S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:32

కొత్తూరు, జూలై 17: కొత్తూరు రెవెన్యూ కార్యాలయానికి మోక్షం లభించింది. భవనాలు శిథిలావస్థకు చేరుకొని పైకప్పులు, గోడలు కూలుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో కార్యాలయంలో విధులు నిర్వహించలేమని జిల్లా కలెక్టర్‌కు నివేదించారు.

07/18/2016 - 02:31

శ్రీకాకుళం(టౌన్), జూలై 17: అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఆదివారం భక్తుల దర్శనం టిక్కెట్ల రూపంలో 1,57,100 రూపాయలు ఆదాయం వచ్చింది. సాయంత్రం నాలుగు గంటల సమయానికి శీఘ్రదర్శనం టిక్కెట్లు 1110 టిక్కెట్లు అమ్ముడుపోగా 27,500 రూపాయలు, కేశఖండన టిక్కెట్లు 1325 విక్రయించగా 13,250 రూపాయలు, అలాగే సూర్యనమస్కారాల టిక్కెట్లు 150 అమ్ముడుపోగా 6,350 రూపాయలు ఆదాయం సమకూరింది.

07/18/2016 - 02:31

జలుమూరు, జూలై 17: మండల పరిధిలోని లింగాల వలస పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. లింగాల వలస నుండి నారాయణవలస మోటార్ బైక్‌పై వెళ్తుండగా, నరసన్నపేట నుంచి చల్లవానిపేట వస్తున్న ట్రాక్టరు ఢీ కొనడంతో లింగాల వలస గ్రామానికి చెందిన వాన రమణమూర్తి(26) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

07/18/2016 - 02:30

శ్రీకాకుళం(రూరల్), జూలై 17: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు.

07/18/2016 - 02:30

శ్రీకాకుళం, జూలై 17: కంపోస్టు కాలనీ, కుందువానిపేట గ్రామంలో నిర్మిస్తున్న గృహనిర్మాణాలను ఆదివారం జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పరిశీలించారు. నగర పరిధిలోనున్న కంపోస్టు కాలనీకి మందుగా పర్యటించారు. హుదూద్ తుపాను వలన ఇళ్లు కోల్పోయిన 192 మంది లబ్దిదారులకు కంపోస్టు కాలనీ వద్ద ఎన్‌టిఆర్ కాలనీలో గృహాలను ప్రభుత్వం గృహనిర్మాణ సంస్థ ద్వారా నిర్మించామని కలెక్టర్ తెలిపారు.

07/18/2016 - 02:28

ఒంగోలు, జూలై 17: డిసిసి బ్యాంకు డైరెక్టర్, జిల్లా బిసి సంక్షేమ సంఘ అధ్యక్షులు రాచగర్ల వెంకట్రావు యాదవ్ ఆదివారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.

07/18/2016 - 02:27

మార్కాపురం, జూలై 17: నూతనంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశాలు తిరుగుతూ బిజీగా ఉంటే స్థానిక నేతలు మాత్రం గ్రూపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. అధికారం వస్తే న్యాయం జరుగుతుందని ఆశించిన కార్యకర్తలు మాత్రం నిరాశా, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు.

07/18/2016 - 02:26

ఒంగోలు, జూలై 17: జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఈనెలాఖరు నాటికి దాదాపుగా ముగియనున్నాయి. పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో ఈనెలాఖరు నాటికి పొగాకు కొనుగోళ్లు ముగుస్తున్నప్పటికీ వేలం కేంద్రాల్లో ఒక కిలో పొగాకుకు 111 రూపాయలు మించి ధర రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది పొగాకు రైతులకు గత ఏడాది కంటే అదనంగా పొగాకు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి.

07/18/2016 - 02:26

ఒంగోలు, జూలై 17:నూర్‌బాషా, దూదేకుల, బిసి ముస్లింల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్దా రాఘవరావు హామీ ఇచ్చారు. ఆదివారం స్థానిక బిసికులాల ఆరామక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్టన్రూర్‌బాషా,దూదేకుల, బిసి ముస్లిం సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూర్‌బాషా విద్యార్థుల ప్రతిభా ప్రోత్సాహకాల అభినందన సభ జరిగింది. ఈ అభినందనసభకు డిఆర్‌ఒ నూర్‌బాషా ఖాసీం అధ్యక్షత వహించారు.

07/18/2016 - 02:25

ఒంగోలు,జూలై 17:రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్స్‌పల్స్ సర్వే కార్యక్రమం మూడడుగుల ముందుకు, ఆరు అడుగుల వెనక్కి అన్నచందంగా తయారైంది. రాష్టవ్య్రాప్తంగా సర్వేకార్యక్రమంలో జిల్లా మూడోస్థానంలో ఉందని అధికారులు చెబుతుండగా ఆశించిన స్థాయిలో మాత్రం సర్వే జరగని పరిస్థితి నెలకొంది.

Pages