S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/03/2016 - 05:50

గుంటూరు, జూలై 2: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంకు చెందిన పారేపల్లి వెంకటేశ్వరరావు బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థలం వివాదంలో తనపై కేసు పెట్టారన్న అవమాన భారంతో సొంత గ్రామంలోని తోటవారిపాలెంలో శనివారం తెల్లవారు జామున ఆత్మహత్యకు యత్నించగా వెంకటేశ్వరరావును చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

07/03/2016 - 05:49

హైదరాబాద్, జూలై 2: వైకాపా తరఫున అసెంబ్లీకి ఎన్నికై టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇచ్చిన పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించడంపై ఆ పార్టీ మండిపడింది. శనివారం ఇక్కడ వైకాపా ఎమ్మెల్యే పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ సరైన ఫార్మెట్‌లో పిటిషన్ ఇవ్వలేదని స్పీకర్ చెప్పారన్నారు. కాని ఏ ఫార్మెట్ కావాలో స్పీకర్ చెప్పాలన్నారు.

07/03/2016 - 05:48

విజయవాడ, జూలై 2: కాలేయ వ్యాధితో బాధపడుతున్న 8 నెలల చిన్నారి జ్ఞానసాయి ఆపరేషన్ మరో నెల రోజుల పాటు వాయిదా పడింది. చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రిలో జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు ముందు అవసరమైన అన్ని వైద్య, ఆరోగ్య పరీక్షలను వైద్యనిపుణులు పూర్తి చేశారు. తన కాలేయంలో కొంత భాగాన్ని ఇచ్చి జ్ఞానసాయిని అనారోగ్యం నుండి గట్టెక్కించేందుకు తండ్రి రమణప్ప ముందుకు వచ్చాడు.

07/03/2016 - 05:47

హైదరాబాద్, జూలై 2: వైకాపా అధ్యక్షుడు జగన్‌పై అక్రమాస్తుల కేసులో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఏ మాత్రం నైతికత ఉన్నా, పార్టీని రద్దు చేయాలని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని కేంద్ర ఏజన్సీ సంస్థ అటాచ్ చేయడం ఇదే మొదటిసారి అన్నారు.

07/03/2016 - 05:42

హైదరాబాద్, జూలై 2: రాజస్థాన్‌లో ప్రభుత్వం రైతులకు విడుదల చేసే సబ్సిడీలు నేరుగా వారి అకౌంట్లకే చేరుతాయని ఆ రాష్ట్ర సామాజిక న్యాయం, ముద్రణ శాఖ మంత్రి అరుణ్ చతుర్వేది తెలిపారు. శనివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అనుబంధ విభాగమైన కిసాన్ మోర్చా సమావేశం జరిగింది.

07/03/2016 - 05:45

హైదరాబాద్, జూలై 2: ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణనాధుడు ఈ ఏడాది భక్తులకు శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహాగణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు. శిల్పి రాజేందర్, డిజైనర్ వెంకట్ రూపొందించిన ఏకదంతుని నమూనా చిత్రపటాన్ని శనివారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతలరామచంద్రా రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.

07/03/2016 - 05:38

వసుమతి డిగ్రీ పూర్తయిన వెంటనే ఓ పెళ్లి సంబంధం వచ్చింది... పెళ్లిచూపులకు వచ్చిన వ్యక్తి ఆనంద్. పవర్ ప్లాంటులో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు
‘అమ్మాయి బాగుంది’ అని ఆనంద్ అనగానే ఇరు కుటుంబాల వారు ఆనందపడ్డారు.
‘మీరు డిగ్రీలో ఏ గ్రూపు’ అడిగాడు ఆనంద్ వసుమతిని.
‘బిఎ స్పెషల్ తెలుగు’ సమాధానమిచ్చింది వసుమతి.
ఆనంద్‌తో పాటు పెళ్లిచూపులకు వచ్చిన వారంతా ఫక్కున నవ్వేశారు.

07/03/2016 - 05:45

హైదరాబాద్, జూలై 2: ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందిస్తున్న సేవలను ఏ మాత్రం మెరుగుపరచకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను నాలుగు రెట్లు పెంచడం సరి కాదని లోక్‌సత్తా వ్యవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. అవినీతి, జీతాలు ఎక్కువ, సేవలు మాత్రం తక్కువని, ప్రజలు యాచకుల్లా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాలి అనే వ్యవస్ధ ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.

07/03/2016 - 05:37

హైదరాబాద్, జూలై 2: ఔట్‌లుక్ మ్యాగజైన్ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒక సర్వేలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న పిజి లా కాలేజీకి జాతీయ స్థాయిలో తొమ్మిదో స్థానం లభించింది. జాతీయ స్థాయిలో గతంలో మూడు సార్లు 14 వ స్థానం పొందిన తమ కాలేజీ, 2015-16లో తొమ్మిదో స్థానం పొందిందని పిజి లా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు.

,
07/03/2016 - 05:36

జనగామ టౌన్, జూలై 2: జనగామను జిల్లాగా మార్చాలని డి మాండ్ చేస్తూ స్థానిక ప్రజలు చేస్తున్న ఉద్యమం తీవ్రరూపం దాలు స్తోంది. కొన్ని మాసాల నుంచి శాంతియుతంగా సాగుతున్న ఈ ఉద్యమం మ రింత ఉద్ధృతమై హింసాత్మక సంఘటనలకు దారితీస్తోంది. ఉద్యమకారులపై లాఠీచార్జికి నిరసనగా శనివారం జిల్లా సాధన ఐకాస నిర్వహించిన బంద్ నిరసనలు, ఆందోళనలు, అరెస్టులతో ముగిసింది.

Pages