S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

05/01/2019 - 19:59

అమ్మా.. అమ్మా.. ఆక్రోశిస్తోంది ఆమె హృదయం ప్రతిక్షణం.
‘‘ఆ అమ్మాయిని కాసేపు లోపలికి తీసుకువెళ్లండి’’ అన్నారెవరో. దానికోసమే చూస్తున్న భీమేశ్వరి విశ్వ రానంటున్నా బలవంతంగా లోపలికి తీసుకువచ్చింది.
‘‘నన్ను ఉండనీ అక్కా! మళ్లీ అమ్మను చూడలేనుగా’’
వెళుదువుగానీ.. ఇప్పుడే వెళుదువుగానీ అని కాసేపు ఆపగలిగింది ఆమె.

04/30/2019 - 19:17

ఎప్పటినుంచో ఇక్కడే ఉన్నారు. ఈ రోజు ఈ ఊరినీ, ఈ లోకానే్న వదిలేసిందన్నమాట. ప్చ్.. ఈ రోజు ఆవిడ.. రేపు ఎవరో.. అంతా మాయ. ఈ ప్రపంచమే మాయ అనుకుంటూ వెళుతున్నాడు ఒక ముసలి వయసులో వున్న పెద్దాయన.
బ్రతుకుమీద తీపి వున్నవాడికి ఎప్పుడు పోతానో అని భయం అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. అదీ వయసు పెరిగేకొద్దీ ఈ యావ మరీ ఎక్కువవుతూ వుంటుంది. అదే ఇంకా ఏం సాధిస్తాంలే అనుకునేవాళ్లకు ఏ రోజైనా ఒకటే అనుకుంటారు.

04/29/2019 - 18:57

అలా ఆ సాయంత్రం ఆమె మదిలో చెరగని జ్ఞాపకంగా ఆమె జీవిత పుటలలో మిగిలిపోయింది.
సంధ్యా సమయంలో ఆ జంట తిరుగు ప్రయాణమయ్యారు.
***
ఇంటికి రాగానే ‘అత్తయ్యా!’ అంటూ ఆవిడను చుట్టేసింది.
‘‘ఇది చాలా అన్యాయం’’ అంది ఆవిడలో ఒదిగిపోతూ.
‘‘ఏదీ! నువ్వనుకున్నవన్నీ కార్యరూపంలోకి తీసుకురావటమా?’’ అంది హాస్యంగా.
‘‘అది కాదు. నాకు చెప్పకపోవటం’’

04/28/2019 - 23:03

‘‘ఏమో! దేవి గారికి దేనిమీదా వ్యామోహం ఉండదుగా. అంత చేసినా గుర్తింపు ఉంటుందనుకోలేదు. ముద్దు ఇస్తావని కూడా ఊహించలేదు’’.
‘‘చందూ.. ఇంక ఆట పట్టించటం మానెయ్. ఇప్పటికి చేసింది చాలు’’.
‘‘ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. పద..పద’’ అంటూ ముందుకి కదిలాడు.

04/26/2019 - 19:58

దారి పొడుగునా కబుర్లు చెబుతూనే ఉన్నాడు చందూ.
మధ్య మద్యలో ఏవేవో అడుగుతున్నాడు.
తనూ సమాధానాలు చెబుతూనే వుంది.
కానీ శరీరం ఇక్కడున్నా మనసు ‘లోగిలి’ లోగిలిలోనే ఉండిపోయింది. అది తనకు మాత్రమే తెలుసు.
‘చందూకి కూడా’ అంది అంతరంగం.
‘‘ఏం కాదు. ఈసారి అసలు చందూ నా బాధను గుర్తించటమే లేదు’’ తనలో తాను అనుకుంటున్నానని బయటకే అనేసింది.
‘‘ఏమిటంటున్నావ్?’’ అడిగాడు చందూ.

04/25/2019 - 22:20

‘‘రాయచ్చు’’అన్నారావిడ.
‘‘అయితే రాయండి. యువత పయనం గురించి ముఖ్యంగా తెలపండి అందులో. కాలేజీకి వెళ్ళేదే ప్రేమకోసం అనుకునే ఈ యువతరంకి కనువిప్పుగా ఉండాలి నవల. వాళ్ళు సక్రమ మార్గంలో నడిస్తేనే మన దేశం అభివృద్ధి చెందేది?’’
‘‘మీరే రాయవచ్చుగా. చక్కగా మాట్లాడుతున్నారు’’
‘‘లేదు.. లేదు.. సరస్వతీ కటాక్షం అందరికీ దొరికేవస్తువు కాదు. అది కొందరికే వరం. అందులో ముఖ్యులు మీరు’’.

04/24/2019 - 22:22

అది చెప్పటం మా బాధ్యతని చెబుతున్నాను. మీరు అలా వాళ్ళ అడ్రస్సులు తీసుకుని వెళతానంటే మనసులో వృధాశ్రమ అని అనుకున్న మాట నిజమే. వారిలో మార్పు వస్తుందని నేనే మాత్రం ఊహించలేదు. పదిమందిలో ఇద్దరు మారినా మన ప్రయత్నం ఫలించినట్లే. చాలా సంతోషమమ్మా’’.

04/23/2019 - 18:28

‘‘అలా కళ్లముందు అతను యాక్సిడెంటయ్యి చచ్చిపోతే చూడలేకపోయాను చందూ. అప్పటికే అతనికేమవుతుందో అని ఆరాటపడుతున్నాను. అదే సమయంలో అలా జరిగేటప్పటికి తట్టుకోలేకపోయాను’’.
‘నీకేమయినా అయితే మా సంగతి ఏమిటి అని ఒక్కసారి కూడా ఆలోచించవా?’’ గట్టిగానే అడిగాడు.
చందూకి ఇంకా కోపం తగ్గలేదు.
పెళ్ళయ్యాక ఇదే మొదటిసారి అతన్ని అంత కోపంగా చూడటం.
భయం వేసింది విశ్వకు. బెదిరిపోయింది.

04/22/2019 - 19:50

‘‘అలా అంటావేమిటి విశ్వా? కృషి అంతా నీది. ప్రోత్సాహం మాత్రమే నాది. గొప్పతనం అంతా నాకు ఆపాదించకు. ఇంకా కొద్దో గొప్పో చెందితే అది ఇద్దరి అమ్మలకు చెందాలి’’.
‘‘తెరవెనుకే మేము. తెరముందంతా విశే్వ కనిపించాలి. మాకు కావాల్సింది విజయం కానీ గుర్తింపు కాదు. విశ్వకి వస్తే మాకూ వచ్చినట్లే’’ అంటారు ఏకకంఠంతో వాళ్ళిద్దరూ.

04/21/2019 - 22:19

ఇదంతా తెలుసుకున్న ఆ ప్రేమజంట ‘‘ఇక తాము మీ ఇంటికి రామని చెప్పారు. మావల్ల మీరు అందరికీ దూరమవటం మాకిష్టంలేదు’’ అన్నారు.
అది వాళ్ళ సంస్కారం.
చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపించింది విశ్వకయితే.

Pages