S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 12:55

హైదరాబాద్‌: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం పాఠశాలలో ఖో..ఖో.. ఆడుతూ భద్రాచలం అనే విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఉపాధ్యాయులు భద్రాచలంను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురుగా ఢీకొనడంతో సంఘటన చోటుచేసుకున్నది.

01/23/2016 - 12:44

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈమేరకు ట్విట్ చేశారు. నేతాజీ దేశానికి చేసిన సేవలను, ధైర్యసాహసాలను కొనియాడారు. ధైర్యసాహసాలను, దేశభక్తిని భారతీయులంతా గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతోపాటు పలువురు నేతాజీకి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

01/23/2016 - 14:34

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆమరణ దీక్షలు శనివారం కూడా కొనసాగుతున్నాయి. దీక్షలో పాల్గొంటున్న వారికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి, షుగర్ లెవెల్స్ పడిపోవడంతో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తోంది.

01/23/2016 - 11:51

రాజమండ్రి: టిడిపి యువనేత, ఎ.పి. సి.ఎం. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా శనివారం ఇక్కడ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కేక్ కట్ చేశారు. తాను నటించే 100వ సినిమాకు ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, మంచి కథ దొరికితే త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేసే విషయమై హైదరాబాద్ వెళ్లాక నిర్ణయం తీసుకుంటానని బాలయ్య తెలిపారు.

01/23/2016 - 11:51

విశాఖ: దట్టమైన పొగమంచు కారణంగా విశాఖ ఏజెన్సీలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులేర్పడ్డాయి. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో ప్రజలు చలికి వణుకుతున్నారు. లంబసింగిలో 5, పాడేరు, చింతపల్లిలో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

01/23/2016 - 11:50

ఏలూరు: చేపల చెరువుపై వివాదం ఫలితంగా ఏలూరు మండలం ప్రతికోళ్ల లంక గ్రామంలో శనివారం పోలీసులు నిషేదాజ్ఞలు విధించారు. శుక్రవారం జరిగిన ఘర్షణకు సంబంధించి 53 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేపలచెరువు వివాదంపై హైకోర్టు తీర్పు ఈరోజు వెలువడనున్న దృష్ట్యా ఉభయ వర్గాలు సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

01/23/2016 - 11:50

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఉదయం ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. ఇండిగో విమాన సంస్థ సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని ప్రయాణీకులు ఆందోళన ప్రారంభించి, ఎయిర్‌పోర్ట్‌లో బైఠాయించారు. దీంతో 48 మంది ప్రయాణీకులను ఎయిర్‌పోర్ట్‌లోనే ఇండిగో సిబ్బంది వదిలేశారు. కొద్దిమంది ప్రయాణికులతో ఆ విమానం రాయ్‌పూర్ బయల్దేరింది.

01/23/2016 - 11:50

నల్గొండ: యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉదయం పూజలు చేశారు. ఆలయం వద్ద ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సిఎస్ వెంట జిల్లా కలెక్టర్, తదితర అధికారులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి సంస్థ సమావేశంలో రాజీవ్‌శర్మ పాల్గొంటారు.

01/23/2016 - 11:49

హైదరాబాద్: వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో శనివారం రెండు వేర్వేరు ఘటనల్లో రెండు కార్లు దగ్ధమయ్యాయి. వరంగల్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఓ కారులో ఆకస్మికంగా మంటలు వ్యాపించటంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే కిందకి దూకారు. మంటల్లో దగ్ధమైన ఈ కారు జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్‌ది గుర్తించారు.

01/23/2016 - 11:49

దిల్లీ: దేశ రాజధాని దిల్లీ పరిశ్రమ ప్రాంతాల్లో శనివారం కూడా దట్టమైన పొగమంచు ఆవరించింది. దీంతో 30 రైళ్లను రద్దు చేశారు. 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పొగమంచు వల్ల రోడ్లపై ప్రయాణించేందుకు వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు.

Pages