S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భక్తి కథలు

12/08/2016 - 21:36

సర్వజ్ఞుడు అయిన మా తండ్రి ఆ జగన్మాతకి ఆనతిచ్చిన ప్రకారం నీకు చెపుతాను, ఏకాగ్రమతివై ఆకర్ణించు.
వారణస్వాది నామ నిర్వచనము
బ్రహ్మదేవుడి ఆయుర్దాయవసాన కాలంలో సమస్త లోకాలను మ్రింగి ‘మాయ’ వికల్పాలు లేనిదై తన్ను ఆశ్రయించింది. అంత పరమాత్మ అలలు లేని సముద్రమై అన్ని హద్దులు కలదై ప్రాణుల కర్మలు పండే కాలం ప్రాప్తించేదాకా మిన్నక వుంది.

12/08/2016 - 08:26

ఈ రీతిగా పెద్దకాలం రాజ్యం ఏలి, సుతుడి భుజాన రాజ్య భారం మోపి, కాశీకి చని, అయోధ్య, అవంతి, కాంచి, మధుర, ద్వారవతి, ఉజ్జయినీ తీర్థాల సంసేవనంవల్ల విశే్వశ్వరుడి అనుగ్రహంవల్ల మోక్షం పొందుతావు అని పలికి హరి సేవకులు ఆ శివశర్మని దివ్య విమానం నుంచి దింపి, నారాయణుడి ముందట వుంచారు.

12/06/2016 - 21:20

వేన వేల యోజనాల వైశాల్యంతో అలరారే లక్ష కోటి శలాకలతో (ఊచలతో) అలంకరించబడిన, నక్షత్రాల వంటి పెద్ద ముత్యాలతో పొదుగబడిన శే్వతచ్ఛత్రాన్ని వెనకయ్య వెన్నుడికి పట్టాడు.
పట్ట్భాషేక సమయంలో పలు రీతులుగా విష్ణుమూర్తిని పార్వతీదేవి అలంకరించింది. సరస్వతీదేవి మణులు కూర్చిన అద్దాన్ని చూపింది. శచీదేవి మణిమయ దీప సమూహంతో నివ్వాళి పట్టింది.

12/04/2016 - 21:29

పిమ్మట ఆ బాలుడు యమునా తటమున వున్న మధువనంలో పరమ భక్తి పరుడై శ్రీమన్నారాయణుడిని పెక్కేండ్లు పుల విఘ్నాలకి మనస్సుని చలింపనివ్వక ఆరాధించి, తనకు ప్రత్యక్షం అయిన పుండరీక లోచనుడివల్ల సకల విశ్వం కంటే సమున్నతమైన రుూ ధ్రువ పదాన్ని పొందాడు.

12/03/2016 - 20:56

అంత అక్కడ శనైశ్చరుడు కాశీ నగరానికి వెడలి, లింగ ప్రతిష్ఠ కావించాడు. ఆ శనైశ్చరేశ్వరుడు విశే్వశ్వర దేవుడికి దక్షణం వైపున శుక్రేశ్వరుడికి ఉత్తరంగా ప్రతిష్ఠితుడయి సేవించు భక్తులకి భోగం మోక్షం ప్రసాదిస్తాడు. శనైశ్చరుడికి ఈ లోకం శనైశ్చరేశ్వర లింగం ప్రసాదం. ఇది శనైశ్చర లోక వృత్తాంతము.
సప్తర్షి లోక వృత్తాంతం

12/02/2016 - 21:27

సవతి కొడుకు చేసిన నేరాన్ని కాచినంత మాత్రాన ఏమవుతుంది? చిన్న తప్పుకి తగని పెద్ద శిక్ష విధించడం తగవా? యముడు తనపైకి పాదం చాచగా కనికరం ఇసుమంతయినా లేక కంటికొసలు కెంపు కదురుగా క్రోధంతో చూసి ఆ బాలుడైన యముడి పాదం తెగిపడాలని శపించింది.

12/01/2016 - 21:15

అంగారకుడు పాలించే లోకానికి ఊర్థ్వమైన స్థానంలో వసించు’’ అని వరాలు అనుగ్రహించి నీలగ్రీవుడు దేవతా సమూహంతో పాటు బ్రహ్మదేవుణ్ణి కూడా తలచాడు.
స్మరణమాత్రం చేత ఏతెంచిన ఆ బ్రహ్మాది దేవతాతతి చేత ఆ బృహస్పతికి దేవతాచార్య పదవీ సామ్రాజ్యానికి పట్ట్భాషేకం చేయించాడు. అనంతరం చంద్రేశ్వరుడి దక్షిణ దిక్కున విశే్వశ్వరుడికి నిరృతి దిక్కున బృహస్పతి ప్రతిష్ఠ చేసిన బృహస్పతీశ్వర లింగంలో ప్రవేశించాడు.

12/01/2016 - 05:35

రాలిన తత్‌క్షణం ధరణీస్థలంలో పద్మరాగముల కాంతిని పోలిన కాంతితో ఎట్టఎదుట ఒక దివ్య కుమారుడై నిలబడి వున్నాడు. శంభుడు ఆ కుమారుణ్ణి తన తనయుడుగా ఆదరించాడు. భూదేవి కూడా అతణ్ణి పుత్రుడిగా భావించింది. ఆ కుమారుడు అచంచల చిత్తంతో తపం సల్పగోరాడు.

11/30/2016 - 03:51

ఆ తరిని మాధవకింకరులు శివశర్మతో ఈ వడువన శుక్రలోక వర్ణనమును చెప్పసాగారు.
ఇంద్రుడి నిశిత ప్రయోగాలకు ప్రతి విధాన క్రమంలో సమర్థుడైన రాక్షస గురువైన శుక్రాచార్యుడి లోకం ఇది. ఈ లోకంలో దనుజ గురువైన శుక్రుడు నివశిస్తాడు. ఆ శుక్రుడు శివుడు వల్ల వెయ్యేండ్లు నూక పొగ ఆహారంగా దుస్సహం అయిన తపం ఆచరించి మృత సంజీవినీ విద్యారహస్యాన్ని సకీలకంగా తెలిసికొన్నాడు.

11/27/2016 - 23:54

శివుడు త్రిపురాసురుల భార్యల చెక్కిళ్ల రచించబడిన గజాకార మకరాకార కస్తూరికా పత్రములు తుడిచిపెట్టినవాడు. జలంధరాక్షసుడి హృదయ గర్వాన్ని నాశనం చేసినవాడు. గజాసురుడి శిరోగ్రభాగాన్ని అణచివేసినవాడు. ధక్షుడి అధ్వరం అనే లేడిని చంపడంలో క్రూరమైనవాడు.

Pages