S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 18:18

కళింగపురాన్ని ఆనుకుని ఓ దట్టమైన అడవి ఉంది. అందులో అనేక జంతువులతోపాటు ఒక నక్క జీవిస్తూండేది.
ఉదయం లేచింది మొదలు అడవంతా తిరుగుతూ జంతువులను తన అబద్ధపు మాటలతో బురిడీ కొట్టించి మోసం చేస్తూ చివరకు చంపి తినడం తన నైజంగా పెట్టుకుంది నక్క.
ఎందుకో ఈ మధ్య నక్కలో మునుపటి ఉత్సాహం కన్పించక వౌనంగా ఉండసాగింది. నక్కలోని ఈ మార్పును గమనించి మిత్రుడైన తోడేలు అడిగింది - ఎందుకిలా ఉన్నావని.

01/23/2016 - 18:17

సీతారామరావు కొడాలి, విజయనగరం
పని లేనివాళ్లే ఇలాంటి శీర్షికలకి ప్రశ్నలు పంపిస్తారనుకుంటాను. ఏమంటారు?
మీకు తెలియాలి.

01/23/2016 - 18:15

ప్రతి పండుగకు నిర్దేశింపబడిన సంప్రదాయాలు, వాటి అంతరార్థాలను గ్రహించి, ఆరోగ్యం, ఆహ్లాదం, ఆత్మానందాన్ని అనుభవిస్తూ, సాంఘిక, నైతిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రజా శ్రేయస్సుకు ఉపకరించాలని హితవు పలికేవి పండుగలు. చైతన్య స్ఫూర్తి.. సంక్రాంతి దీప్తి.. అంటూ మా ఇంట సంక్రాంతి శోభను వెల్లివిరిసేట్టు చేశారు - ఈ వారం స్పెషల్ ద్వారా.
-పి.బాబ్జీ (తెనాలి)
వినదగు

01/23/2016 - 18:14

ఎటువంటి కళత్రం (్భర్య/్భర్త) వచ్చే అవకాశం ఉన్నది అనే అంశం ప్రస్తావిస్తే - కళత్రేశే చోపపదాదుచ్చస్థే స్వకులోత్తమాత్, దార లాభో భవేన్నీచే స్స్యాచ్చ నీచకులాద్భవేత్.. ఉపపదమునకు సప్తమాధిపతి ఉచ్ఛయందున్నచో తన వంశము కంటే ఉత్తమ వంశము నుండియు నీచయందున్న యెడల తన వంశము కంటే తక్కువ వంశము నుండియు దార లాభము కలుగును. సుందరీ శుభ సంబందాద్భార్యాస్సాదస్య ధాన్యధా - అపవాదాద్దారనాశ శ్శని రాహ్వన్యయే భవేత్..

01/23/2016 - 18:13

‘హుమ్...’ ఇరవై ఒకటవసారి నిట్టూర్చింది రాజేశ్వరి. ప్రస్తుతం ఆమెను ‘అభిమాన వైరాగ్యం’ పట్టి బాధిస్తోంది. అభిమాన వైరాగ్యమనేది ప్రేమాభిమానాల మీద వైరాగ్యమో లేక తన అభిమానం దెబ్బ తినడం వల్ల వచ్చిన వైరాగ్యమో కావచ్చు.

01/23/2016 - 18:11

అంతా ప్రశాంతంగానే ఉంది. అంతట్లో ప్రార్థనకు సమయం అవుతుంది. ఒకసారి కాదు. దినంలో అయిదుసార్లు అవుతుంది. ఇక ఆస్తికులను పిలిచే కార్యక్రమం మొదలవుతుంది. ఊరికే పిలిస్తే అభ్యంతరం లేదు. మైకుల గోల మొదలవుతుంది. అవి మామూలు స్థాయిలో ఉంటే అభ్యంతరం లేదు. మైకులు మరీ ఎక్కువగా అరుస్తాయి. మైకులు ఉన్నాయని తెలియని ఆ మువజ్జిన్ మరింత గట్టిగా అరుస్తాడు. ఒకరే అరిస్తే ఫరవాలేదు.

01/23/2016 - 18:10

మనమే గుర్తించని రీతిన మనం తప్పిపోతున్నాం.. మనకు మనంగా మిగలలేక పోతున్నాం. కారణం మనది ఇంద్రియభోగం.. ప్రాపంచిక లాలసత... వస్తు సంపదతో విర్రవీగుతూ ‘ఆత్మ’ సంపన్నతను పట్టించుకోవటం లేదు. భౌతిక సుఖాలు, భౌతిక ఆర్భాటాలు, భౌతిక ఆచ్ఛాదనలు, భౌతిక పలవరింతలు, భౌతిక తాపత్రయాలు - ఇంతేనా భోగ జీవితం.. ఇంతేనా సుఖ సంసారం.

01/23/2016 - 18:09

వర్షంలో కనపడే ఆ మైలురాయి మీద డోవర్ 41 అని రాసుండడం కారు నడిపే డోనాల్డ్ చూశాడు. అతని నోట్లోంచి ఓ ఈల పాట వెలువడసాగింది. దాని పేరు ‘ది సాంగ్ ఆఫ్ ది స్కై బోట్ మేన్’. అది ఫ్రెంచ్ పాట. ఫ్రాన్స్ నించి విదేశాలని కనిపెట్టడానికి వెళ్లిన నావికులని కీర్తించే పాట అది.

01/23/2016 - 18:07

‘అదిగో భద్రాద్రి’ ‘నగుమోము..’ ‘ఎక్కడి మానుష జన్మంబెత్తితే..’ వంటి కీర్తనలు వింటున్నప్పుడు శ్రోత మనసు గాలిలో తేలిపోతుంది. ‘పిబరే రామరసం..’ ‘స్వర వారం వారం..’ పాటలకు కట్టిన వరసలని ఉచ్చరిస్తుంటే తాదాత్మ్యంలోంచి తొంగి చూసిన అనుభూతి ఆనంద తరంగాల డోలికల్లో ఊగిసలాడుతుంది. ‘బృహదీశ్వర మహాదేవ’ అనే కృతిని పాడినా..

01/23/2016 - 18:05

ఆధారాలు
అడ్డం
1.మంచిముత్యము. గుండ్రతనముగల ముత్యము (5)
4.ఏరువాక పండగ ఈ తిథినాడు జరుపుకుంటారు (3)
6.సంబారములలో ఒక పొడవు కొలత (2)
7.బురద. పంపకముల్లో ఇది కొంత తప్పదు (3)
10.్భగవంతుడికి కానుకలు సమర్పించే చోటు (2)
11.సరంగుల్లో ఈ వర్ణం తప్పకుండా కనిపిస్తుంది (2)
12.విసరు (2)
15.‘సౌ రుపయే’ లో ఉండే అందం చూడగానే తెలిసిపోతుంది (2)

Pages