S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/24/2016 - 02:36

వరంగల్, జనవరి 23: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం వరంగల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరుగనున్న జాతీయ మహిళా సదస్సును ఆమె ప్రారంభించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతామన్నారు.

01/24/2016 - 02:35

హైదరాబాద్, జనవరి 23: ప్రజలు కోరుకునే వౌలిక సదుపాయాలు కల్పించే విధంగా టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించినట్టు కెటిఆర్ తెలిపారు. ఇంతకాలం మేయర్ పదవిని ఆధిష్టించిన వివిధ పార్టీలు చేసిందేమీ లేదని అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కాగా నవశకానికి నాంది పలికే విధంగా మ్యానిఫెస్టో ఉందని రాజ్యసభ సభ్యులు కె కేశవరావు తెలిపారు.

01/24/2016 - 02:31

విశాఖపట్నం, జనవరి 23: లోక్‌నాయక్ ఫౌండేషన్ 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి విశాఖలో జరిగిన కార్యక్రమంలో సుప్రసిద్ధ అవధాని గరికపాటి నర్సింహరావుకు లోక్‌నాయక్ సాహిత్య పురస్కారంతోపాటు రూ.1.50 లక్షల నగదును, రైల్వే కార్మిక నేత చలసాని గాంధీకి జీవిత సాఫల్య పురస్కారంతోపాటు రూ.50 నగదును అందజేశారు.

01/24/2016 - 02:30

జైపూర్, జనవరి 23: దేశంలో అసహనం పరాకాష్ఠకు చేరిందనడానికి హైదరాబాద్ యూనివర్శిటీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనే నిదర్శనమని ప్రముఖ కవి, రచయిత అశోక్ వాజ్‌పాయి స్పష్టం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఘటన తరవాత తనకు వచ్చిన డి.లిట్ పురస్కారాన్ని వాజ్‌పాయి వాపసు చేశారు.

01/24/2016 - 02:30

లక్నో, జనవరి 23: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్‌లాగా ఏ దళిత విద్యార్థి కూడా ఆత్మహత్య చేసుకోకుండా చూడడానికే తాము ఆ పని చేశామని శుక్రవారం ఇక్కడ అంబేద్కర్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇద్దరు విద్యార్థులు చెప్పారు.

01/24/2016 - 02:29

ఐరాల, జనవరి 23: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయకస్వామి కల్యాణకట్టలో హుండీ చోరీకి గురైంది. స్వామివారికి మహిళా భక్తులు సమర్పించే తలనీలాలు ఈహుండీలో వేస్తారు. ఈ హుండీని శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. తల నీలాల విలువ సుమారు 5 లక్షలకు పైగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేశారు.

01/24/2016 - 02:28

హైదరాబాద్, జనవరి 23 : ‘్భక్తుడి చెంతకే భగవంతుడి ఆశీస్సులు’ పేరుతో ఎపి దేవాదాయ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు శనివారం సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, ఏడు రకాల కార్యక్రమాలకు పూజారులే భక్తుల ఇళ్లకు వెళ్లి భగవంతుడి తరఫున ఆశీస్సులు అందిస్తారని వివరించారు.

01/24/2016 - 02:28

న్యూఢిల్లీ/ హైదరబాద్, జనవరి 23: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న గ్రూపులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)తో పాటు కేంద్ర భద్రతా సంస్థలు శనివారం వరుసగా రెండో రోజూ ఉక్కుపాదం మోపాయి. గణతంత్ర దినోత్సవానికి ముందు దాడులకు కుట్ర పన్నుతున్నారన్న ఆరోపణలతో వివిధ రాష్ట్రాల్లో 14మందిని అరెస్టు చేసి స్థానిక కోర్టుల్లో హాజరుపరిచాయి.

01/24/2016 - 02:27

హైదరాబాద్, జనవరి 23: హైదరాబాద్‌లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ అరెస్టు చేసిన నలుగురు ఉగ్రవాదులు జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్‌కు చెందిన వారని పోలీసు వర్గాలు తెలిపాయి. జనూద్ ఉల్ ఖలీఫ్ ఇ హింద్ అంటే ఆర్మీ ఆఫ్ ఖలీఫ్ ఆఫ్ ఇండియా. వీరు ఐఎస్‌ఐస్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏర్పాటు చేసిన ఈ సంస్ధలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

01/24/2016 - 02:27

గుంటూరు, జనవరి 23: రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఆర్టీసీ డిపో నుంచి బస్సు బయలుదేరిన క్షణం నుంచి ఎక్కడ ఉందో తెలుసుకునే విధంగా కొత్త యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎపిఎస్‌ఆర్టీసీ ఎం.డి నండూరి సాంబశివరావు తెలిపారు. శనివారం గుంటూరు ఎన్‌టిఆర్ బస్టేషన్‌ను తనిఖీ చేసిన ఎం.డి నండూరి విలేకరులతో మాట్లాడారు.

Pages