S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2016 - 02:11

కాకినాడ, జూలై 17: జిల్లాలోని పలు మద్యం దుకాణాలు ముష్టియుద్ధాలకు, మర్డర్లకు స్థావరాలుగా మారాయి. అర్ధరాత్రి వేళ మద్యం అక్రమ విక్రయాలే ఇందుకు కారణమవుతున్నాయి. మద్యం షాపుల నిర్వాహకులతో పోలీస్, ఎక్సైజ్ శాఖల లాలూచీ కారణంగా ఏ క్షణాన ఎవరి ఉసురు తీస్తారో తెలియని అగమ్యగోచర పరిస్థితులు నెలకొన్నాయి.

07/18/2016 - 02:11

రాజమహేంద్రవరం, జూలై 17: రాష్ట్రంలోని ఎత్తిపోతల పధకాలన్నింటి నుంచి పూర్తి స్థాయిలో సాగునీరు అందించడం జరుగుతోందని రాష్ట్ర డిప్యూటీ సి ఎం చిన రాజప్ప అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం గ్రామం వద్ద ఆదివారం వెంకటనగరం ఎత్తిపోతల పధకం ప్రారంభించి సాగునీటిని విడుదల చేశారు.

07/18/2016 - 02:10

రాజమహేంద్రవరం, జూలై 17: బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటి వరకు రూ.8,187 కోట్లు ఖర్చు చేశామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ళలో రూ.2,639 కోట్లు ఖర్చు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

07/18/2016 - 02:09

జగ్గంపేట, జూలై 17: నిర్లక్ష్యం మూడు నిండు ప్రాణాలను బలిగొంది. జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా తాటి దుంగలతో రోడ్డు పక్కన నిలుపుదల చేసిన ట్రాక్టర్ మృతు శకటంగా మారి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ముగ్గురు యువకులను దుర్మరణంపాలు చేసింది. రెండేళ్లుగా తమ కష్టార్జితంతో కుటుంబానికి చేయూతగా నిలుస్తున్న యువకులు రోడ్డు పక్కనే నిర్జీవంగా కనిపించడంతో వారి కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు.

07/18/2016 - 02:07

రాజమహేంద్రవరం, జూలై 17: వైసిపి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతన వర్గీయులతో కలసి టిడిపిలోకి పునరాగమం చేస్తుండటంతో టిడిపి తమ్ముళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆదిరెడ్డి తన అనుయాయులతో కలసి 22వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. దీంతో స్థానిక టిడిపిలో సమీకరణలపై చర్చనీయాంశమైంది.

07/18/2016 - 02:06

అయినవిల్లి, జూలై 17: గోదావరికి ఇటీవల సంభవించిన వరద తగ్గుముఖం పట్టినా ముంపునీటిలోనే ఉన్న వాణిజ్య పంటలు కుళ్లిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ముక్తేశ్వరం తొగరపాయ వద్ద ఉన్న కాజ్‌వేపై వరదనీరు పూర్తిగా తొలగిపోవడంతో లంక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే లంక గ్రామాల్లో వెయ్యి ఎకరాల పై బడి వాణిజ్య పంటలు నష్టపోయినట్టు ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

07/18/2016 - 02:05

రాజోలు, జూలై 17: ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో వివిధ చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను ఆదివారం స్థానిక పోలీసులు అరెస్టుచేసి మీడియా ముందు హాజరుపర్చారు. సిఐ జివి కృష్ణారావు తెలిపిన వివరాల ప్రకారం..మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మేడిచర్ల నాగభూషణంను శివకోడులో అరెస్టుచేశారు. ఇతని వద్దనుండి సుమారు లక్ష రూపాయలు విలువైన 5 సావర్ల బంగారం, రూ.10వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్టు సిఐ తెలిపారు.

07/18/2016 - 02:05

కాకినాడ రూరల్, జూలై 17: మద్యం సేవిస్తూ మత్తులో ఒకరికొకరు వాదోపవాదాలకు దిగి తూలనాడుకుంటూ వ్యక్తిగత విషయాలు లేవనెత్తడంతో పెరిగిన ఘర్షణ వాతావరణం ఒకరి హత్యకు దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 214 పక్క పండూరు జంక్షన్‌లో ఉన్న మద్యం దుకాణం వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

07/18/2016 - 02:04

సామర్లకోట, జూలై 17: స్థానిక గాంధీనగరంలో గత ఆరు సంవత్సరాల క్రితం రోడ్లు, డ్రెయిన్లు నిర్మిస్తామని ఏర్పాటు చేసిన శిలా ఫలకానికి పూలమాలలు వేసి పూజలు చేసి ఇప్పటికైనా ఈ ప్రాంతంలో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించాలంటూ సామర్లకోట డివైఎఫ్‌ఐ నాయకులు ఆదివారం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు.

07/18/2016 - 02:04

రామచంద్రపురం, జూలై 17: పట్టణంలో ఖాళీ ప్రదేశాల్లో ఇసుక గుట్టలు మేటలు మేటలుగా దర్శనమిస్తున్నాయి. ఇసుక నిల్వలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని జారీచేసిన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమయ్యాయో సంబంధిత అధికారులకే ఎరుక.

Pages