S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:39

కోసిగి, జూలై 17: ఆదోని డివిజన్ పరిధిలోని మొత్తం విద్యుత్ బకాయిలు రూ. 10 కోట్లు ఉన్నట్లు విద్యుత్ డిఇ అంజన్‌కుమార్ పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని గౌడ్‌గల్, దుద్ది, కోసిగి గ్రామాల్లో ఆయన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను అకస్మికంగా ఆయన తనిఖీ చేశారు.

07/18/2016 - 02:39

నందికొట్కూరు, జూలై 17:రాయలసీమ రాష్ట్రం కోసం పోరాడుతున్న తనపై ప్రభుత్వ కక్ష సాధింపు బయటపడిందని, తన తండ్రి మాజీ మంత్రి బైరెడ్డి శేషశయనారెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించకపోవడం శోచనీయమని ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు.

07/18/2016 - 02:38

ఓర్వకల్లు, జూలై 17:మండల పరిధిలోని శకునాల గ్రామం రైతులకు నష్టపరిహారం అందే వరకూ సోలార్ పవర్ ప్రాజెక్టు పనుల్లో భాగంగా నిర్మిస్తున్న పవర్ గ్రిడ్ నిర్మాణ పనులను కొనసాగనివ్వమని పాణ్యం డివిజన్ సిపిఎం నేత రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రాజెక్టు పనులను గ్రామానికి చెందిన రైతులు ప్రతి రోజూ అడ్డుకుంటున్నా అధికారులు పని ప్రారంభించడానికి సిద్ధం కావటం శోచనీయమన్నారు.

07/18/2016 - 02:38

పెద్దకడబూరు, జూలై 17: రెండేళ్ళు చంద్రబాబు పాలనలో రాష్ట్భ్రావృద్ధి శూన్యమని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బసులదొడ్డి గ్రామంలో గడపగడపకు వైకాపా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగాగ్రామంలోనే ప్రతి ఇంటిని సందర్శించి వైకాపా ముద్రించిన బ్యాలెట్ ప్రశ్నాల పత్రాన్ని అందజేసి బాబు పాలనపై ఆరాతీశారు. ఎన్నికల హామీలు ఎంత వరకు అమలు అయ్యాయని అడిగి తెలుసుకున్నారు.

07/18/2016 - 02:37

సంజామల, జూలై 17: ఈతకు వెళ్లి విద్యార్థి మృతిచెందిన సంఘటన ఆదివారం సంజామలలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దూదేకుల కుళ్లాయి, పర్వీన దంపతుల ఏకైక కుమారుడు రాజ్‌కుళ్లాయి(16) గనిగుంతలో ఈత కొట్టడానికి వెళ్లి మృతిచెందాడు. రాజ్‌కుళ్లాయి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు.

07/18/2016 - 02:35

శ్రీకాకుళం: రాష్ట్రంలో కేరళ తరహా సముద్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నా కేంద్రం అనుమతుల మంజూరులో జాప్యం వహిస్తోంది. గ్రోత్ ఇంజన్‌గా బీచ్ టూరిజాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఆదాయన్ని పెంచుకోవాలన్నది ప్రభుత్వం యోచన. రాష్ట్రంలో అత్యంత తీర ప్రాంతం 196 కిలోమీటర్లు కలిగిన శ్రీకాకుళం జిల్లాలో 26 బీచ్‌లు ఉన్నాయి.

07/18/2016 - 02:34

ఎల్ ఎన్‌పేట, జూలై 17: మండలంలోని ఎల్ ఎన్‌పేట గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్దకోట గ్రామంలో అతిసార వ్యాధితో తల్లీకూతురు మృతిచెందారు. శనివారం రాత్రి జన లక్ష్మి (55), మృతి చెందగా ఆమె కుమార్తె డి.రమణమ్మ (35) ఆదివారం మృతి చెందింది. ఆగ్రామానికి చెందిన పది మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో గ్రామంలో ఆందోళనలు నెలకొన్నాయి. ఆదివారం పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ గ్రామాన్ని సందర్శించారు.

07/18/2016 - 02:33

శ్రీకాకుళం(టౌన్), జూలై 17: దివంగత నేత ఎర్రంనాయుడుతో తనకున్న అనుబంధం విడదీయలేనిదని సిపిఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ అన్నారు. ఆదివారం ఆయన జిల్లా పర్యటన ముగించుకొని న్యూ ఢిల్లీ బయలుదేరుతుండగా విశాఖ ఎయిర్‌పోర్టులో ఎంపి రామ్మోహననాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

07/18/2016 - 02:33

కోటబొమ్మాళి, జూలై 17: ప్రభుత్వ వసతిగృహాల విద్యార్థుల సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఆదివారం నిమ్మాడలో మంత్రి క్యాంపు కార్యాలయంలో అచ్చెన్న అధ్యక్షతన నియోజకవర్గస్థాయి వసతిగృహాల సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. హాస్టళ్ల పరిధిలోని నిర్వహిస్తున్న వసతిగృహాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని కోరారు.

07/18/2016 - 02:32

శ్రీకాకుళం(టౌన్), జూలై 17: ఉద్యోగుల కుటుంబాలకు కనీస భద్రత లేని నూతన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ఆధ్వర్యంలో పోరాట కరపత్రాలను విడుదలచేసారు.

Pages