S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 16:34

భద్రాచలం:ఎగువున ఉన్న ఇంద్రావతి, ప్రాణహిత నదుల్లో వరద పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరికి నీటిప్రవాహం వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 18 అడుగుల నీటిమట్టం ఉండగా ఆదివారం మధ్యాహ్నానికి అది 28 అడుగులకు పెరిగింది. ఎగువప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలవల్ల వరదనీరు పెరుగుతోంది. ఒకటిరెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

07/03/2016 - 16:34

హైదరాబాద్:బకాయిలు చెల్లిస్తేనే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తామని, అంతవరకు నిలిపివేస్తామని కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. నగరంలోని లకడీకాపూల్‌లో సమావేశమైన వీరు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారంవరకు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నామని, ఆ రోజు మరోసారి సమావేశమైన తాజా నిర్ణయం వెల్లడిస్తామని వారు చెప్పారు.

07/03/2016 - 16:33

లాయర్ల సమ్మె విరమిస్తేనే జోక్యం
స్పష్టం చేసిన సిజెఐ

07/03/2016 - 16:32

ముంబై:్భరత్‌లో క్రికెట్‌కోసం పనిచేస్తున్న సంస్థలన్నీ సాఫీగా, క్రమబద్ధంగా పనిచేసేలా చూడాలని భారత క్రికెట్ జట్టు నూతన కోచ్ అనిల్‌కుంబ్లే భావిస్తున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు.

07/03/2016 - 16:31

బాగ్దాద్:ఐసిస్ ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రద్దీగా ఉండే రెండు మార్కెట్లలో బాంబు పేలుళ్లకు పాల్పడి పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం కలిగించారు. రంజాన్ పవిత్రమాసం సందర్భంగా భోజనాలు చేస్తున్నవేళ వారు ఈ దాడికి తెగబడ్డారు. నిత్యం రద్దీగా ఉండే కరద, షల్లాల్ మార్కెట్లలో వారు బాంబు దాడులు చేశారు.

07/03/2016 - 08:23

నిడదవోలు, జూలై 2: స్కూలు బస్సు ఢీకొని రెండు సంవత్సరాల పాప మృతిచెందిన ఘటన మండలంలోని ఉనకరమిల్లి గ్రామంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉనకరమిల్లి గ్రామంలో సింగంశెట్టి మణికంఠ, ప్రశాంతి దంపతుల కుమార్తె దేవి లక్ష్మీ శరణ్య (4) మండలంలోని తిమ్మరాజుపాలెంలో ఎంసిఎస్ పాఠశాలలో ఎల్‌కెజి చదువుతోంది.

07/03/2016 - 08:23

పెరవలి, జూలై 2: పశువధశాలకు కంటైనరు వ్యానులో అక్రమంగా తరలిస్తున్న యాభై గోవులను గోరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసుల సహకారంతో గోశాలకు తరలించారు. జాతీయ రహదారి పెరవలి వద్ద శనివారం ఒక వ్యానులో గోవులను రవాణా చేస్తుండగా గోరక్షణ సమితి సభ్యులు కొండ్రెడ్డి శ్రీనివాసు మరికొంత మంది అడ్డుకుని పోలీసుల సహకారంతో నల్లజర్ల మండలంలోని అవపాడు గోశాలకు తరలించారు.

07/03/2016 - 08:22

ఏలూరు, జూలై 2 : జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పధకానికి సంబంధించి మిగిలి ఉన్న సర్వే పనులను వచ్చే వారంలోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో శనివారం జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.

07/03/2016 - 08:20

ఏలూరు, జూలై 2: ఆధ్యాత్మికంలో మాయ అనే పదానికి సవాలక్ష అర్ధాలున్నాయి. కానీ సామాన్య జనానికి అర్ధమయ్యే మాయ ఒకరకం. కానీ అదే రకం మాయ ఈవిభాగాన్ని పర్యవేక్షించే దేవాదాయధర్మాదాయ శాఖలో సర్వత్రా అవరించి ఉందనే చెప్పాలి. సర్వాంతర్యామిగా ఈ మాయ మారిపోవటంతో అలా ఆర్డర్లు వచ్చి, ఇలా రద్దు అయిపోయి, ఉన్నతాధికారులు హుకుంలు జారీ చేసినా దానికి భిన్నంగా అస్మదీయులకు ఆర్డర్లు రాత్రికి రాత్రి వచ్చి పడిపోతాయి.

07/03/2016 - 08:18

విజయనగరం(టౌన్), జూలై 2: శ్రీ జగన్నాథస్వామివారి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పట్టణంలోని సంతపేట జగన్నాథస్వామివారి ఆలయ కమిటీ కోశాధికారి కాపుగంటి ప్రకాష్ వెల్లడించారు.

Pages