.

Pages