S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/23/2016 - 11:48

విజయవాడ: కృష్ణా జిల్లా కంచికచర్లలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో శుక్రవారం అర్ధరాత్రి వినయ్ కుమార్ అనే టెన్త్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం పాఠశాల సిబ్బంది ఈ విషయాన్ని కనుగొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

01/23/2016 - 11:48

చిత్తూరు: చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు వద్ద శనివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.

01/23/2016 - 04:51

భీమవరం, జనవరి 22: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్‌పై నిఘా పెట్టి, దర్యాప్తుచెయ్యాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాకా సత్యనారాయణ డిమాండు చేశారు. ఈ ఎఎస్‌ఎపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. సెంట్రల్ యూనివర్శిటీ ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌కు ఇస్లామిక్ సంస్థలతో పరిచయం ఉందని అనుమానిస్తున్నారన్నారు.

02/02/2016 - 22:09

విశాఖపట్నం, జనవరి 22: ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్‌ఆర్)ను తిలకించే అవకాశాన్ని సాధారణ ప్రజానీకానిక కల్పించనున్నారు. వచ్చే నెల 5 నుంచి 8వరకూ ఎనిమిది రోజుల పాటు ఆర్‌కె బీచ్ కేంద్రంగా ఐఎఫ్‌ఆర్ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. దీనికి సంబందించి పాసుల జారీకి జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేయగా, తొలి రోజు తీవ్ర అంతరాయమేర్పడింది.

01/23/2016 - 04:45

మచిలీపట్నం, జనవరి 22: గ్రామీణ ప్రాంత దళిత మహిళా వ్యవసాయ కూలీల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘్భమి కొనుగోలు’ పథకం జిల్లాలో అటకెక్కింది. దళిత వర్గానికి చెంది గ్రామీణ ప్రాంతాల్లో నివశిస్తున్న మహిళా వ్యవసాయ కూలీలను రైతులుగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది.

01/23/2016 - 04:43

సీతంపేట, జనవరి 22: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినీవిద్యార్థులు తరుచూ చికెన్‌సెల్ ఎనీమియా బారినపడుతున్నారని, అటువంటి విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు ఆదేశించారు. ఐటిడిఎ పిఒలు, అధికారులతో శుక్రవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/23/2016 - 04:41

ఒంగోలు, జనవరి 22 : రాష్టవ్య్రాప్తంగా రెవెన్యూశాఖను ప్రక్షాళన చేశామని, అయినప్పటికీ విమర్శలు వస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు.

01/23/2016 - 04:38

నెల్లూరు, జనవరి 22: ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సహనం కోల్పోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి ఆరోపించారు.

01/23/2016 - 04:36

కర్నూలు, జనవరి 22:కమీషన్ల కోసం ఇష్టానుసారంగా ఆరోగ్యశ్రీ నిధులు ఖర్చు చేసిన వైనం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో వెలుగులోకి వచ్చింది. పేరుకు పెద్దాసుపత్రి అయినా వసతులు మాత్రం ఆ స్థాయిలో లేవని చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నా ఏడేళ్ల నుంచి ఆడిటింగ్ జరగకపోవడం ఉద్యోగులకు వరంగా మారింది. ఆసుపత్రిలోని ఓ ఉద్యోగి కాంట్రాక్టర్ అవతారమెత్తి దాదాపు రూ.

01/23/2016 - 04:34

గుంటూరు, జనవరి 22: గ్రామకంఠాలపై తమకు సమాచారం లేదంటూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్ తుళ్లూరు రైతుల ఎదుట వ్యాఖ్యానించటంతో వారంతా మండిపడ్డారు.

Pages