S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 06:01

విశాఖపట్నం, జూలై 2: నైజీరియాలో కిడ్నాప్‌కు గురైన ఎం సాయి శ్రీనివాస్ భార్య, పిల్లలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. నగరంలో నైట్ బే మారథాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం విశాఖ వచ్చిన ఆయనను ప్రభుత్వ అతిథి గృహంలో శ్రీనివాస్ భార్య లలిత కలిసి, తన భర్తను విడిపించేందుకు సహకరించాలని కోరారు.

07/03/2016 - 05:58

హైదరాబాద్, జూలై 2: ఆంధ్ర రాష్ట్రంలో కరవు తీరా వర్షాలు పడ్డాయి. నైరుతి రుతుపవనాలు ఆలస్యమైనా, జూన్ నెలలోనే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వర్షాలు బాగా కురవడంతో రైతులు ఖరీఫ్ సాగు పనులు వేగవంతం చేశారు.

07/03/2016 - 05:57

గంగవరం, జూలై 2: డీజిల్ సరఫరాకోసం చైన్నై- బెంగళూరు మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పైపు లైన్ వేసింది. ఈ పైపు లైన్ చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో నాల్గవ నెంబరు జాతీయ రహదారి పక్కగా వెళ్తుంది. అయితే మార్గమధ్యలో గల పొన్నమాకులపల్లి సమీపంలో ఐఓసి పైపులైనుకు కన్నం వేసి నెల రోజులుగా పెట్రోలు, డీజల్, గ్యాస్‌ను తస్కరించి డాబా హోటల్‌కు సరఫరా చేసుకొని యథేచ్చగా విక్రయాలు సాగిస్తున్నారు.

07/03/2016 - 05:53

జలదంకి, జూలై 2: గుప్తనిధులకోసం పవిత్రమైన ప్రాచీనమైన శివాలయంలో శివలింగాన్ని పెకలించిన సంఘటన నెల్లూరు జిల్లా జలదంకి మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సమీపంలోని కొండయ్య మఠం వద్ద ఉన్న ప్రాచీన శివాలయంలో శుక్రవారం రాత్రి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం పూజలు జరిపి అక్కడ వున్న శివలింగాన్ని పెకలిచారు.

07/03/2016 - 05:53

మెట్రో సిటీలో నిత్యం రద్దీగా వుండే ఫుట్‌పాత్‌పై ఓ దివ్యాంగురాలు రెండు కాళ్లూ కోల్పోయిన దీనస్థితిలో వినసొంపుగా పాటలు పాడుతూ వుంది. ఆమె చుట్టూ జనం చేరడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ పాటలు వింటూ నిల్చున్నాడు. సంగీత ప్రియుడైన ఒక జర్నలిస్టు హడావుడిగా బైక్‌పై వచ్చి పాటలు పాడుతున్న దివ్యాంగురాలిని నీడకు తీసుకెళ్లాడు.
‘మీది ఏ ఊరమ్మా?’.. ప్రశ్నించాడు యువ జర్నలిస్టు, గాయకుడైన రాజు.

07/03/2016 - 05:52

కావలి, జూలై 2: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మాకన సాయి అనే బాలుడిని వారి కుటుంబానికి పరిచయస్తుడైన ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి బాలుడు చదువుతున్న పాఠశాల వద్దే గొంతు కోసి హతమార్చేందుకు యత్నించిన సంఘటన శనివారం సాయంత్రం జరిగింది.

07/03/2016 - 05:52

సింహాచలం, జూలై 2: శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న జరిగే సింహగిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈవో రామచంద్రమోహన్ శనివారం దేవాలయంలో దేవస్థానం విభాగాధిపతులతో సమావేశం ఏర్పాటు చేసారు. చతుర్థశి రోజున గిరి ప్రదక్షిణ, పౌర్ణమి రోజున ఆలయ ప్రదక్షిణకు సంబంధించిన ఏర్పాట్ల పై ఆయన విభాగాధిపతులతో చర్చించారు.

07/03/2016 - 05:51

మచిలీపట్నం, జూలై 2: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడకు చెందిన సయ్యద్ వౌలాసాహెబ్(19), ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పేల కృష్ణసాయి(19), విజయవాడకు చెందిన షేక్ సాదిక్(20) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు.

07/03/2016 - 05:51

విశాఖపట్నం, జూలై 2 : ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాన్ని అనుకుని ఏర్పడిన అల్పపీడం కొనసాగుతోందని తెలిపారు. వీటి ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

07/03/2016 - 05:50

చీరాల, జూలై 2: ప్రతి పేదవాడికి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో పారదర్శకంగా పని చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొనేందుకు శనివారం ఆయన ప్రకాశం జిల్లా చీరాల వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్థానిక ఏరియా వైద్యశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలో చేపడుతున్న నూతన భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

Pages