S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/20/2016 - 07:19

మెల్బోర్న్, జనవరి 19: కెరీర్‌లో 14 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్ వన్ రాఫెల్ నాదల్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ మొదటి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించాడు. మహిళల విభాగంలో ప్రపంచ మాజీ నంబర్ వన్ వీనస్ విలియమ్స్, రెండో ర్యాంక్ క్రీడాకారిణిగా బరిలోకి దిగిన సిమోనా హాలెప్ కూడా పరాజయాలను ఎదుర్కొని వెనుదిరిగారు.

01/20/2016 - 07:12

సైదాబాద్, జనవరి 19: మలక్‌పేట నియోజకవర్గ పరిధిలోని ముసారాంబాగ్ డివిజన్‌ను దత్తత తీసుకొని సమగ్రాభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.లక్ష్మారెడ్డి ప్రకటించారు. మంగళవారం ముసారాంబాగ్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి తీగల సనరితారెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని పేద బలహీనవర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్య సహాయం అందేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

01/20/2016 - 07:11

గచ్చిబౌలి, జనవరి 19: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిహెచ్‌డి విద్యార్థి రోహిత్ వేముల మృతితో వేడెక్కిన వాతావరణం చల్లారలేదు. ఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు వచ్చి రోహిత్ కుటుంబాన్ని పరామర్శించడంతో యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. యూనివర్సిటీలోని విద్యార్థి సంఘాలు జెఎసిగా (ఎబివిపి తప్ప) ఏర్పడి నిరసనలు తెలుపుతున్నారు.

01/20/2016 - 06:58

హైదరాబాద్, జనవరి 19: పార్టీలు వేరు కానీ గ్రేటర్ ఎన్నికల్లో అన్ని పార్టీల నినాదాలు ఒకటే. ఇటు అభివృద్ధి, అటు ఆంధ్ర. ఈ రెండు నినాదాలపై అన్ని పార్టీలూ ఆశలు పెట్టుకున్నాయి. 18నెలల పాలనా కాలంలో తాము చేసిన అభివృద్ధిపై తెరాస ఆశలు పెట్టుకుంటే, తమ పాలనా కాలంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ కాంగ్రెస్, భాజపా- తెదేపా కూటమి ప్రచారం చేస్తోంది.

01/20/2016 - 06:54

హైదరాబాద్, జనవరి 19: హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ బొంస్లేతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విధితమే. ఈ ఘటనలో హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్‌తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

01/20/2016 - 06:53

హైదరాబాద్, జనవరి 19: మిషన్ భగీరథ పనుల పురోగతి పరిశీలనకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10.30కు హెలిక్యాప్టర్‌లో మెదక్ జిల్లా గజ్వేల్, వరంగల్ జిల్లా జనగామ, నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లా ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు అందించే లక్ష్యంతో యుద్ధప్రాతిపదికన మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి.

01/20/2016 - 06:37

హైదరాబాద్/ న్యూఢిల్లీ, జనవరి 19: రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య సంఘటనపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మూడో రోజైన మంగళవారం కూడా విద్యార్ధుల నిరసనలతో దద్దరిల్లిపోయింది. మరో పక్క ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ సహా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు, దళిత సంఘాలు ధర్నాలు, బైఠాయింపులు, వివిధ రకాల నిరసన, నిరశన కార్యక్రమాలను చేపట్టాయి.

01/20/2016 - 06:32

హైదరాబాద్, జనవరి 19: పక్షపాత వైఖరిని ప్రదర్శించడం ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పాలకులు రీసెర్చి విద్యార్ధి రోహిత్ ఆత్మహత్యకు పురిగొల్పేలా వ్యవహరించారని ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. మంగళవారం ఆయన న్యూఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకుని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి వచ్చారు.

01/20/2016 - 06:29

హైదరాబాద్, జనవరి 19: ప్రపంచ ఆర్ధిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ బృందం తొలి రోజు బిజీ బిజీగా గడిపేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ప్రమోషన్ చేపట్టింది. తొలి రోజే కార్పొరేట్ సంస్థలకు చెందిన ప్రపంచస్థాయి ప్రతినిధులతో సిఎం చంద్రబాబు ఏపీ ప్రమోషన్‌పై చర్చలు జరిపారు.

01/20/2016 - 06:27

విజయవాడ, జనవరి 19: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అనువైన ప్రదేశంపై ప్రభుత్వ, శాసనసభ, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణకు కెఎల్ యూనివర్సిటీని మంగళవారం ఉదయం ఆయన పరిశీలించారు.

Pages