S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/19/2019 - 19:58

అనూహ్యంగా పాతిక అంకె అయిదు వందలకిచేరింది. ఇక అడ్మిషన్సన్స్ తీసుకోమని ప్రకటించేసింది. మధ్య మధ్యలో ఎవరినీ చేర్చుకునే ఉద్దేశ్యం కూడా లేదు. అందరూ తన శిక్షణలో ఒకేరకంగా పెరిగినవారయితేనే తను అనుకున్నది సాధిస్తుంది. వారిమధ్య ఒక్క కలుపుమొక్క చేరినా తన ప్రయత్నం మొత్తం విఫలవౌతుంది. అంతకంటే సంఖ్యను పెంచుకుంటే వారికి తాను పూర్తి న్యాయం చేయలేననుకుంది.

04/18/2019 - 20:17

తమ ప్రదేశంలో చేపలు పట్టేవారు ఎక్కువ. అదే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్లి వాళ్ళను ఒప్పించే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది. మా పిల్లలకు చదువు అక్కర్లేదు అని కొందరు, ఇంట్లో సాయపడతారని ఇంకొందరు, మాకు తిండికి లేకపోయినా మా పిల్లలకు ఇంగ్లీషు చదువులే చదివిస్తామని మరికొందరు మాట్లాడుతుంటే విశ్వకు ఏం చెయ్యాలో తోచలేదు.

04/17/2019 - 20:12

‘‘మీ అబ్బాయి బాల్కనీలో ఫోను మాట్లాడుతున్నారు. వెళ్లి చెప్పిస్తాను’’ అంటూ అటు వెళ్లింది విశ్వ.
‘‘హలో! గ్లాడ్ టు మీట్ యు’’ అంటూ కరచాలనం చేశారు ఆయన.
‘‘మీరు..?’’ గుర్తురానట్లుగా ముఖం పెట్టారాయన.
‘‘ఈ ప్రక్క బిల్డింగ్ మాదేనండి. నా పేరు ధన్‌రాజ్’’
‘‘ఓ! అలాగా! కూర్చోండి! కూర్చోండి!’’ అన్నాడు.
అప్పటికి విషయం అర్థమైంది ఆయనకి.
చందూ ఫోను మాట్లాడి ఉంటాడు.

04/16/2019 - 20:13

మంచి అలవాట్లంటే ఈరకంగా ఉండాలి అని తెలియజేయటానికే ఇది ప్రారంభించాం అన్నది నెమ్మది నెమ్మదిగా హైస్కూలు, కాలేజీగా అభివృద్ధి చెయ్యాలి. మంచి స్ట్ఫాని నియమించటంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒకసారి వాళ్లను తీసుకున్నాక మళ్లీ మనం వాళ్ళెలా చేస్తున్నారని వెనక్కి తిరిగి చూసేట్లు ఉండకూడదు.
పిల్లలు ఆడుకోవటానికి చక్కని గ్రౌండు ఉండాలి. ఇలాంటిది అద్దెకు తీసుకున్నా ఫర్వాలేదు.

04/15/2019 - 23:29

అది తమ సొంత కంపెనీగా భావిస్తారు. బాధ్యతగా పనిచేస్తారు. అప్పుడు కంపెనీ కూడా లాభాల బాటలోనే పయనిస్తుంది. ఆ లాభాలలో కాస్త పర్సంటేజ్ వాళ్ళకూ పంచితే ఇక ఆ కంపెనీని ఎవ్వరూ వీడరు కూడా. సూర్యచంద్ర కూడా అదే పనిలో ఉన్నాడు.
తండ్రితో చర్చించి ఆ నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. ఆయన తన దగ్గరకు రావటంతో బలమైన అండ తన ప్రక్కన చేరినట్లనిపిస్తోంది. కొండంత ధైర్యం కూడా!

04/14/2019 - 22:06

‘‘ఎవరి ప్రేమ అయితేనేం? మనకి కావాల్సింది మనమంతా కలసి ఉండటం. అది జరుగుతోందిగా’’ అంది తేలికగా విశ్వ.
‘‘ఊరికే నిన్ను ఏడిపిద్దామని అన్నాలే!’’
‘‘ఈ నెల ఎప్పుడు అయిపోతుందా అని ఎదురుచూస్తాను’’ అంది విశ్వ.
‘‘ఈ రోజంతా ఎలా గడిపారో చెప్పి ఆ ఫోటోలు అన్నీ చూపించి వారి దగ్గిర ఆశీర్వాదం తీసుకున్నాడు సూర్యచంద్ర.

04/12/2019 - 19:30

‘‘పిల్లలు ఇంత బాధ్యతారహితంగా ఎలా ప్రవర్తిస్తారు?’’ అన్నదే విశ్వను అనుక్షణం తొలిచే ప్రశ్న.
అంత దయార్ద్ర హృదయాలున్న తల్లిదండ్రులను పరాయి పంచకు ఎలా పంపించాలనిపిస్తుంది?
తమకు వున్నా లేకున్నా పిల్లల కడుపు నింపుతారు తల్లిదండ్రులు. మరి వీళ్ళేమో వారే భారమనుకుంటున్నారు?
రేపు వాళ్ళ పిల్లలుకూడా వీళ్లను అలా వదిలేస్తే అని ఒక్కసారి కూడా ఆలోచించరా?

04/11/2019 - 22:23

‘‘నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఇలా పుట్టినరోజు చేసుకోలేదు. ఎప్పుడూ అనాథ శరణాలయానికి వెళ్లి అక్కడ వాళ్లకు చాక్‌లెట్లు ఇచ్చేదాన్ని. అదే నాకు ఆనందంగా ఉండేది. ఎందుకో ఇపుడు చందూకి సింపుల్‌గా ఇలా చెయ్యాలనిపించింది. అసలు 12 గంటలకు ఇదంతా చేద్దామనుకున్నా. కాకపోతే మీరూ, శివ, గంగ కూడా ఉంటారని ఇపుడు చేస్తున్నా’’ అంది విశ్వ.

04/10/2019 - 19:27

పెద్ద లైటు ఆర్పెయ్యటంతో నీలి రంగు బెడ్‌లైట్ కాంతి ఆ గదంతా పరచుకుంది.
ఇది ఆర్పటం, అది వేయటం రెండూ ఒకేసారి చెయ్యటం విశ్వ అలవాటు.
దాన్ని సరదాగా చూడటం తన అలవాటుగా మార్చుకున్నాడు చందూ.
‘‘ఇక దేవిగారు మమ్మల్ని కరుణిస్తే సంతోషిస్తాం’’
చిన్నగా నవ్వి అతని చెంత చేరింది విశ్వ.
ఇక ఆ ప్రియలోకం వారిదే. అన్యులకు తావులేదందులో.
***

04/09/2019 - 19:45

అందుకే ఆయన బలం తగ్గిపోయింది.

Pages