S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 22:19

తే. తెరలవల వైచి జాలరుల్ దిగిచి దాని
యుదరదళనంబు సేసి యం దొక్క కొడుకు
నొక్క కూఁతును గని వారి నొనరఁ దెచ్చి
దాశరాజున కిచ్చిరి తత్ క్షణంబ

01/19/2016 - 22:07

మన ఇంటి పెరట్లోనో, చుట్టుపక్కల ఖాళీ ప్రదేశాల్లోనో పలురకాల మొక్కల్ని నిత్యం చూస్తూంటాం.. వాటిలో మనకు తెలియని మొక్కలు ఎన్నో.. అవి ఎందుకూ పనికిరాని పిచ్చిమొక్కలని భావిస్తాం.. వాటిలోని ఔషధ గుణాల గురించి మనకు తెలియదు.. శారీరక అనారోగ్యాలను నివారించే ఔషధ గుణాలు ఇలాంటి మొక్కల్లో పుష్కలంగా ఉంటాయి..

01/19/2016 - 22:05

శారీరక, మానసిక ఉల్లాసానికి ఉదయానే్న యోగాసనాలు వేయడం అందరికీ తెలిసిందే. అయితే, పెంపుడు శునకాలతో కలిసి ‘యోగా’ చేయడం ఇపుడు చాలాదేశాల్లో సరికొత్త ‘క్రేజ్’గా మారింది. శునకాలతో కలిసి యోగా విన్యాసాలు చేయడాన్ని ‘డోగా’ అని వ్యవహరిస్తున్నారు. హాంకాంగ్‌లో సోమవారం నాడు 270 మంది యజమానులు తమ పెంపుడు శునకాలతో కలిసి పలురకాల యోగాసనాలు ప్రదర్శించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

01/19/2016 - 22:04

ఏదో పాతకాలం నాటి సినిమా పాట అని విని వదిలేయటం కాదు. ‘నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా..’ అన్నట్టుగా ప్రతిరోజునీ అందమైన నవ్వులతో గడిపేస్తుంటే జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది? అసలు నవ్వురానివారు, నవ్వలేనివారు మనిషే కాదని అంటారు మేధావులు. ఆ మాట అలా వుంచితే, నవ్వు ఆనందాన్నిచ్చే అద్భుతమైన సాధనమని భావించాల్సిందే. నవ్వు గొప్పతనం గురించి ఎన్నోసార్లు విన్నా, చదివినా..

01/19/2016 - 22:03

నిత్యం జనం మదిలో మెదిలేందుకు ‘సెలబ్రిటీ’లు తపన పడుతునే ఉంటారు. ఏదోఒక విధంగా వార్తల్లో నిలుస్తునే ఉంటారు. ఇదే కోవలో ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని (67) ఇపుడు గాయనిగా తన అభిమానులను అలరించబోతున్నారు. ‘డ్రీమ్‌గర్ల్’గా ప్రేక్షకజన హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అందాల నటి మధుర నియోజకవర్గ నుంచి బిజెపి ఎంపీగా రాజకీయాల్లో బిజీగా ఉంటూనే కళారంగంలోనూ కృషి చేస్తున్నారు.

01/19/2016 - 22:01

ఉదయానే్న వంటగదిలో హడావుడి పడుతున్న భార్యతో భర్త- ‘నా పర్సులో డబ్బు ఏమైనా తీశావా?’ అన్నాడు.
పనితో చిరాగ్గా ఉన్న ఆమె ‘నేనెందుకు తీస్తాను, తీసేంత టైమెక్కడ ఉంది, తీసినా సరదాలు తీర్చుకునే అవకాశమెక్కడుంది?’ అంది.

01/19/2016 - 21:59

ఆయుర్వేద వైద్యంలో ఎనె్నన్నో అనారోగ్యాలకు పిప్పళ్ళను ఔషధంగా వాడుతారు. ఇవి రుచిపరంగా కారంగా, ఘాటుగా ఉన్నా మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
- బాలింతరాలికి చనుబాలు వృద్ధి చెందాలంటే పిప్పళ్ళను తీసుకోవాలి.
- శిశువుకి పళ్ళు వచ్చేటప్పుడు పిప్పళ్ళ పొడిని తేనెలో కలిపి, చిగుళ్ళ మీద పలుచగా రాస్తూంటే దురదల నుంచి ఉపశమనం కలుగుతుంది.

01/19/2016 - 21:26

మనోనిబ్బరంతో పట్టుదలతో ప్రయత్నిస్తే కానిపని ఏదీ లేదు. యుగాలు గడిచినా తరాలు మారినా మారనిది ఒక్కటే ధర్మం. అధర్మం ఎప్పుడూ పరాజయంవైపే పయనిస్తుంది. మంచివారికెప్పుడూ మంచే జరుగుతుందన్నది చరిత్ర చెప్పే సత్యం. ఎన్ని ఆటంకాలు వచ్చినా మొదలుపెట్టిన పనిని పూర్తిచేసేవరకు కొందరు విశ్రమించరు. ఒక పని ప్రారంభించాక మధ్యలో ఆపకుండా కొనసాగించడమే కార్యదీక్షకు నిదర్శనం.

01/19/2016 - 21:25

ఇంత కటిక గుండెదానివైనావే తల్లీ! నీ చేతులెట్లా వచ్చాయే! బంగారం లాంటి కొడుకును పెయ్యతాడుతో కట్టి రోలుకు బంధిస్తారా ఎవరైనా?

01/19/2016 - 21:22

డాక్టర్ మాటలను విన్న కిషోర్, అనితలు షాక్ తిన్నవాళ్ళ మాదిరిగా ఒక్కసారిగా స్తబ్దులై కొంతసేపు వౌనంగా కూర్చుండిపోయారు.
వాళ్ళనాస్థితిలో చూసిన డాక్టర్ విశ్వామిత్రా వెంటనే స్పందిస్తూ ‘‘చూడండీ! మీకిప్పుడు పిల్లలు కలగడానికి అవకాశం లేదన్నాను గాని అసలు పిల్లలే లేకుండాపోయే పరిస్థితి వుండకుండా పోదు గదా! ’’ నిశ్చితంగా వాళ్ళ వంక చూస్తూ అన్నాడు.

Pages