S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 18:01

మేషం (ఏప్రిల్ 15 - మే 14)

01/23/2016 - 18:00

భగత్‌సింగ్ 12
‘సర్దార్ బహదూర్’ దిల్బాగ్‌సింగ్ నిప్పు తొక్కిన కోతిలా ఎగిరెగిరి పడ్డాడు.

01/23/2016 - 14:04

హైదరాబాద్‌: హైదరాబాద్ మేయర్ టీఆర్‌ఎస్ కైవసం కావడం ఖాయమైపోయిందని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాజపా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్‌సింగ్‌ రాథోడ్‌, శేరిలింగంపల్లి తెదేపా నేత బండి రమేశ్‌ తదితరులు రాష్ట్రమంత్రులు కేటీఆర్‌, నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు.

01/23/2016 - 13:57

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి పాల్పడేందుకు ఐసిస్ వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ‌కు వచ్చిన సమాచారం మేరకు శనివారం 6 నగరాల్లోని 12 చోట్ల సోదాలు నిర్వహించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు 13మంది అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

01/23/2016 - 13:29

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో చలితో పాటు పొగమంచు కమ్మేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన దాదాపు 30 రైళ్లు రద్దయ్యాయి. సుమారు 20 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమాన సర్వీసులలో ఆలస్యం లేదని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగా ఉదయం వాహనదారులు కూడా ఇబ్బంది పడ్డారు.

01/23/2016 - 13:25

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్య దస్త్రాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. నేతాజి జయంతి సందర్భంగా రహస్య దస్త్రాల డిజిటల్‌ ప్రతులను ప్రధాని విడుదల చేశారు. కార్యక్రమంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

01/23/2016 - 13:24

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరంలో త్వరలో జరగనున్న గ్రేటర్‌ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్‌ పార్టీ శనివారం 15 పేజీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణభవన్‌లో ఆపార్టీ నేతలు గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కేకే, డీఎస్ తదితరులు నేతలు పాల్గొన్నారు.

01/23/2016 - 13:12

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో శుక్రవారం ఆర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. సీతానగరం చిన్న ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వీరభద్రరావు అనే వ్యక్తి ఇంట్లోకి శనివారం తెల్లవారుజామున దొంగలు చొరబడి ఇంట్లోని వారిపై దాడి చేసి బంగారు నగలను దోచుకుపోయారు.

01/23/2016 - 13:02

కొచ్చి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేరళ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ ఏసీ జోస్‌(79) కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చికిత్స పొందుతూ మృతిచెందారు. జోస్‌ మృతిపట్ల పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

01/23/2016 - 12:56

ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మహిళా కోర్టు, భార్యాభర్తల కౌన్సిలింగ్ కేంద్రం నేడు ప్రారంభమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ సునీల్ చౌదరిలు పాల్గొన్నారు.

Pages