S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2016 - 02:04

హైదరాబాద్, జనవరి 23: గతంలో తాగునీటి చెరువుగా ఉన్న హుస్సేన్ సాగర్‌ను తిరిగి మంచినీటి చెరువుగా మార్చేందుకు బృహత్ ప్రణాళిక రూపొందించినట్టు టిఆర్‌ఎస్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. కలుషిత జలాలను హుస్సేన్‌సాగర్‌లోకి మోసుకు వచ్చే నాలాల మళ్లింపు కార్యక్రమం ఇప్పటికే తుది దశకు చేరుకుందని తెలిపారు.

01/24/2016 - 02:04

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఇస్తున్న హామీలను అమలు చేయాలంటే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాదు కదా ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు ముని మనవడు వచ్చినా సాధ్యం కాదని ఎఐసిసి అధికార ప్రతినిధి మధుయాష్కి గౌడ్, టిపిసిసి ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌లు అన్నారు.

01/24/2016 - 02:03

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఊహల్లో విహరిస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. టిఆర్‌ఎస్ తమను ఎంత విమర్శిస్తే అంత తమకే లాభమని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. బిజెపి-తెలుగు దేశం పార్టీల అభ్యర్థుల విజయం కోసం తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని ఆయన తెలిపారు.

01/24/2016 - 02:03

హైదరాబాద్, జనవరి 23: ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గం మొత్తం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. మంత్రులంతా ప్రచారంలో ఉండడంతో సచివాలయంలో అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. మంత్రులు లేకపోవడం వల్ల సందర్శకుల సందడి కూడా తగ్గింది. చివరి రెండు రోజులు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రెండు బహిరంగ సభలు, ఈ- సభల ద్వారా ఎన్నికల ప్రచారం సాగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

01/24/2016 - 02:02

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వన్ హైదరాబాద్ కూటమి అభ్యర్థులకు ఓటేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు డిజి నర్సింహారావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యాలయంలో జిహెచ్‌ఎంసి ఎన్నికల కరపత్రాన్ని నర్సింహారావు ఆవిష్కరించారు. అధికార టిఆర్‌ఎస్ పార్టీ జిహెచ్‌ఎంసిలో గెలుపుకోసం సామ దాన భేద దండోపాయాలు ఉపయోగిస్తోందని అన్నారు.

01/24/2016 - 02:01

హైదరాబాద్, జనవరి 23: టిఆర్‌ఎస్ వార్తలను పెయిడ్ ఆర్టికల్స్‌గా పరిగణించాలని తెలంగాణ తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టాలని ఆయన శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాసిన లేఖలో కోరారు.

01/24/2016 - 02:01

హైదరాబాద్, జనవరి 23: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలుగు దేశం-బిజెపి అభ్యర్థుల విజయం కోసం ఆ రెండు పార్టీలూ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ శనివారం పార్టీ కార్యాలయం ఆవరణలో ప్రచార రథాలను జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 26 నుంచి కేంద్ర మంత్రులు ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల 26వ తేదీన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.

01/24/2016 - 02:00

హైదరాబాద్, జనవరి 23: టిఆర్‌ఎస్ ఎత్తులకు, జిత్తులకు, బెదిరింపులకు తాము బెదరమని బిజెపి జాతీయ నాయకుడు, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచార రథాలను ఆయన పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు బిజెపి-టిడిపిలకు పట్టం కడితే ఉగ్రవాదం నుంచి హైదరాబాద్‌కు విముక్తి కల్పిస్తామని అన్నారు.

01/24/2016 - 02:00

హైదరాబాద్, జనవరి 23: జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన ఫిబ్రవరి 2న జరిగే పోలింగ్‌పై అధికారులు కాస్త ముందు నుంచే దృష్టి సారించారు. ఒకవైపు పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో దొంగ ఓట్లకు తావివ్వరాదని భావిస్తున్నారు.

01/24/2016 - 01:17

పాట్నా, జనవరి 23: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేయడం వెనుక బిజెపికి ఒక దురుద్దేశం ఉందని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా రకరకాల సిద్ధాంతాల మధ్య ఉన్న వైరుద్ధ్యాలను ముందుకు తీసుకురావాలన్నది దాని ఉద్దేశమని బిహార్ ముఖ్యమత్రి నితీశ్ కుమార్ శనివారం ఆరోపించారు. ‘స్వాతంత్య్ర పోరాటంతో బిజెపికి ఎలాంటి సంబంధం లేదు.

Pages