S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/03/2018 - 21:15

‘‘సైరంధ్రీ! నీకు స్వాగతం! ఈ రాత్రి చక్కగా గడచిన నాకు సుప్రభాతమైనట్లుగా ఉన్నది. నాకు రాణివై ప్రీతిగల్గించుము. వివిధ ఆభరణములను నీకోసం తెప్పిస్తాను. దివ్యమైన శయ్యనుగూడా యేర్పాటుచేయించి ఉంచాను. రమ్ము! నాతో కలిసి తీయని మధ్వీరసాన్ని త్రాగుదువుగాని’’ అని అనగా ద్రౌపది
‘‘దుర్మదా! నిషాదుడు బ్రాహ్మణ స్ర్తిని అంటజాలనట్లుగా నీవు నన్ను తాకలేవు. నన్ను అవమానించి దుర్గతిని పొందకుము! దుర్దశను పొందకు.

05/02/2018 - 21:21

ఆలస్యం చేశావంటే నేను మన్మథ తాపంతో మరణిస్తాను. కావున నిజంగా నీవు నా మేలు కోరినదానివైతే ‘‘నీవు అవివేకివి’’ అంటూ అసంగతాలైన మాటలతో నన్ను నిందించకుము. శీఘ్రంగా సైరంధ్రిని పిలిపించుము’’ అని అన్నాడు కీచకుడు.
కీచకుడలా చెప్పేటప్పటికి సుదేష్ణ శోకంతో మిక్కిలి వ్యధ చెందింది. తరువాత అతడితో

05/01/2018 - 21:07

కీచకుడి నీచమైన ప్రేలాపనకు కలత చెందిన ద్రౌపది తనను తాను నిగ్రహించుకొని నేర్పుగా తప్పించుకోవాలని వాడితో
‘‘సూతపుత్రా! నీవు కోరదగని నన్ను కోరుతున్నావు... నేను హీనజాతిదానను. పైగా సైరంధ్రిని. వెగటు కలిగించే వస్త్రాలను ధరించిన దానను. ఇతరులకు కేశాలంకారాలను చేసి జీవించే దానను.

04/30/2018 - 21:35

అలా సేవలు చేస్తూ, మహారాణి సుధేష్ణనూ, అంతఃపుర కాంతలను కూడా తృప్తిపరుస్తున్నది. ఇంకా కొద్ది దినాలు ఓపిక పడితే సంవత్సర కాలం పూర్తి అవుతుంది. సంవత్సరం చివరకు వచ్చింది.

04/29/2018 - 22:34

‘‘నీ కులం ఏది? నీ పేరేమి? నీవు ఎవరిదానవు? ఏ పనిమీద ఎక్కడకు వెళ్ళుదామని బయలుదేరావు? అం తా మాకు స్పష్టంగా చెప్పుము’’ అని అన్నది. సుదేష్ణ ప్రశ్నలకు ద్రౌపది-

04/27/2018 - 23:34

సహదేవుడు అన్నాడు- ‘‘నేను విరాటుని కొలువులో గోవులను అదుపులో పెట్టుట, పాలు పిదుకుట, పరీక్షించుట అను పనులలో నేర్పు గలవాడినని తెలిపి చేరెదను. నేర్పుగల గోపాలకుడనగదును. ‘తంతిపాలు డు’ అను (తంత్రీపాలుడు) పేరుతో కొలువులో ప్రవేశింతును. పూర్వం ఎచటనుండివని అడిగినచో ధర్మరాజు వద్దనుంటినని చెప్పదును’’ అని.

04/26/2018 - 23:39

పైకి లేవటానికి ప్రయత్నిస్తున్న జయప్రథుడిని భీముడు బంధించి ఎత్తి రథంపై పడవేశాడు. అర్జునుడు అనుసరిస్తుండగా ఆశ్రమానికి చేరుకొని అక్కడ కూర్చున్న ధర్మరాజు కాళ్ల వద్ద సైంధవుడిని పడవేశాడు. అంత ధర్మరాజు సైంధవుడిని చూచి పెద్దగా నవ్వి భీమసేనునితో ‘వీడిని విడిచిపెట్టు. నామీద గౌరవముంటే ఈ నీచవర్ముని విడిచిపెట్టు’’ అని అన్నాడు.

04/25/2018 - 21:11

త్రిగర్త రాజైన ‘సుధన్వుడు’ ధనుర్ధారుడై రథాన్ని దిగి యుధిష్ఠిరుడి నాలుగు గుఱ్ఱాలను చంపివేశాడు. కాలినడకన దగ్గరగా వచ్చిన సుధన్వుడిని ఒక అర్థచంద్రబాణంతో గుండె బ్రద్ధలయ్యేటట్లు ధర్మరాజు నరికి చంపగా రక్తాన్ని గ్రక్కుతూ అతడు నేలపైబడ్డాడు.

04/24/2018 - 21:19

వెంటనే పాండవులు ఆయుధాలు ధరించి జయద్రథుడు వెళ్లిన మార్గాన్ని అనుసరించి వెంట పడ్డారు. వారికి సైన్యంలోని కాలి గిట్టల తాకిడికి ఎగిరిన ధూళి కనపడింది. కాల్బలం మధ్యలో ‘‘్భమసేనా! పరుగెత్తుకురా!’’ అని ఆక్రోశిస్తున్న ధౌమ్యుడు కూడా కనపడ్డాడు. అంత పాండవులు ‘‘ఇక మీరు నిశ్చితంగా వెళ్ళండి’’ అని ధౌమ్యుని ఓదార్చి జయద్రథుని సైన్యాన్ని వెనె్నంటి వెళ్ళారు.

04/23/2018 - 21:24

గొప్ప పాముల జంటను పాదాలతో త్రొక్కి కోపింపచేయటం వంటిదే! జాగ్రత్త!
ఓ సైంధవా! నీకు ఆయువు తీరింది. నీకింక చావు తప్పదు. ఈ పరిపాకాన్ని తప్పించుకొనటం నీకు సాధ్యం కాదు.
ఆడు ఎండ్రకాయ తన చావుకోసం గర్భం దాల్చినట్లు నీవు పాండవుల చేత రక్షింపబడుచున్న నన్ను అపహరించాలనుకొంటున్నావు. (తేలు, ఎండ్రి ఆయువు తీరిన సమయాననే గర్భం ధరిస్తాయి) అని కఠినంగా అన్నది.

Pages