S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

11/22/2018 - 19:46

బాధలు పడి అతను భార్యనీ, కూతుర్నీ పరోక్షంగా బాధలు పెట్టాడు. అతని మేనమామే గనుక అలాంటి ఉత్తరం రాయకపోతే తన తండ్రినీ, తల్లినీ, ఈ సమాజాన్నీ సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయేవాడు. అస్తిత్వ వేదనతో అస్థిమిత మనస్సుతో అతను ఒక వేశ్య పిలిస్తే వెళ్తాడు. ఇద్దరి అస్థిమితాలు ఒకటేనని తెలుసుకుని పారిపోతాడు.
ఓ సుందర స్వప్నంలాంటి జీవితం కొనసాగుతున్న పీడకల అవుతుంది. అదీ స్మశానంలో ఆత్మహత్యలో అంతమవుతుంది.

11/21/2018 - 19:12

అసమర్థుని జీవయాత్ర నవలలో మొట్టమొదటి దోషం- ట్రాజిక్ ఫ్లో- ‘సీతారామారావు అతని తండ్రికి తగిన తనయుడవటం. తల్లికి తగిన తనయుడవలేకపోవటం. తండ్రి గడించిన వ్యవస్థకు ఒక ప్రతీక. తల్లి రానున్న వ్యవస్థను అడ్డుకొంటున్న పురుషాధిక్య వ్యవస్థకు ప్రతీక. వంశానికీ, సామాన్య జీవనానికీ పొంతనలేని ఒకానొక విడివిడితనానికి మధ్యన నలిగిపోయే ఓ వంశోద్ధారకుడి ఆత్మ చరిత్రే అసమర్థుని జీవనయాత్ర.

11/20/2018 - 19:18

తెలుగు అక్షర జగతిలో చరమరాత్రులు చాలా హృదయ విదారకంగా గడిపినవాళ్లూ, అల్పజీవులూ, అసమర్థులూ, దగాపడిన తమ్ముళ్ళు, వెల్లువలో పూచికపుల్లలైన వాళ్లూ, నిరుద్యోగి వెంకటరావులూ వాస్తవ జీవనంలోంచి అధివాస్తవికతలోకి పారిపోయిన కోనేటిరావులూ, స్వగతాల్లోనే సతమతమైపోయిన క్లర్కు సూర్యారావులూ, గచ్చత్ శవాకార వికారులూ లెక్కకు మిక్కిలిగానే కన్పిస్తారు.

11/19/2018 - 19:35

‘‘తను నశించి ఆమెలో ఐక్యం కావాలంటే ఇద్దరూ కైలాసపర్వతం నుంచి పారే మంచు నదిలో పడి, కొట్టుకుపోయి హతమవ్వాలి. మరో ప్రపంచంలో వారిద్దరూ ఒక శరీరమే. ఇక్కడెందుకో విడిపోయారు’’ (పు.30) ‘‘కోమలి శరీరం నా ప్రేమతో పెరిగింది. హృదయం ఇప్పుడిప్పుడే జనిస్తోంది’’- అమృతం దయానిధుల కలయిక ఇలా వర్ణితం (పు.155)

11/18/2018 - 22:16

సరే, ఇవన్నీ ప్రశ్నలు. అసలు కథాక్రమానికొస్తే- ఆ మాటకొస్తే- ఈ నవలలో ఇతివృత్తపు మలుపులు పెద్దగా ఏమీ కన్పించవు. ఉన్న ఒకటి రెండు మలుపులే నవలను ముందుకు కొనసాగనిస్తాయ్. నాటకీయత, మెలోడ్రామా ఏమీ లేకుండానే ఇతివృత్తం పారదర్శకంగా ముందుకు సాగుతుంది.

11/16/2018 - 18:48

చివరకి మిగిలేదేమిటి? అనే ప్రశ్నకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమాధానం రావచ్చు. అసలీ ప్రశ్నలోనే మూడు అంశాలిమిడి వున్నాయి. చివరికి అంటే ఎప్పటికి చివరకవుతుంది? మిగలటం అంటే ఏమిటి? ఏమిటి అనేది ఏది? ఈ మూడు ప్రశ్నలూ దార్శనికమైనవి. సాంఘిక, సామాజిక శాస్తజ్ఞ్రులు మరోరకంగా ప్రశ్నిస్తారు. ఏది మిగలాలి? ఏది మిగలకూడదు? అని.

11/15/2018 - 18:48

మన చదువులకు మనం పెరిగే సమాజానికీ ఏమి సంబంధం లేదా? చదువు ఒక వినియోగ వస్తువా? లేక నూతన మానవుడిని సృజించే సాధనమా?

11/14/2018 - 19:02

చదువు కొకు అనుభవ ప్రపంచంలో రూపుదాల్చుకొన్న ఒక జ్ఞాపక విస్తారం. మనుషుల్ని త్రోసుకువస్తున్న మార్పులకు వాళ్ల రియాక్షన్‌ని, తనలో ఎదిగిన, తాను ఎరిగిన భావజాలంలోంచి ప్రెజెంట్ చేస్తాడు కొకు. చదువు నవలలలోని గొప్పతనం అదే. ఒట్టి డాక్యుమెంటేషన్ అనిపించే నవలలో- ఒక్కొక్క పాత్ర కదలి వచ్చి చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన పీరియడ్‌లో తాము ఎలా ప్రయాణించామో, డిస్టర్బ్ అయ్యామో వివరించటం కనిపిస్తుంది.

11/13/2018 - 18:46

ఎప్పటికప్పుడు మనం చరిత్రను తవ్వుతూనే ఉంటాము. శిథిలాల కోసమో! సత్యాల కోసమో! ఈ చరిత్ర ప్రయాణాలు మనం వెంట తెచ్చుకున్న గతాన్ని సమీక్షించుకోవటం కోసమే! హిస్టోరియన్ రాసే చరిత్రలో వాస్తు ప్రమాణాలు, తేదీలు, దస్తావేజులు వగైరా ఫాక్ట్స్ ఉంటాయి. రచయిత చరిత్రకు బయటా, లోపలా ప్రయాణిస్తాడు. మానవ సంబంధాలు అంతరంగ సంఘర్షణల ద్వారా చరిత్రను రికార్డు చేస్తారు.

11/12/2018 - 18:14

అక్కడ కూడా దీనికి సంబంధించిన వాదాన్ని ఆయన చెప్పటం తరువాత పండితులనేకులు దానికి ప్రతివాదం చేయటం జరిగింది. ఇటువంటి వివాదాస్పదమైన విషయాలు విశ్వనాథవారి జీవితంలో ఎన్నో. ఉదాహరణకు గుంటూరు ఏసి కాలేజీలో మత సంబంధమైన అభిప్రాయాలకు రియాక్ట్ అయినందుకు ఉద్యోగము వదులుకోవలసి వచ్చింది. ఆ ఉద్యోగం పోయి మరొకటి రాని దశలో వ్రాయబడినదీ నవల. అందుకే ఈ సంఘటన ప్రభావం ధర్మారావు పాత్రలో కూడా కొంత చోటుచేసుకొన్నది.

Pages