S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:23

నల్లగొండ, జూలై 2: జిల్లా ప్రజల సమస్యలకు గొంతుకై నిలువాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మరోసారి నామమాత్ర, మొక్కుబడి చర్చలతో అర్ధాంతరంగా ముగిసిపోవడం విమర్శలకు తావిచ్చింది. జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్ అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో 29అంశాల ఎజెండాలో ప్రధానంగా హారిత హారంపైనే చర్చ కొనసాగగా, వ్యవసాయంపై జెడిఏ నివేదిక చదువడం వరకే పరిమితమైంది.

07/03/2016 - 06:23

రాజమహేంద్రవరం, జూలై 2: సాగునీటి వ్యవస్థలో ఎంతో కీలకమైన తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద కాటన్ బ్యారేజ్ అధికారుల అలక్ష్యానికి గురైంది. కీలకమైన బ్యారేజ్ గేట్ల బ్రేక్ కాయిల్స్ మాయం కావడం, ముగ్గురు ఎఇలు సస్పెండ్ కావడం ఇందుకు అద్దంపడుతోంది. బ్యారేజ్‌కు ప్రస్తుతం నిర్వహణ పనుల్లో భాగంగా మరమ్మతులను రూ.29 కోట్లతో చేపట్టారు. ఈ పనుల్లో నాణ్యతాలోపం చోటుచేసుకుందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

07/03/2016 - 06:22

సంగారెడ్డి టౌన్, జూలై 2: మల్లన్న సాగర్ ప్రాజెక్టు వెనకాల ఉన్న మర్మమేమిటో, ఇందులో ప్రభుత్వం దాస్తున్న విషయాలను తెలుగు కరపత్రాల ద్వారా ప్రజల్లో అవగాహాన కల్పించాలని ప్రజా తెలంగాణ పార్టీ రాష్ట్ర కన్వీనర్ గాదె ఇన్నయ్య, కో-కన్వీనర్లు నాగప్రసాద్, శ్రీశైల్‌రెడ్డి, తెలుగు రైతు సంఘం అధ్యక్షులు ఒంటేరు ప్రతాప్‌రెడ్డిలు డిమాండ్ చేశారు.

07/03/2016 - 06:21

మెదక్, జూలై 2: కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రతో హైకోర్టు విభజన జరగడం లేదని టిఎన్‌జివోస్ మెదక్ జిల్లా కార్యదర్శి మేడిశెట్టి శ్యామ్‌రావు ఆరోపించారు. మెదక్ సబ్ కోర్టు జూడిషియల్ ఎంప్లాయిస్ సమ్మె శనివారం నాటికి రెండవ రోజుకు చేరుకుంది. ఈ సమ్మెకు టిఎన్‌జివోస్ సంఘం సంఘీభావం ప్రకటించింది.

07/03/2016 - 06:21

హైదరాబాద్, జూలై 2: మంత్రివర్గంలో సీనియర్లను పక్కనపెట్టి, మంత్రి నారాయణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని నగర నిర్మాణం, తాత్కాలిక సచివాలయంపై నారాయణకు పెత్తనం ఇవ్వడాన్ని మంత్రులు సహించలేకపోతున్నారు.

07/03/2016 - 06:21

సంగారెడ్డి టౌన్, జూలై 2: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఒర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. రెండేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఏమిటో కాంగ్రెస్ నాయకుల కండ్లకు కనిపించడం లేదా అన్ని ప్రశ్నించారు. జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్‌కు సవాల్ విసిరారు.

07/03/2016 - 06:20

సంగారెడ్డి టౌన్, జూలై 2: బిసి కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధిత తహసీల్దారులే విచారణ అధికారులుగా ఉంటారని బిసి సంక్షేమ శాఖ అధికారి జి.ఆశన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు జివో నంబర్ 18 జారీ చేసిందన్నారు. కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను స్వీకరించి అట్టి దరఖాస్తులపై విచారణ చేపట్టే బాధ్యత సంబంధిత మండలాల తహసీల్ధార్లపై ఉంటుందన్నారు.

07/03/2016 - 06:19

సంగారెడ్డి టౌన్, జూలై 2: వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే సైనికులని, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై ప్రజల వద్దకు తీసుకువెళ్లి పార్టీకి పూర్వవైభం తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

07/03/2016 - 06:19

హైదరాబాద్, జూలై 2: హైదరాబాద్‌లో భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలన్న కుట్ర కేసులో అరెస్టయిన ఐదుగురు ఉగ్రవాద అనుమానితులను రాజధాని శివార్లలోని శామీర్‌పేటలో ఒక విశ్రాంతి భవనంలో ఎన్‌ఐఏ(నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ) బృందాలు విచారిస్తున్నాయి.

07/03/2016 - 06:14

మహబూబ్‌నగర్, జూలై 2: జిల్లాలో వచ్చే ఆగస్టు మాసంలో జరిగే కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం రూ.426కోట్ల నిదులను ఖర్చు చేయనుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం రెవెన్యూ సమావేశ మందిరంలో కృష్ణా పుష్కరాలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

Pages