S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2016 - 03:27

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించిన రోహిత వేముల సూసైడ్ నోట్‌ను వక్రీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటరమణి, నాగురావు నామాజీలు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

01/24/2016 - 03:26

ఖైరతాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ, జీహెచ్‌ఎంసి కమిషనర్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు జనం కోసం సంస్థ ప్రతినిధులు తెలిపారు.

01/24/2016 - 03:26

హైదరాబాద్, జనవరి 23: స్వరాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జిహెచ్‌ఎంసి పాలక మండలికి జరుగుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఎన్నిక పారదర్శకంగా, ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారి డా.బి. జనార్దన్‌రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

01/24/2016 - 03:25

హైదరాబాద్, జనవరి 23: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి టికెట్లు ఆశించిన తిరుగుబాటుదారుల మద్దతు కూడగట్టుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొన్ని డివిజన్లలో మిత్రపక్షాల అభ్యర్థులు బరిలో ఉండటం, మరికొన్ని డివిజన్లలో కొత్త ముఖాలను పోటీకి నిలిబెట్టడంతో అభ్యర్థికి, పార్టీ శ్రేణుల మధ్య సత్సంబంధాల్లేకపోవటంతో టిఆర్‌ఎస్ మినహా మిగిలిన పార్టీల ప్రచారం చప్పగానే సాగుతోంది.

01/24/2016 - 03:18

వేటపాలెం, జనవరి 23: స్థానిక సారస్వతనికేతనం గ్రంథాలయాన్ని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శనివారం సందర్శించారు. గ్రంథాలయంలోని గ్రంథాలను, మాజీ రాష్టప్రతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ప్రతిష్ఠించిన ధ్వజస్థంభాన్ని, మహాత్మాగాంధీ చేతి కర్రను ఆయన పరిశీలించారు. సారస్వతనికేతనం చారిత్రక సంపదగా ఆయన అభివర్ణించారు.

01/24/2016 - 03:16

నెల్లూరు, జనవరి 23: అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ ఎం జానకి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కస్తూర్భా కళాక్షేత్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు మోటివేషన్ తరగతులైన ప్రేరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

01/24/2016 - 03:13

తిరుపతి, జనవరి 23 : బిసి సబ్ ప్లాన్ క్రింద 2015-16 సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం 6640 కోట్ల రూపాయలతో బిసి అభ్యున్నతికి మరియు వివిధ పథకాలకు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

01/24/2016 - 03:04

సిడ్నీ: భారత ఆటగాడు మనీష్ పాండే, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ శనివారం తమతమ కెరీర్‌లలో మొట్టమొదటి వనే్డ ఇంటర్నేషనల్ శతకాలను నమోదు చేశారు. ఇందులో వింత లేకపోయినప్పటికీ, వారి మధ్య వైదుధ్యమే ఆసక్తిని కలిగిస్తున్నది. మిచెల్ మార్ష్‌కు కెరీర్‌లో ఇది 27వ వనే్డ.

01/24/2016 - 02:58

మెల్బోర్న్, జనవరి 23: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో మూడోసీడ్ గార్బినె ముగురుజాకు అన్‌సీడెడ్ బార్బొరా స్ట్రయికోవా షాకిచ్చింది. శనివారం మూడో రౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె 6-3, 6-2 తేడాతో వరుస సెట్లలో గెలిచి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.

01/24/2016 - 02:57

వెల్లింగ్టన్, జనవరి 23: పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ పాల్గొనడం లేదు. పాకిస్తాన్‌తో జరిగిన చివరి, మూడో టి-20 మ్యాచ్ ఆడుతున్నప్పుడు గాయపడిన టేలర్ కోలుకోలేదు. అతనికి విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కోవడంతో, పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లతో జరిగే వనే్డ సిరీస్‌లకు సెలక్టర్లు అతని పేరును పరిగణలోకి తీసుకోలేదు.

Pages