S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 04:24

రాజమహేంద్రవరం, జనవరి 22: రాజమహేంద్రవరం కౌన్సిల్ సమావేశం ఆద్యంతం రాద్ధాంతంగానే సాగింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు సభా మర్యాదలను పక్కనపెట్టి రాద్ధాంతం చేసిన తీరు విస్మయాన్ని కలిగించింది. శుక్రవారం మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది.

01/23/2016 - 04:22

మదనపల్లె, జనవరి 22: ఈ ఏడాది వర్షాలు అనుకూలించినా.. అన్నదాతను జీవన రసాయన మందులు మరింత దెబ్బతీస్తున్నాయి. చట్టాలలోని లొసుగులు ఆధారం చేసుకుని విపణిలోకి వచ్చిన కొన్ని బయోపురుగుల మందులు రైతులను పీల్చిపిప్పి చేస్తున్నాయి. ఈ మందులతో పురుగులు చావడం మాటేమోగానీ రైతుల జేబులకు చిల్లు పడుతున్నాయి. ప్రభుత్వ వ్యవసాయశాఖ ధృవీకరణపత్రం లేకున్నా నాసిరకం మందులు మార్కెట్‌లో విచ్చలవిడిగా అమ్ముడవుతున్నాయి.

01/23/2016 - 04:05

ఖైరతాబాద్, జనవరి 22: రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర మంత్రి దత్తాత్రేయపై విమర్శలు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం మండిపడింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేష్ మాట్లాడుతూ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి మృతి చెందడం అందరినీ కలిచి వేసే అంశమని, దానిని రాజకీయాల కోసం వాడుకోవాలని చూడటం మరింత బాధను కలిగిస్తోందని అన్నారు.

01/23/2016 - 04:04

హైదరాబాద్, జనవరి 22: పాశ్చాత్య నాగరికత ధోరణిలో పరుగులు తీస్తున్న యువత కోసం శ్రీ సత్యకళా నికేతన్ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం జూబ్లీహిల్స్ నటరాజ కళామందిరంలో సినీ సాంకేతిక పరిజ్ఞానంతో పాశ్చాత్య నృత్య ప్రదర్శన జరిగింది. వేదికపై వానను సృష్టించారు.

01/23/2016 - 04:04

హైదరాబాద్, జనవరి 22: ఒకప్పుడు దగ్గర స్నేహితులుగా మెలిగిన వివిధ పార్టీలకు చెందిన నేతలు ఇపుడు బల్దియా బరిలో ప్రత్యర్థులయ్యారు. డివిజన్ల పునర్విభజన వీరి మధ్య చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. టికెట్ల కోసం పార్టీలు మారి రాజకీయ ప్రత్యర్థులై విజయమే లక్ష్యంగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

01/23/2016 - 04:03

అల్వాల్, జనవరి 22: గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. మచ్చబొల్లారం, అల్వాల్, వెంకటాపురం డివిజన్‌లలో ప్రచారంతో కాలనీలు బస్తీలు మారుమొగుతున్నాయి. ఒక పార్టీ ఒక కాలనీ వీధిలో ప్రచారం చెస్తుంటే మరో పార్టీ అభ్యర్థి మరో కాలనీలో ప్రచారం చేస్తున్నాడు. గురువారం వరకు గుర్తులు రాకపోవటంతో ప్రచారం కొంత అంతరాయం ఏర్పడింది. శుక్రవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

01/23/2016 - 04:03

మల్కాజిగిరి, జనవరి 22: మల్కాజిగిరి తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి వికె.మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. మహేష్ టిఆర్‌ఎస్‌లో చేరేందుకు అంతా సిద్ధమైంది. పార్టీలో తనకు సరైన గౌరవం దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన రెండురోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కార్పొరేటర్ టికెట్ విషయంలో తన మాటకు విలువ ఇవ్వకపోవటంతో రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

01/23/2016 - 04:02

హైదరాబాద్, జనవరి 22: విద్యార్థులకు చదువుతో పాటు ఆట, పాటలకు కూడా ప్రతిరోజూ కొంత సమయాన్ని కేటాయించినప్పుడే వివిధ రంగాల్లో వారి ప్రతిభను వెలుగులోకి తేగలమని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తెలిపారు. శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రెండురోజులు నిర్వహించే రంగారెడ్డి జిల్లా స్థాయి కస్తూరిభా గాంధీ బాలికా విద్యాలయాల క్రీడాపోటీలను జేసి ప్రారంభించారు.

01/23/2016 - 04:02

హయత్‌నగర్, జనవరి 22: తెరాసలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని లింగోజిగూడ టిఆర్‌ఎస్ అభ్యర్థి ముద్రబోయిన శ్రీనివాసరావు అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌కు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. శుక్రవారం లింగోజిగూడ డివిజన్ పరిధిలోని తపోవన్‌కాలనీ, మజీద్‌బస్తి తదితర ప్రాంతాలలో ఆయన జోరుగా ప్రచారం చేశారు.

01/23/2016 - 04:01

శంషాబాద్, జనవరి 22: నిబంధనలకు విరుద్ధంగా కోటి విలువ చేసే సౌదీ కరెన్సీ యూరో జిరంమ్‌ను తరలిస్తున్న విమాన ప్రయాణికుడిని రెవెన్యూ ఇంటిలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి విమాన ప్రయాణికుడు 5000 యూఎస్ డాలర్లు, 5000 ట్రావెల్ చెక్కు తీసుకెళ్లే అవకాశం ఉంది.

Pages