S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/23/2016 - 03:46

శామీర్‌పేట: రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల మండలంలో భారీగా వరద నీరు వచ్చి చేరింది. గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో తుర్కపల్లి గ్రామంలో మేకల మందపై పిడుగు పడింది. ప్రమాదంలో సుమారు 26 మేకలు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. తుర్కపల్లి గ్రామంలో శ్రీనివాస్‌కు చెందిన మేకల పెంపకంతో జీవనం వెళ్లదీస్తున్నాడు. పిడుగు ప్రమాదంతో తాను ఎంతో నష్టపోయానని రోదించారు.

09/23/2016 - 03:44

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహానగరాన్ని వర్షాల భయం వెంటాడుతోంది. తరుచూ కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలతో నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఇప్పటికే మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు కురిసిన వర్షాల షాక్ నుంచి నగరం తేరుకోకముందే గురువారం ఉదయం కొన్ని ప్రాంతాల్లో కుండపోత, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

09/23/2016 - 03:43

జీడిమెట్ల, సెప్టెంబర్ 22: కుండపోత వర్షాలతో నిజాంపేట్ గ్రామం అతలాకుతలం అవుతుంది. గ్రామంలోని తుర్క చెరువు పూర్తిగా నిండిపోయి అలుగు, తూముల ద్వారా నీటిని ఇతర ప్రాంతానికి తరలిస్తున్నారు. తాత్కాలికంగా తీసిన తూము ద్వారా వచ్చే వరద నీరు బండారి లే అవుట్ కాలనీని ముంచెత్తింది. రెండు రోజులుగా గ్రామంలోని బండారి లేఅవుట్ కాలనీ నీటమునిగింది. దీంతో అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లలో వరద నీరు నిండింది.

09/23/2016 - 03:42

అల్వాల్, సెప్టెంబర్ 22: భారీ వర్షాల కారణంగా అతలాకులమైన అల్వాల్ ప్రాంతంలో వరద ముంపు బాధితులకు నాలుగు చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. గురువారం వర్షం కొంతమేర తగ్గినా సాయంత్రం మళ్లీ వర్షంతో వరదనీరు యథాప్రకారం పొంగిపొర్లింది. మచ్చబొల్లారంలో వర్షాల కారణంగా పాత ఇళ్లు కూలిపోయాయి.

09/23/2016 - 03:41

మేడ్చల్, సెప్టెంబర్ 22: మేడ్చల్ పెద్ద చెరువు భారీ వర్షాలకు నిండుకుండలా మారింది. గురువారం కూడా వందల సంఖ్యలో సందర్శకులు అపురూప దృశ్యాన్ని తిలకించడానికి తరలివచ్చారు. దాదాపు పది సంవత్సరాల తరువాత చెరువు నిండటంతో పట్టణ ప్రజలు ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతున్నారు. ప్రస్తుతం మేడ్చల్ పెద్ద చెరువు పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరుకుంది. ఏ క్షణంలోనైనా అలుగు పారే వీలుంది.

09/23/2016 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 22: నగరంలో కురుస్తోన్న వర్షాల కారణంగా నాలాలు, డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా పలు కాలనీ రోడ్లు, మెయిన్ రోడ్లలోనూ మురుగు నీరు నిల్చి ఉండటంతో దోమల వృద్ధి చెంది ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయోనన్న భయంతో ప్రజలు వణికిపోతున్నారు.

09/23/2016 - 03:40

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తుందని రవాణా శాఖా మంత్రి డాక్టర్ పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో గత కొద్ది రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటు, మండలాల చేర్పుల మార్పులపై జరుగుతున్న ఆందోళనలకు స్వస్తి పలికేవిధంగా మంత్రి స్పష్టత ఇచ్చారు.

09/23/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహానగరానికి భారీ వర్షాలు సూచన ఉండటంతో ప్రజలకెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టామని జిహెచ్‌ఎంసి కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు వివరించారు.

09/23/2016 - 03:39

హైదరాబాద్, సెప్టెంబర్ 22: రోడ్డు రవాణా శాఖలో దళారుల వ్యవస్థను రూపుమాపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలను ప్రారంభించిందని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ డిల్లీలో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో కేంద్ర మంత్రితో పలు అంశాలపై చర్చించామని, రవాణా శాఖ పని తీరుపై తెలంగాణ సర్కార్‌కు ఘన సన్మానం లభించిందని అన్నారు.

09/23/2016 - 03:34

హైదరాబాద్/ జీడిమెట్ల, సెప్టెంబర్ 22: ప్రకృతి విపత్తుతో వచ్చిన సమస్యను పరిష్కరించడానికి 72 గంటల సమయం పడుతుందని, ప్రజలు సహకరించి అపార్ట్‌మెంట్‌ల నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లాలని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. జలమయమైన నిజాంపేట్ గ్రామం బండారి లేఅవుట్ కాలనీలో గురువారం మంత్రి గంటన్నర సేపునకు పైగా పర్యటించారు.

Pages