S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 07:55

ఒంగోలు,జూలై 2: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర సమాచార,పౌరసంబంధాల,ఐటి శాఖమంత్రి పల్లె రాఘనాథరెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం స్థానిక గుంటూరురోడ్డులోని పాటిబండ్ల గోపాలస్వామి ఫంక్షన్‌హాలులో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు.

07/03/2016 - 07:52

కాకినాడ, జూలై 2: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు రుణాలు సకాలంలో మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి సింగిల్ డెస్క్ ప్రకారం అన్నింటికీ అనుమతులు సకాలంలో మంజూరు చేయాలన్నారు.

07/03/2016 - 07:51

కాకినాడ, జూలై 2: 2019 నాటికి తూర్పుగోదావరి జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమీ హాలులో ఎంపిడిఒలు, మండల ప్రత్యేకాధికారులు, జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.

07/03/2016 - 07:50

రాజమహేంద్రవరం, జూలై 2: గోదావరి నదికి జలకళ సంతరించుకుంది. అఖండ గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం వద్ద గంట గంటకూ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. శనివారం రాత్రి కాటన్ బ్యారేజ్ వద్ద 8.5 అడుగుల నీటి మట్టం నమోదైంది. 1,24,255 క్యూసెక్కుల నీటిని సముద్రంలోనికి విడుదల చేశారు.

07/03/2016 - 07:49

కర్నూలు సిటీ, జూలై 2:ప్రభుత్వ ముద్రణాలయానికి కొత్త భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మనోహర్ మాణిక్యం డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో శనివారం కర్నూలు ముద్రణాలయ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సమావేశం నిర్వహించా రు.

07/03/2016 - 07:48

కర్నూలు ఓల్డ్‌సిటీ, జూలై 2 : గ్రామీ ణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కోసం కేంద్రం విడుదల చేసిన రూ. 50 కోట్ల నిధులను ఖర్చు చేసి, అవసరమైన అదనపు నిధుల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

07/03/2016 - 07:47

కర్నూలు, జూలై 2 : శ్రీశైలం జలాశయంలో ఈ ఏడాది జలకళ కనిపించడం సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో కురిసే వర్షాల స్థాయిలో ఉత్తర భారతంలో కనిపించవన్న నిపుణుల అభిప్రాయంతో శ్రీశైలం జలాశయం దిగువన ఉన్న రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

07/03/2016 - 07:43

తిరుపతి, జూలై 2: టిటిడికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ చంపకవల్లి సమేత శ్రీ పరాసరేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. శనివారం సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయ. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 3వ తేదీ ఉదయం 9నుంచి 10 గంటల వరకు సింహలగ్నంలో ధ్వజారోహణం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ నిర్వహించనున్నారు.

07/03/2016 - 07:43

తిరుమల, జూలై 2: టిటిడి నిర్వహిస్తున్న అన్నప్రసాదం ట్రస్టుకు లక్ష రూపాయలు, బర్డ్ ట్రస్టుకు లక్ష రూపాయలు, హరిటేజ్ రిజర్వేషన్ ట్రస్టుకు 3 లక్షల రూపాయల విరాళాలను టిటిడి ట్రస్టుబోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి శనివారం డిడి రూపంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావుకు అందజేశారు.

07/03/2016 - 07:42

తిరుమల, జూలై 2: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కలకత్తాకు చెందిన ప్రకాష్ చౌదరి అనే భక్తుడు రెండు బస్సులకు విరాళంగా అందించారు. శనివారం ఉదయం శ్రీవారి ఆలయం సమీపాన ఉన్న వైభవోత్సవ మండపం వద్ద బస్సులకు సంబంధించిన తాళాలను దాత తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజుకు అందించారు.

Pages