S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/10/2018 - 21:35

‘‘మీరిచ్చట చాలాకాలంనుండి ఉండుటచేత ఈ అడవిలో ఫలాలు, పుష్పాలు, చెట్లు తరిగిపోయాయి. అందువలన ఇక్కడి జంతువులకు ఆటంకంగా వున్నది. అదీగాక ఒకచోట చాలాకాలం ఎవరైననూ ఉంటే ప్రీతి సన్నగిల్లుతుంది. కాబట్టి మీరు వేరొక అడవికి వెళ్ళటం మంచిది’’ అని చెప్పి పాండవలులను వీడి వెళ్లిపోయాడు.

04/09/2018 - 21:27

క్రోధం మానవుల వినాశనానికి, అవినీతికీ కారణమని తెలుసుకో. ఆపదలన్నింటియందు మానవుడు సహనం కలిగి ఉండాలి. క్షమ, శీలం వలననే మనుగడ సాగుతుంది. క్షమాశీలురైన వారి లోకాలు బ్రహ్మలోకంలో మిక్కిలి పూజింపబడుచున్నాయి. తేజోవంతుల తేజస్సు సహనం, తపస్సుల యొక్క తపస్సు సహనం. సత్యవ్రతుల సత్యం సహనం. సహనమే యజ్ఞం. సహనమే శాంతి. భూదేవితో సమానుడైన ఓర్పు కలవాడికి సదా విజయం లభిస్తుంది.

04/08/2018 - 21:07

ఇట్లుండ ఒకనాడు ఋషులతో కూడియున్న ధర్మరాజు వద్దకుదల్భుని కుమారుడైన బక మహర్షి (బకదాల్భ్యుడు) వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో ఎదురేగి మహర్షిని తోడ్కొని వచ్చి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. మహర్షి ధర్మరాజును చూచి

04/06/2018 - 21:53

తదుపరి శ్రీకృష్ణుడు ద్యూత సమయమున తాను రాకపోవుటకు గల కారణములను పాండవులకు వివరించి చెప్పాడు. అటు తరువాత పాండవుల అనుమతితో ద్వారకకు పయనమై వెళ్లిపోయాడు.
39

04/05/2018 - 21:39

నేను చక్రవర్తి అయిన పాండు రాజు యొక్క కోడలిని. వీరాధివీరులైన పాండవులకు పత్నిని. మహాబలశాలి అయిన దృష్టద్యుమ్నునికి సోదరిని.
అన్నిటికన్నా మిన్న ‘నీకు చెల్లెలిని’.
అట్టి నన్ను దుశ్శాసనుడు నిండు సభలో నా తల వెంట్రుకలను పట్టి ఈడ్చాడు. వలువలొలిచి దారుణంగా అవమానించాడు.

04/04/2018 - 21:04

పురోహితుడైన మహర్షి ధౌమ్యుడు ఒక ముహూర్తకాలం ఏకాగ్రచిత్తంతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించాడు. యుధిష్టిరునితో-
‘‘సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్య రూపమైనదే. అతడే తండ్రి. రక్షకుడు. ధర్మాత్ముడా! అందువల్ల కర్మవిశుద్ధడవై నీవు కూడా తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించుము’’ అని అతడికి నూటెనిమిది సూర్య నామాల్ని ఉపదేశించాడు.

04/04/2018 - 02:29

ధర్మరాజు కళ్ళు విప్పక, భయంకరమైన నాచూపుతో నిరపరాధులైన ప్రజలు మండిపోకూడదనే భావంతో ముఖాన్ని కప్పుకొని వెళ్లసాగాడు.
భీమసేనుడు బాహుబలంలో నాకు సాటి రాగలవారు ఎవ్వడూ లేడని, తన విశాల బాహువుల వైపు చూస్తూ పోసాగాడు.

04/02/2018 - 21:06

తదుపరి ధర్మరాజు సభికులను చూసి ‘‘్భరత వంశస్థులందరి దగ్గర సెలవు తీసికొంటున్నాను. వృద్ధుడైన భీష్మ పితామహుడు, రాజైన సోమదత్తుడు, మహారాజైన బాహ్లికుడు, ఆచార్యుడైన ద్రోణుడు, పండితుడైన కృపుడు, అశ్వత్థామ, మహామహాత్ముడు, హితకారి అయిన విదురుడు, నా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, తమ్ముడు యయుత్సుడు, మంత్రి సంజయుడు మొదలైన సభాసదులందరి దగ్గర సెలవు తీసికొని వెళుతున్నాను.

04/01/2018 - 21:53

యుధిష్ఠిరుడు ప్రారబ్దానికి లోనయ్యాడు. భీష్మద్రోణ విదురయుయుత్స కృపసంజయ, గాంధారి పృథభీమార్జుననకుల సహదేవులు. వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లికుడు అందరూ వద్దని వారిస్తున్నా ధర్మరాజు జూదం నుండి మరలలేదు.
ఆ తరువాత శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను’’ అని ధర్మరాజుతో అన్నాడు.

03/30/2018 - 22:04

ఇప్పుడు వంశమే నాశనం కావలసి వస్తుంది. శాంతి, ధర్మం, నీతి వీటితో కలిసిన తమ బుద్ధిని అంతే నిలుపుకోండి. పొరపాట్లు చేయకండి.క్రౌర్యంతో కూడి ప్రౌఢి, ప్రౌఢిమతో సాధించిన లక్ష్మి పుతపౌత్ర పరంపరగా సాగుతోంది’’ అని పరిపరి విధాల ప్రాధేయపడి వేడుకొంది.

Pages