S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరటి చెట్టు

06/12/2018 - 21:23

‘చీకటిలోనికి దీపికను తీసుకొని పోగలరు కాని, ఎవరూ చీకటినే వెలుతురుగా మార్చలేరు’ అని తేల్చి చెప్పాడు ముద్దుకృష్ణ. నిక్కమయిన సంస్కర్త సంస్కారం ఈ మాటల్లో ప్రతిధ్వనిస్తోంది. వెలుగులోకి రావాలనుకునే వాళ్లకి కరదీపికగా ఉపయోగపడేందుకు మాత్రమే సంస్కర్త ఉన్నాడు. ఇది సంఘ సంస్కరణకీ, భాషా సంస్కరణకీ, సాహిత్య సంస్కరణకీ, రాజకీయ సంస్కరణకీ - ఒక్కమాటలో చెప్తే ఏ రంగంలో సంస్కరణకయినా - వర్తించే సామాన్య సూత్రం.

06/11/2018 - 21:51

ఆధునికత, ముఖ్యంగా ఆధునిక సాహిత్యం, తిథి వార నక్షత్రాలు చూసుకుని మరీ పుట్టదు. అది సుదీర్ఘమయిన, సంక్లిష్టమయిన పరిణామ క్రమంలో భాగంగా రూపుదిద్దుకుంటుంది. మన భాషలోనూ అలాగే జరిగింది. తెలుగు సంప్రదాయ సాహిత్యం ‘క్షీణయుగం’ గండంలోనూ, చిత్ర-బంధ కవిత్వపు సుడిగుండంలోనూ పడికొట్టుకుంటున్న దశలోనే, ఆధునిక తెలుగు సాహిత్యం పురిటి నొప్పులు పడి, తొలి బిడ్డను కన్నది.

06/10/2018 - 21:25

‘పందొమ్మిదో శతాబ్ది మొదటి సగం ఆంధ్ర సాహిత్య చరిత్రలో క్షీణ యుగం. నాడు జాతి జీవనం లాగే సారస్వత రంగమూ నిస్తేజంగా ఉండిపోయింది. సంప్రదాయాన్ని జీర్ణించుకుని సరికొత్త ప్రయోగాలు చేసే మహాకవి పుట్టలేదప్పుడు. అనుకరణ శీలం పెరిగింది. చిత్ర కవిత్వం మీద మమకారం ముదిరింది. పిల్ల వసుచరిత్రలు ఉసిళ్లుగా ఉద్భవించినవి. ప్రబంధ కవిత్వం క్రమంగా బంధ కవిత్వంగా మిగిలిపోయింది.

06/08/2018 - 21:28

‘కథానికలు ఎంతో వినోదదాయకంగా వుంటాయి కానీ, ఆ ప్రక్రియను నిర్వచించే ప్రయత్నం - సాధారణంగా - పరమ విషాదకరంగా మారుతుం’దన్నాడు డేవిడ్ డేవిడర్. కథానికను ‘జీవిత శకలం’గా అభివర్ణించి చేతులు దులుపుకునేవాళ్లు నిజానికి ఏమీ నిర్వచించడం లేదని గమనించ ప్రార్థన! ఎందుకంటే, జీవితం ఏ నిర్వచనానికి తలొంచుతుంది కనక?

06/07/2018 - 21:32

ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా, మన దేశం స్వతంత్రం కావడానికి ముందు వెనకలుగా తెలుగు నవల ఓ మూల మలుపు తీసుకుంది. అప్పటికి దాదాపు రెండు దశాబ్దాలుగా, ‘వేయిపడగలు’ విప్పి, సామాజిక ‘మైదానం’లో వీర విహారం చేస్తూండిన తెలుగు నవల నెమ్మదిగా మనసు పొరల్లోకి తన ప్రవాహాన్ని మళ్లించింది.

06/06/2018 - 21:53

జీవితాన్ని ఓ రచయిత నదితో పోల్చాడు. ప్రవహించే కొద్దీ విశాలమూ, గహనమూ, దీర్ఘమూ అయ్యే స్రోతస్విని మాదిరే, జీవితం కూడా గడిచేకొద్దీ అనుభవ సంపన్నంగా మారుతుందన్నాడా రచయిత. జీవితానికే కాదు- దాన్ని ప్రతిఫలించే సాహిత్యానికి కూడా ఈ సూత్రం వర్తిస్తుంది. తెలుగు పాఠకుల అభిమాన రచనా ప్రక్రియగా పాతుకుపోయిన నవల ఒకటిన్నర శతాబ్దంగా పొడుగూ వెడల్పూ లోతూ పెంచుకుంటూ పోతూనే ఉంది.

06/05/2018 - 21:48

తెలుగు సాహిత్యానికి ఆధునికత పరిచయం చేసిన సాహిత్య ప్రక్రియ లన్నింట్లోకీ, ప్రచురమయినదీ - ఇప్పటికీ అత్యధికుల ఆదరణకి పాత్రమవుతున్నదీ - కాల్పనికేతర సాహిత్యమే. కవిత, కథానిక, నవల నాటకం తదితర కాల్పనిక సాహిత్య ప్రక్రియల్లో ఒకదాన్ని మెచ్చిన వాళ్లకి మరొకటి నచ్చకపోవచ్చు. కానీ, కాల్పనికేతర సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్లు ఉండరు.

06/05/2018 - 21:32

పందొమ్మిదో శతాబ్దం ప్రథమార్ధంలోనే తెలుగునాట, ముఖ్యంగా ఆనాటి సంకీర్ణ మద్రాసు రాష్ట్రంలో, సామాజిక పరిణామ పవనాలు పెద్దపెట్టున రేగాయి. ఆనాటి మద్రాసు రాష్ట్రానికి రాజధానీ నగరంగా ఉన్న చెన్నపట్నం ఈ పరిణామ శీలతకు కేంద్రంగా నిలిచింది. చెన్నపట్నం కాకుండా, ఉత్తర సర్కారులుగా పిలిచే మధ్య కోస్తా - ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా ఈ సామాజిక పరిణామ ప్రభంజనం విజృంభించింది.

06/03/2018 - 22:16

సంప్రదాయ సాహిత్యానికీ, ఆధునిక సాహిత్యానికీ మధ్య సరిహద్దు రేఖ గీయడం చాలా క్లిష్టమయిన వ్యవహారం. ఇది వచనానికీ, నిర్వచనానికీ సంబంధించిన సరళమయిన సమస్యేమీ కాదు. సాహిత్య రంగంలో అనిదంపూర్వమయిన విషయాన్ని గుర్తించడం చాలా కష్టం. అలా అపూర్వం కానిది ఆధునికం కాజాలదు. దానికి నిర్దిష్టమయిన తాత్విక భూమిక ఉండాలి. అలా లేని పక్షంలో ఆ సరిహద్దు రేఖకి సార్వజనికమయిన ఆమోదం దక్కదు.

06/01/2018 - 22:18

ఎలెక్ట్రిక్ బల్బ్ కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌ని ఓ స్కూల్ బహుమతి ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారట. ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకున్న ఓ గడుగ్గాయ ఆయన్నిలా అడిగాడట. ‘ఒక సెంటు (అప్పట్లో) ఖరీదు చేసే బల్బు కనిపెట్టినందుకు మీకు అన్ని అవార్డులూ, పేటెంట్లూనా?’ అని ఆ కుర్రకుంక విస్తుపోయాడట.

Pages