S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

03/15/2019 - 19:34

కానీ ఆవిడ ఆప్యాయతలో ఉన్న సహజత్వాన్ని గమనించిన మనసు మాత్రం నీ కష్టాలు గట్టెక్కాయని గట్టిగా చెప్పింది.
‘‘వదినా! రేపు నేను వంట చేస్తాను. మా ఫ్రండ్స్ అంతా కాలేజీలో రకరకాల వంటలు చెబుతూ ఉంటారు. ఆ ప్రయోగం చెయ్యనీ. నీకూ కాస్త ఆటవిడుపు. నా సరదా కూడా తీరుతుంది’’ అంది.
‘‘విశ్వగారు వచ్చిన సందర్భంలో రేపు మనమంతా కలిసి సినిమాకి వెళదాం అన్నాడు శాంత భర్త వేణుగోపాల్.’’

03/14/2019 - 18:53

‘‘పెద్దవారిని అగౌరవ పరచకూడదని వీటన్నిటినీ నేను సహిస్తున్నాను.’’
‘‘మా ఆయన అసలు రానే రారు. తను లేకపోతే షాపు నడవదంటారు. తనూ రోజూ క్యారేజీ తీసుకుని వెళ్ళిపోతారు.’’
‘‘అదేమిటి పెద్దవాళ్ళు మామయ్యగారు ఉండగా అలా ఎందుకు అంటారు?’’
‘‘ఏమో! చెప్పింది వినటమే. ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తాయి. ఉండే ఆ రెండు మాటలు కూడా ఉండవు. ప్రయోజనం లేనప్పుడు ఎందుకని నేను వౌనంతోనే స్నేహం చేస్తున్నాను.’’

03/13/2019 - 18:42

పనికిరాని కబుర్లతో కాలాన్ని వ్యర్థం చేసేకంటే ఇలా పుస్తకాలు చదవటం అలవాటు చేసుకుంటే కాస్త జ్ఞానం అయినా పెరుగుతుంది. అందుకే ఇలా ఈ అలవాటుకి వారితో శ్రీకారం చుట్టించింది. మెల్లమెల్లగా వారంతా దానికి అలవాటు పడతారు.
అసలు టీ.వీ.లను వదిలేసి ఇలా సమావేశమవటం కూడా తనకు ఆశ్చర్యంగానే ఉంది. ఆడవాళ్ళు అసలు టీ.వీ.లను వదలటం లేదుగా.

03/12/2019 - 19:38

పుదాన్ని కాస్త ట్యూన్ చేస్తే సరిపోతుంది అనుకుంది మనసులో.
‘‘అవును విశ్వనే’’

03/11/2019 - 20:26

అలా ఆ జంట దంపతులయిన సందర్భంలో కంపెనీ స్ట్ఫా అందరూ వేడుక చేసుకోవాలని, తప్పదని అనటంతో చంద్రని చిన్నబుచ్చుకోనివ్వకూడదని అంగీకరించింది. మొదటిసారి తల్లిని వదిలి దూరంగా వెళ్లింది. సుగుణని రమ్మని ఎంత బ్రతిమాలినా నిరాకరించటంతో వెళ్లక తప్పలేదు. జాగ్రత్తగా చూసుకోమని భువన పెద్దమ్మకి అప్పజెప్పి వెళ్లింది. ‘అమ్మ నా దగ్గిరే ఉంటుంది’ అని ఆవిడ హామీ ఇచ్చాకే విశ్వ ప్రయాణానికి సిద్ధమైంది.

03/10/2019 - 22:53

మరునాడు ఆదివారం కావడంతో ఈ సందర్భంగా బుల్లి విందు ఏర్పాటుచేసుకున్నారు.

03/08/2019 - 20:31

సరే! నీకెంత కావాలో అంత టైమ్ తీసుకో’’
‘‘్థంక్స్ చందూ’’ అంది అప్రయత్నంగా.
తన పిలుపునకే కొత్త మాధుర్యం వచ్చినట్లనిపించింది అతనికి.
‘అండీ’ అనే పైపైన గౌరవం కంటే ఎదుటివాళ్ళ మాటను మన్నించటంలో ఎక్కువ ఇష్టం చూపించాలి అనేది తన భావన. అది అతనికి అర్థమయ్యిందా?
అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది.
‘‘విశ్వా! నువ్వే కాదు నీ కళ్ళు కూడా మాట్లాడుతాయే!’’

03/07/2019 - 20:06

అమ్మా!’’
కప్పుకున్న దుప్పటిని ఒక్కలాగు లాగి అవతల పారేశాడు. ఒక్క ఉరుకు ఉరికాడు మంచంమీదనుంచీ క్రిందకు. పరుగెత్తినట్లే భువనేశ్వరి దగ్గరకు వెతుక్కుంటూ వెళ్లాడు.
ఆవిడ ఏదో కుట్టుకుంటున్నారు.
‘‘అత్తయ్యా! అంటూ ఆమె మెడ చుట్టూ చేతులు వేసి కావలించుకున్నాడు’’
‘‘ఏమయ్యిందిరా?’’
అమృత చెప్పిన విషయమంతా వివరించాడు ఆమెకు.

03/06/2019 - 20:09

మన భాషను మరవద్దు అని చెప్పేదానివి. అదే విశ్వ మనసులో నాటుకుపోయింది’’ అంది అంతరంగం.
‘‘నిజమే. అందరూ అలా వలసలు వెళ్లిపోతే ఇక్కడ ఉండేవారు ఎవరు? మన దేశానికి మనం ఉపయోగపడాలి. అందులో న్యాయముంది’’
‘‘మరింకెందుకు బాధపడతావు?’’ అంది ఊరుకోకుండా అంతరంగం.
‘‘అది అలా అన్నందుకు నాకు బాధ లేదు. సంబంధం పోయిందనే’’
‘‘అది అలా అన్నందుకు నాకు బాధ లేదు. సంబంధం పోయిందనే’’

03/05/2019 - 20:09

‘‘పోనీలే ఏం చేస్తాం. పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయమయిపోతాయట’’
‘‘అయిపోయాక ఇక ఎన్ని అనుకున్నా లాభం లేదు’’
‘‘అంతే అని ఊరుకోలేకపోతున్నాను. అదే నా బాధ. నీకు చెప్పాక కాస్త తగ్గినట్లుంది’’ అంది శాంతి.
‘‘ఎన్నాళ్ళుంటావ్ శాంతీ?’’
‘‘ఎన్నాళ్ళోనా? రేపు వెళ్లిపోవాలి. పెళ్లికాకముందు ఎలా ఉంటారో తెలియదు. కానీ పెళ్ళయ్యక భార్య, కోడలు లేకపోతే ఇల్లే గడవదంటారే’

Pages