S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/22/2018 - 21:57

నీ అనురాగాని ఎల్లప్పుడూ నోచుకొన్న నీ భర్తలు, అదృష్టవంతులైన అందగాండ్రు పాండవులు క్షేమంగాఉన్నారుగదా? అని అడుగగా ద్రౌపది
‘‘రాజా! మీకు కుశలమేనా? పాండవులు స్థిరచిత్తులు. వారు కుశలంగా ఉన్నారు. మీరు ధర్మాన్ని అనుసరించి పాలిస్తున్నారు గదా? నీవు ఇప్పుడు అతిథివి. కావున సంప్రదాయసిద్ధమైన మన్ననలకు అర్హుడివి. దయతో ఉన్నతాసనాన్ని స్వీకరించుము. రుచికరమైన విందు భోజనాన్ని ఆరగించుము.

04/20/2018 - 21:41

నేను మిక్కిలి బలంగల వాడను. ‘సురథుడు’ అనే మహారాజు కొడుకును. నన్ను ప్రజలు కోటికాస్యుడు అని పిలుస్తారు.
సుందరీ! అడుగో మనకు కనిపిస్తున్న ఆ బంగారు రథంమీద వేదియందు అగ్నిలా ప్రకాశించే అతడు ‘త్రిగర్త’ దేశాధిపతి అయిన ‘క్షేమంకరుడు’.
ఉత్పలాక్షీ! ఆ తరువాత మహాధనుర్థారి, విశాలమైన కన్నులుతో చక్కని పూలమాలను ధరించి నన్ను చూస్తున్నవాడు ‘కుళిందదేశ విభుడు (కళింగదేశానికి ప్రభువు)

04/19/2018 - 21:48

నిత్యమూ ధర్మతత్పరులై ఉండేవారు ఎప్పుడూ కూడా నశించిపోరు. ఇక నాకు సెలవు, వెళ్తాను. మీకు ఎప్పుడు శుభమగుగాక!’’’ అని అనగా కుదుటపడిన మనసులతో చింత తొలగి ద్రౌపది సహితంగా-
‘‘గోవిందా! ప్రభూ! మహాసాగరంలో మునిగిపోతున్న వారికి నావ దొరికినట్లుగా నిన్ను మేం రక్షకునిగా పొంది అతి కష్టమైన ఈ ఆపదనుండి గట్టెక్కినాము. నీకు కళ్యాణమగుగాక’ అని పాండవులు వేనోళ్ళ శ్రీకృష్ణునికి వంగి అభివాదం చేసి-

04/18/2018 - 20:55

భగవంతుడా! ఇంతకుపూర్వం సభలో దుష్ట దుశ్శాసనుని బారినుండి నన్ను రక్షించి తప్పించినట్లే ఈ సంకటంనుండి నన్ను కాపాడేవాడిని నీవే ప్రభూ! దీనదయాళో! రక్షమాం! రక్షమాం! రక్షమాం!’’
అని శ్రీకృష్ణ్భగవానుని మనసారా ప్రార్థించింది.
అప్పుడు ఆ దేవాదిదేవుడు అయిన శ్రీకృష్ణ్భగవానుడు ద్రౌపది ఆర్తనాదాన్ని విన్నాడు.

04/17/2018 - 21:44

ఆ ముని కొన్ని రోజులపాటు అక్కడనే ఉన్నాడు. దుర్యోధనుడు ఆ ముని శపిస్తాడేమోననే భయంతో దివారాత్రులు జాగరూకుడై సేవకునివలె సేవలు చేశాడు. ముని ఒకసారి ‘‘నాకు ఆకలిగా ఉంది. వెంటనే అన్నం పెట్టు’ అని చెప్పి స్నానానికి వెళ్ళి చాలాసేపు అక్కడే ఉన్న తరువాత వచ్చేవాడు. అలా వచ్చి ‘‘ఈరోజు అన్నం తినను. నాకు ఆకలిగా లేదు’’ అని చెప్పి అదృశ్యమైపోయేవాడు.

04/16/2018 - 21:29

శ్రీకృష్ణుడు ఏ పని మీదనైనా దాసిని పంపబోతే నీవే లేచి స్వయంగా ఆ పని చేయుము. నీ భావాన్ని కృష్ణుడు గ్రహించి ‘‘సత్య నిండు మనస్సుతో నన్ను సేవిస్తున్నది’’ అని అనుకోవాలి. భర్త నీ దగ్గర చెప్పిన మాటలను..అది రహస్యం కాకపోయినా నీ వెవ్వరికీ చెప్పగూడదు.

04/15/2018 - 21:15

సత్యభామా! నీవు ఎంతటి అందగత్తెవి అయిననూ నన్ను తక్కువ స్థాయిలోని ఆడువారితో జమకట్టి ఇటువంటి మాటలు మాటాడవచ్చునా? నీవు ఇటువంటి మాటలు పలుకుతావనే విషయాన్ని నేను ఊహించలేదు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుని భార్యగా ఉండదగిన అర్హత నీలో లేదు సుమా? శ్రీకృష్ణునికి ఇష్టమైన రాణివి, మంత్ర తంత్రాలు పెట్టే భార్యను గురించి తెలిస్తే అతడు చాలా వ్యాకుల పడతాడు. మంత్ర తంత్రాలతో భర్త భార్యకు వశవౌతాడని అనుకుంటున్నావా?

04/13/2018 - 20:55

నకుల సహదేవుల అభివాదాలను స్వీకరించాడు. అర్జునుని కౌగిలించుకున్నాడు. ద్రౌపదిని ఓదార్చాడు.
శ్రీకృష్ణవాసుదేవుడు కొంత విశ్రాంతి గైకొన్న తరువాత పాండవులతో ఆసీనుడైనాడు. అప్పుడు ద్రౌపదిని చూచి-

04/12/2018 - 21:59

వారితో ‘‘ భీముడు తనకు కావలసిన పుష్పాలన్నింటినీ తీసుకొనుగాక. ద్రౌపది కోరిక మేరకే అతడు వచ్చాడు. అది నాకు తెలుసును’’ అని అన్నాడు.
భీమసేనుడు పుష్పాలను తీసికొని బయలుదేరాడు.
ఇక్కడ దర్మరాజు భీమసేనుని కానక కలత చెంది ద్రౌపదితో ‘‘పాంచాలపుత్రీ! భీముడు ఎక్కడ? ఏ పని చేస్తున్నాడు? సాహసశీలి ఏదైనా సాహస కార్యాన్ని ఆచరించాడా?’’ అని ప్రశ్నించగా ద్రౌపది నవ్వుతూ-

04/11/2018 - 21:04

ప్రభూ! ఉత్తమమైన, ప్రకాశవంతమైన ఆ దివ్య పుష్పాన్ని చూడుము. దీని దివ్య గంధం వాసన ఆఘ్రాణిస్తే ఆనందంగా ఉంది. సుగంధమే దీని స్వరూపం. దీనిని ధర్మజునకు కానుకగా ఇస్తాను. నా కోరిక తీర్చటానికై నీవు వనానికి వెళ్లి ఇంకా కొన్ని తీసుకొనిరా! నాపై ప్రేమ ఉంటే నా కోసం వీటిని చాలా తీసుకొనిరా!

Pages