S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

11/13/2016 - 21:17

దీక్షితుడి నుడులు ఆలించి ఆ సోమిదమ్మ అతడితో ఈ కరణి వచించింది.

11/12/2016 - 22:13

ఈ విధంగానే నువ్వు ప్రవర్తిస్తే చిట్టచివరకి నీవల్ల తిన తిండి, మన గూడు, కట్టు వస్తమ్రులు లేక ఎల్లభంగుల నాశనం అయిపోతాము సుమా! నువ్వు నగరంలో చేస్తున్న సిగ్గు శరములు లేని కృత్యాలు చూసి మొదట నిన్ను అందరూ పరిహాసం చేస్తారు.

11/12/2016 - 07:24

ఉపనాయకులకి పెద్దరికం ఒనరిస్తాడు. కులటాతనయుల్ని కొండ చేస్తాడు. తారుపుగాళ్లని గౌరవించుతాడు. పోతులు, కోళ్లు మొదలైన జంతువులతో ఆడే సజీవ ద్యూతంలోను, ప్రాణులను ఒడ్డని నిర్జీవ ద్యూతంలోను ఓడిపోయి సొమ్ములు లేక ధనాలు తన కన్నతల్లి శరీరాభఱణాలను విక్రయించి చెల్లిస్తూ వుంటాడు.

11/11/2016 - 00:06

‘‘అవనీ సురోత్తమా! శివశర్మా! వరుణుడి నగరానికి ఉత్తరంగా కానవస్తున్నది గంధవతి. ఈ గంధవతీ మహా పట్టణాన్ని గంధవహుడు పరిపాలిస్తూ వుంటాడు. భవుడి కరుణవల్ల ఇతడు ఈ పదవి కాంచాడు. పూర్వకాలంలో ఈ గంధవహుడు కశ్యపుడి దాయాది. పూతాత్ముడనే బ్రాహ్మణుడు ఇతడు. ఇతడే వాయుదేవుడు. ఈ పూతాత్ముడు బాలచంద్రధరుడి రాజధాని అయిన వారణాసిలో పదివేల యేండ్లు తపమారించి, లింగం ప్రతిష్ఠ జరిపాడు.

11/10/2016 - 07:45

అతడి చెలిమికాండ్రు భయభ్రాంత చిత్తులయి ఏతెంచి దేవార్చన సమయంలో సమాధి నిష్ఠుడై వున్న అతడి తండ్రి కర్దముడికి ఆ వార్త విన్నవించారు.

11/08/2016 - 21:16

పాదరక్షలు, గొడుగులు, వీవనలు, వస్త్రాలు, కంబళ్లు దానమిస్తాడు. రోగార్తులకి ఉపచర్యలు కావిస్తాడు. ఆపదలు ఎదురయే అడవి తోవలు దాటించడానికి బంటుల్ని తోడు పంపిస్తాడు. విశేషించి కాశీ పట్టణానికి ఏగు యాత్రికులకి సత్కారాలు మెండుగా చేస్తాడు.

11/06/2016 - 21:55

ఆ వజ్రాయుధాగ్ని జ్వాలలు చుట్టుముట్టి ధైర్యం విడనాడి ఆ వైశ్వానర బాలుడు అగాథమూ, అచంచలమూ అయిన భక్తి వైభవంతో శంభుడు, శంకరుడు, నీల లోహితుడు, ఉమానాథుడు, విరూపాక్షుడు అయిన కాశీపురాధీశ్వరుణ్ణి ధ్యానిస్తూ తీవ్ర వ్యధ చెంది మూర్ఛపోయాడు.

11/06/2016 - 05:00

‘‘్భకరమైన కాలపాశబద్ధుడై ప్రాణాపాయభీతుడైన శే్వతకేతువుని రక్షింపలేదా? శిలాదుడి తనయుడైన ఎనిమిదేండ్ల నందీశ్వరుణ్ణి రక్షించలేదా? కాలకూట విషాగ్నిచే దగ్ధములు కాకుండా పదునాలుగు భువనాలను పాలింపడా? ఆయుర్దాయం నిండిన మృకండు మహర్షి తనయుడైన మార్కండేయుణ్ణి కరుణాభావంతో మనుపలేదా?

11/04/2016 - 21:57

పద్మం లోపలి భాగంవలె అరుణారుణాలై సమాన ప్రమాణం కల గుల్ఫాలు కలిగి మృదుల మృదులాలయి, స్వచ్ఛమైన ఎర్ర వనె్న గోళ్ళు కలిగి, చెమర్చని అడుగులు మానవుడికి సిరిని ఒసగుతాయి.

11/03/2016 - 21:53

మీరు చెప్పిన మాట విని చేస్తున్నాడా? తల్లి దండ్రుల మాట జవదాటకుండా చెప్పిన విధముగా చెయ్యడమే కొడుకుకి ఉత్తమోత్తమ ధర్మం. సుతుడికి ధర్మమన్నా దైవమన్నా అర్థం అన్నా గురువైనా ధనమైనా తల్లిదండ్రులే! జననీ జనకుల్ని కొలువడమే తనయుడికి ముఖ్య ధర్మం. తల్లిదండ్రులను సేవించుటకంటే నందనుడికి అత్యథిక ధర్మం వేరొకటి లేదు.

Pages