S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డైలీ సీరియల్

04/27/2018 - 20:53

కోరికలేని ఇష్టం.. స్వార్థం లేని ప్రేమ.. కాంక్షలేని కలయిక.. అక్కడ పరిమళాలు వెదజల్లుతోంది..
దంపతులారా ఆస్వాదించండి.
***

04/26/2018 - 23:47

గతాలు వర్తమానాలు భవిష్యత్తు కాలాలు స్థితులు తప్పాయి.. దంపతుల దశను దిశను మార్చడానికి...
ఎప్పుడెప్పుడు సంవత్సరం గడుస్తుందా...? ఎప్పుడెప్పుడు రెండు రెళ్ళు నాలుగు గుండెల చప్పుళ్ళు ఏ నిజాన్ని చెబుతాయో..?
***
9
పావని.. కిరణ్...
ఇద్దరూ బెడ్‌రూమ్‌లో వున్నారు చెరోవైపు తిరిగి.

04/25/2018 - 21:20

రాజ్యకాంక్ష మహాభారతాన్ని కురుక్షేత్రం వైపు నడిపించినట్టు.. ఈ ఎప్పుడెప్పుడు యుద్ధం ఏదో ఒక నీతిని చెబుతుంది. ఒక నిత్య సత్యాన్ని, జగన్నాటక కారణాన్ని విశే్లషిస్తుంది.. అనిపించింది ఆ ఇద్దరికీ..
కలిసి ఉండడంకన్నా ఒకరినొకరు ప్రేమించుకునేవారు.. ఒకరితో ఒకరు గొడవపడటం ఎంత కష్టమో తెలిసింది.
ప్రేమించడంకన్నా ప్రేమించుకునేవారు ద్వేషించుకోవడం అంత ఈజీ కాదని అర్థమైంది.

04/24/2018 - 21:28

భార్యల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది కారణాలు వేరైనా... కొత్తలో భర్త లేట్‌గా వచ్చినా మొహమాటమో.. కారణం ఏదైనా పట్టించుకోరు.. పోనుపోను ఇద్దరిమధ్య అపార్థాలు అపోహలు ఇగోలు అన్నీ కలిసి గొడవలకు దారితీస్తాయి. అలాంటి గొడవలు ఎలా వుంటాయో మనం చూద్దాం.. ఈరోజునుంచి మనం పెళ్ళై సంవత్సరం నిండిన దంపతులం.. మాగ్జిమమ్ గొడవ పడుదాం... ఒక్క సంవత్సరంలోనే గొడవలన్నీ పూర్తవ్వాలి...

04/23/2018 - 21:56

అతని ఎదురుచూపులు గోడ గడియారం అయిదు గంటలను చూపించడంలో అంతమయ్యాయి.
‘‘ఒరే కిరణ్.. త్వరగా పద..’’ అన్నాడు.
‘‘నిహార్ నన్ను ఊర్వశి దగ్గర వదిలేసి వెళ్ళు’’ అన్నాడు కిరణ్.
అర్థం కానట్టు చూసాడు.

04/22/2018 - 22:05

‘‘పెళ్లికి ముందు మనం ఏం చెప్పినా అలాగా అంటారు.. కనీసం కారణం కూడా అడగరు.. అది తినండి.. ఇది తినండి అంటూ కొసరి కొసరి వడ్డిస్తారు. ఏదైనా కొనిపెడదామని సరదా పడినా.. ‘‘అబ్బే వద్దండీ’’ అంటూ చిలక పలుకులు పలుకుతారు. అర్థరాత్రి ఇంటికి వస్తే అలసిపోయామని కాళ్ళు పడతారు.. మనం ఏం చెప్పినా ఊ కొడుతారు.. ఒకప్పటి గర్ల్‌ఫ్రెండ్ గురించి చెప్పినా నవ్వి ఊరుకుంటారు..

04/19/2018 - 22:13

‘‘మీ ఆఫీసులో శాంతి వుంది కదా.. దాని దగ్గరికి వెళ్లండి.. అచ్చటా ముచ్చటా తీరుస్తుంది.. వాట్సాప్‌లో మెసేజీలు పంపిస్తారుగా’’.
‘‘వాళ్ళాయన్ను ఎంత అశాంతికి గురిచేస్తుందో.. ఆ.. శాంతి.. ఈ పెళ్లాలంతా ఇంతే..’’ అని ఎందుకైనా మంచిది రేపు శాంతిని కనుక్కుంటాను’’ అన్నాడు.
వెంటనే కిరణ్ ఒంటికి చుట్టుకున్న దుప్పటి గట్టిగా లాగింది. ఆ వేగానికి అతను మంచంమీదనుండి కిందపడ్డాడు.

04/18/2018 - 21:21

‘‘అబ్బబ్బ నీ గొడవేంటి?’’ విసుక్కున్నాడు కిరణ్.
‘‘నాకు నిజం కావాలి?’’ ముక్కు ఎగబీలుస్తూ అంది.
‘‘సరే రేపు ఆఫీసునుంచి వచ్చేటపుడు తీసుకువస్తాను...’’ అన్నాడు కిరణ్.
అంతే పావనికి కోపం నషాళానికి అంటింది. కిచెన్‌లోకి వెళ్లి ఫ్రిజ్‌లో పెద్ద వాటర్ బాటిల్ తీసుకువచ్చి కిరణ్ నెత్తిమీదుగా ఒంపేసింది. డీప్ ఫ్రిజ్‌లో పెట్టిన వాటర్ కావడంవల్ల చల్లగా ఉన్నాయి.

04/17/2018 - 22:00

అతనికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కొలీగ్స్ బార్‌లోకి రావడంతోనే మందు ఆర్డర్ చేసాడు నిహార్. వెయిటర్ మందు బాటిల్స్ పెట్టడమే ఆలస్యం తానే మందును గ్లాస్‌లోకి పోసాడు. కొలీగ్స్‌కు మాట్లాడి అవకాశం ఇవ్వకుండా వాళ్ళనోటి ముందు గ్లాస్ పెట్టాడు. కనీసం పెగ్గుకు పెగ్గుకు మధ్య గ్యాప్ కూడా తీసుకోనివ్వలేదు.

Pages