S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/20/2019 - 22:22

అవధూతలల్లో అగ్రగణ్యుడవు. అవ్యక్తమైన గమనం కలవాడవు. నీ సందర్శనం వ్యర్థకాదు. నేను వారంరోజుల్లో ఈ దేహాన్ని వదిలివేయాలి. అట్టి నాకు మీ దర్శనం లభించింది అంటే తప్పకుండా నాకు శుభం కలుగుతుంది. నాకోరిక నెరవేరుతుంది అన్న భావం నాకు కలుగుతోంది. మహానుభావా! ఈ ఏడు రోజుల్లో నారాయణుని పాదపద్మాలను చేరుకొనే ఉపాయాన్ని చెప్పండి. మదోన్మత్తతతో చేయకూడని కార్యాన్ని చేశాడు. బాలుడైన శృంగి చేత శపించబడ్డాను.

03/19/2019 - 22:38

తాను చేసిన పనికి పశ్చాత్తాపం చెందుతూ రాజ్యభారాన్ని పూర్తిగా జనమేజయునికి ఒప్పచెప్పాడు. దర్భాసనం పరిచి ఉత్తరాభిముఖుడై దేవదేవుని ప్రార్థిస్తూ కూర్చున్నాడు.

03/18/2019 - 19:11

ఆ తరువాత తన తండ్రి మెడలో పామును ఎలా తీయాలో తెలియక ఆందోళన పడుతూ ఎవరైనా వచ్చి నా తండ్రిని రక్షించండి అంటూ పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. కొడుకు ఏడుపు విని శమీకుడు సమాధి స్థితిని నుంచి బాహ్యస్మృతిలోకి వచ్చాడు.
తన భుజం పై వేలాడుతున్న పామును చూసి చేత్తో తీసి దూరంగా పారవేశాడు. తన కుమారుడిని దగ్గరకు పిలిచి ఎందుకు ఏడుస్తున్నావంటూ ఊరడించాడు.

03/17/2019 - 22:38

చేసేది లేక మంత్రి పురోహితులు వాటిని రాజుగారికి చూపారు. అందులో మిరుమిట్లు గొలుపుతున్న ఓ కిరీటాన్ని చూసి ఆశ్చర్యంతో ఆహా ఎంత బాగుందో ఈకిరీటం అంటూ దాన్ని ముట్టుకుని తన తలపై పెట్టుకొన్నాడు. అక్కడున్నవారంతా ఏమి ముప్పువాటిల్లుతుందో కదా అని మనసున ఆందోళన పడ్డారు. అంతలోనే మరలా అయ్యో దీనిని స్పృశించకూడదని తాతలు చట్టం చేశారు కదా. మరి నాకెందుకు ఇవి అంటూ వెంటనే తీసేసి వెనక్కు వచ్చేశాడు పరీక్షిత్తు.

03/15/2019 - 19:25

కనుక నీవు ఈ లోకంలో ఉండడానికి వీలులేదు అంటూ గట్టిగా వారిస్తున్న పరిక్షిత్తుకు తిరిగి నమస్కరించి తను ఎందుకు ఈ ప్రపంచంలో వచ్చాడో ఎవరు పొమ్మన్నారో దానినంతా కలి పురుషుడు పరీక్షిత్తుకు వివరించాడు.

03/13/2019 - 19:38

వచ్చేటపుడు ఆయనకు ధర్మదేవత ఒంటికాలిపై నిల్చుని గోమాతతో తన దుఃఖాన్ని పంచుకోవడం కనిపించింది. ఓక రాజు సాధువు జంతువైన గోమాతను కాలితో తన్నడం చూస్తాడు. ఆ రాజే తిరిగివృషభాన్ని కూడా కఠినాతికఠినంగా కాలితో తన్ని తాను సంతోషించడం పరీక్షీన్నమహారాజు చూశాడు. ఎంతో ఆవేదన చెందాడు. వెంటనే ఆ వృషభ గోమాతలను రక్షించాడు. అమితంగా వేదన చెందే వారికి స్వస్థత కలిగించే మాటలు మాట్లాడాడు.

03/12/2019 - 20:49

ఉత్తరాభిమన్యుల కుమారుడు విష్ణురాతుడు. ఇతడు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడే పరమాత్మను చూచిన పుణ్యశీలి. అశ్వత్థామ క్రోధంతో అపాండవం కావాలని ప్రయోగించిన బ్రహ్మాస్తమ్రునుంచి తప్పించుకొనిన ధీశాలి విష్ణురాతుడు.

03/11/2019 - 20:15

అంతలో పట్టుపీతాంబరాలు ధరించి మెల్లగా ఇద్దరూ అంగనామణులు వచ్చి కుచేలుని లోపలికి ఆహ్వానించారు. ఈ భవనం ఎవరిదో కదా ఇందులో నుంచి వచ్చిన వారు నన్ను పిలుస్తున్నారేమిటి అనుకొంటూనే వారి వెంట కుచేలుడు వెళ్లాడు.

03/10/2019 - 22:47

అలా బయలుదేరి తిరిగి తన నిజనివాసానికి కుచేలుడు ప్రయాణం సాగిస్తూ మార్గమధ్యంలో కుచేలుడు కృష్ణుడు చేసిని మర్యాదను తలుచుని అర్భ దరిద్రుడైన నేను ఎక్కడ? ఆగర్భ శ్రీమంతుడైన కృష్ణుడెక్కడ? అచ్యుతుడు నా పై అనురాగంతో నా సిగలో పూవులు ముడిచాడు. నా కాళ్లు కడిగాడు. రుక్మిణీదేవి కూడా వచ్చి నన్ను ఆదరించింది. నేనెంత భాగ్యశాలినో కదా. తన కౌగిట చేర్చుకుని ఎంతో మురిసిన ఆ కృష్ణుని కన్నుల్లో తడిని చూశాను.

03/08/2019 - 20:18

తన దగ్గరే కూర్చుని కబుర్లు చెబుతున్న రుక్మిణి ని ఆగమని చెబుతూ గబగబా అడుగులు వేసి కుచేలుని దగ్గరకు వచ్చి అమాంతం కౌగిలించుకని ‘సుధామా! ఎలా ఉన్నావు?’ అంటూ ఆర్ద్రతో అడిగాడు. స్వాగతం పలికాడు. బంగారు కలశంలోని నీరు పోసి పాద ప్రక్షాళనం కావించాడు. ఆ నీటిని తన తలపై చల్లుకున్నాడు.మంచి సున్నితమైన వస్త్రాలతో ఆ కుచేలుని పాదాలను తుడిచాడు. పాద్యం సమర్పించాడు. గోవును సమర్పించాడు.

Pages