S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

12/20/2016 - 21:28

ఆ తరిని శ్రీమన్నారాయణాంశ భవుడైన యజ్ఞ పురుషుడు శైవస్తోత్రాలు పఠించాడు. బ్రహ్మదేవుడు కూడా అహంకారం వీడి భీతి పరవశుడై శత రుద్రీయం జపించాడు. అపుడు శరణాగత త్రాణ పరాయణుడైన ఆ పరమేశ్వరుడు యజ్ఞ పురుషుణ్ణి, చతుర్ముఖుణ్ణి కృపాదృష్టులతో అనుగ్రహించాడు. తన అపర రూపం అయిన భైరవుడిని కాంచి, ఈ బ్రహ్మ యజ్ఞ పురుషులు ఇర్వురున్ను నీకు మాననీయులు. వీరి పట్ల ఇంక నీకోపాటోపము చాలు.

12/20/2016 - 21:32

ఈ వడువున చతుర్వేదాలు ఉపన్యసించాయి. ఆశ్రుతుల వాక్కులు ఆలించి విరించి యజ్ఞపురుషులారా! శ్మశానంలో కాంతాలోలుడై వుండే ప్రమథగణనాథుడు ఎక్కడ? అవ్యయతత్త్వం ఎక్కడ? పరబ్రహ్మ భావం ఏ విధంగా సమకూరుతుంది? ఇక ఇక్కడ మీ మాటలు పొసగవు అని పలికే సమయంలో ప్రణవం రూపుతాల్చి వారితో ఈ రీతిగా పలికింది.

12/18/2016 - 00:35

‘‘ఓ పద్మభవా! పరతత్త్వము ఏదో తెలిసికొనలేక వూరక ఈ మహర్షులతో నేనే పరమాత్మని అంటూ అమరులందరూ పరిహాసం చేసేటట్లు దురహంకారంతో పలకడం నీకు తగివుందా? విను, నేను సాక్షాత్తు నారాయణుడిని, యజ్ఞపురుషుడిని. జగదేక ప్రభువిని. అవ్యయుణ్ణి. ‘అవ్యయతత్తం’ అనే శబ్దం (శాశ్వతతత్త్వం) నాయందే సుప్రతిష్ఠితం. నువ్వు ఈ విషయంలో ఎందుకూ కొరగాని, పెద్దరికాన్ని మీద వేసుకొని అహంకరించకు.

12/16/2016 - 21:22

దిగ్భ్రమ చెంది ఆ బోయ అడవిలో ఆ బోయను గుర్తుపట్టలేక అక్కడక్కడ తిరుగసాగాడు.
ఆ బోయ తస్కరుడు వచ్చిన చోటుకే మరల వస్తాడు. ప్రవేశించిన అడవి ప్రదేశానే్న తిరిగి ప్రవేశిస్తాడు. ఆ అడవిలో ఎక్కడా అస్థికలు కనపడక అచ్చెరువు పడ్డాడు. దైవ సంకల్పాలు సామాన్యాలా?

12/15/2016 - 21:23

ఆ ఆస్థికల పెట్టెయున్ను, గినె్నయున్ను, జియ్యములును, కంబలములున్ను, ఉచితమైన త్రోవ బత్తేన్ని వహించి ఒక్కడే త్రోవ మాత్రం తోడుగా, పలు దేశాలు గడచి, దేవాతా నివేదనానే్న ఆహారంగా కైకొంటూ కటిక నేలను పరుండేవాడు అయి, మార్గాయాసంవల్ల అలసట జ్వరం సోకినా లెక్క చెయ్యక, తరిమి తరిమి కొట్టినట్లుగా వడిగా నడచి, త్రోవ నడుమను ఒక బోయ పల్లెలో ఒక చెంచు వాడికి కూలి యిచ్చి, మూట మోయించుకొని, ఎట్టకేలకి అతి ప్రయాసతో కాశీ పట్టణం

12/15/2016 - 06:28

వ్రతదీక్షలు వెండితో, బంగారంతో కప్పల్ని, మొసల్ని, తాబేళ్లని, వానపాముల్ని, ఎండ్రకాయల్ని కలహంసల్ని, కారండవాల్ని, బకాలను చేయించి గంగా నదిలో వేస్తూ వుంటారు అని ఇందుశేఖరుడు విష్ణుమూర్తితో సెలవిచ్చాడు. గంగాతరంగిణి కూడ శంకరుడు చెప్పిన చొప్పున అరుగుదెంచి కాశీక్షేత్రానికి అపూర్వాలంకారం అయింది. ఇక మీరు పర్వత పుత్రికకు అమృత్యుంజయుడు తెలియచెప్పిన విధంగా కాశీక్షేత్ర మహత్మ్యాన్ని తెలియచెపుతాను.

12/13/2016 - 21:27

ఓ శౌరీ! ఆకాశగంగా సైకత ప్రదేశంలో శివలింగాన్ని అర్చించి, మనుజుడు అంగ, ఉపాంగాల సహితంగా యజ్ఞం చేసిన సత్ఫలితాన్ని పొందుతాడు. కాశికాపుర పొలిమేరలో ఆకాశగంగలో తీర్థమాడగోరి ఒడ్డు దిగే సమయంలో విచారంతో అఘములు తలపట్టు పట్టుకొని ఈనాడు మొదలుకొని మనకి దీనితో ఎడబాటు వ్రాసిపెట్టియున్నదా అంటూ గంగాతీరంలో క్రోధం, కామం, లోభం, మోహాదులతో కలిసి గొల్లుగొల్లున విలపిస్తాడు.

12/11/2016 - 21:37

జాహ్నవీ నదీ సలిల సేవ బ్రహ్మజ్ఞాన సంపద ప్రాప్తించడానికి హేతువు. కలియుగంలో కలుష చిత్తులకి, మనఃక్షోభం కలిగించే శఠులకీ, పరుల విత్తం అపహరించు నరులకీ, నియమ నిష్ఠలు పాటింపని జనులకీ, అంతరాత్మలో ప్రాయశ్చిత్తం కావించుకొనే కాంక్ష కలిగినపుడు మానవులకందరికీ గంగయే దిక్కు. శివరక్ష!

12/11/2016 - 04:52

అశ్వమేథ రాజసూయాధ్వరాలు చేసి సముపార్జించిన పుణ్యఫలాలు కాశీపురిలో మూడు రాత్రులు శయనించినంత మాత్రాన సమకూరుతాయి. తులా పురుషదానం (మానవుడు త్రాసులో తూగి ఆ ఎత్తు ధనం దానమివ్వడం) చేసిన ఫలం కాశీ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రం చేతనే సిద్ధిస్తుంది.

12/09/2016 - 21:28

విశే్వశ్వర స్వామి ఒక రోజున పార్వతీ దేవితో మన యింత పెద్ద కుటుంబానికి ఒక దక్షుడైన హితుడు నిర్వాహకుడు కావలసి వుంది కదా అని మంతనం ఆడాడు.
ఆ విధంగా మంతనం ఆడి సదాశివుడు గిరిరాజ కుమారి ముఖాన్ని అరకంట చూశాడు. ఆ చూపున వర్షాకాల మేఘం వంటి నీలవర్ణుడైన ఒక ముద్దు కొడుకు ప్రభవించాడు.

Pages