S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 16:08

న్యూఢిల్లీ :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. హెచ్‌సీయూలో ఉద్రిక్తత కొనసాగుతుండగా, ముంబయి యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. అలాగే పూణెలోని ఎఫ్‌టిఐఐ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. కేంద్ర మంత్రి స్మృతీఇరానీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

01/19/2016 - 14:11

కోక్రాజార్ : ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అస్సాంలో పర్యటిస్తున్నారు. కోక్రాజార్ జిల్లాలో ఆయన బహిరంగసభలో పాల్గొన్నారు. అభివృద్ధి మంత్రమే తమ ఎజెండా అన్నారు. వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కోక్రాజార్ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు.

01/19/2016 - 14:11

హైదరాబాద్ : హెచ్‌సీయూలో కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ రోహిత్ తల్లిదండ్రులను పరామర్శించారు. రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి రాహుల్ నివాళులర్పించారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన మిగతా నలుగురు విద్యార్థులతో రాహుల్ మాట్లాడారు. రోహిత్ ఆత్మహత్య వివరాలను తెలుసుకున్నారు. రాహుల్ రాకతో హెచ్‌సీయూ వద్ద పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు.

01/19/2016 - 13:37

గుంటూరు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి రోహిత్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు శంకర్‌విలాస్ సెంటర్‌లో ఎన్‌ఎస్‌యూఐ రాస్తారోకో నిర్వహించింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసు బలగాలను మొహరించారు.

01/19/2016 - 13:20

ఢిల్లీ: బాలీవుడ్‌ చిత్రం ‘బాజీరావు మస్తానీ’కి పన్ను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ చిత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల వీక్షించారు. అఖిలేష్‌ని ఎంతగానో ఆకట్టుకుందట. దీంతో చిత్రానికి పన్ను ఎత్తివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

01/19/2016 - 13:09

హైదరాబాద్‌ : సెంట్రల్‌ యూనివర్శిటీ వీసీని పదవి నుంచి తప్పించాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రి బండారు ఇచ్చిన లేఖ వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన గుర్తుంచుకోవాలని, దీన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని ఒవైసీ అన్నారు.

01/19/2016 - 13:02

నల్గొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నీ రాకెట్‌ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరింది. ప్రధాన నిందితుడు సురేష్‌తో పాటు దిలీప్‌ చౌహాన్‌(అహ్మదాబాద్‌) హైదరాబాద్‌కు చెందిన జీను నూకరాజు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ మీడియాతో మాట్లాడారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీలోకి తీసుకుంటామన్నారు. త్వరలోనే విచారణను పూర్తి చేస్తామని విక్రమ్‌జిత్‌దుగ్గల్‌ చెప్పారు.

01/19/2016 - 12:56

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని షెషావర్ చెక్‌పోస్టు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు, పలు బైక్‌లు ధ్వంసమయ్యాయి. ఆత్మాహుతి దాడి జరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పోలీసులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి చేశారు.

01/19/2016 - 12:43

నెల్లూరు : జిల్లాలోని పలు ప్రాంతాలలో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లల్లో ఉన్న ప్రజలు భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. ఈ మధ్య కాలంలో జిల్లాలో భూప్రకంపనలు రావడం ఇది పదోసారి.

01/19/2016 - 11:45

కాకినాడ: రావులపాలెం మండలం గోపాలపురంలోని పలు రైస్ మిల్లుల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు ఆటోలలో సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

Pages