S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

01/19/2016 - 21:17

క. అమిషమని దానిం గొనఁ
గామది సమకట్టి యొక్క ఖగ మాఖగమున్
వ్యోమమునఁ దాఁక దివిసం
గ్రామం బారెంటి కయ్యెఁ గడురభసమునన్

భావం: వసురాజు యొక్క వీర్యాన్ని ఒక ఆకుదొప్పలో ఉంచి డేగ మెడకు దానిని కట్టి గిరికకు ఇవ్వుమని ఉపరిచరుడు చెప్పి డేగను పంపించగా మధ్యలో మరొక డేగతో పోరు చేయాల్సివచ్చింది.

01/19/2016 - 21:06

‘అరుణాం కరుణా తరంగి తాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్’

01/19/2016 - 21:04

ఈరోజుల్లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, ఆలుమగలిద్దరూ ఉద్యోగస్థులవడంతో ఇరుగు పొరుగులతో మైత్రి, ఐక్యత, అనుబంధాలు పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఉద్యోగరీత్యా బదిలీలవల్ల ఎన్నో ఊళ్ళు మారాల్సి రావచ్చు. అందువల్ల అద్దె ఇంట్లోకి చేరబోయే ముందు ఇరుగు పొరుగు ఎలాంటి వారన్నదీ తెలుసుకోవాలి. ఇరుగుపొరుగున వున్నవారు స్వంత ఇంటివారయినా, అద్దెవారైనా వారిపట్ల గౌరవ మర్యాదలతో ప్రవర్తించాలి.

01/19/2016 - 21:01

ఈరోజుల్లో సైకిళ్ళ వాడకం తగ్గిపోయింది. సైకిల్‌మీద ప్రయాణం చేసేవారు స్వల్ప శాతంలో ఉంటున్నారు. ఈ రోజుల్లో టూవీలర్స్, ఫోర్ వీలర్స్ ఎక్కువగా ప్రయాణ సాధనాలయ్యాయి. పూర్వంలో కార్లను సంపన్నులే ఉపయోగించేవారు. సామాన్య ప్రజల ప్రయాణ సాధనం సైకిలు. ఈ రోజుల్లో బ్యాంకుల నుంచి ఋణ సదుపాయం పొందే అవకాశం లభించడంవల్ల, ప్రతివారూ లోన్ తీసుకుని కార్లు, బైక్‌లు కొని వాడుతున్నారు.

01/19/2016 - 20:58

మహిళల శ్రేయస్సు కోసం ఆమె దాదాపు మూడు దశాబ్దాలుగా నిరంతర సమరం సాగిస్తున్నారు. విద్య, వైద్యం, సామాజిక భద్రత, ఆర్థిక సాధికారత వంటి రంగాల్లో స్ర్తిలకు న్యాయం జరగాలని వివిధ స్థాయిల్లో ఆమె తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలో ఉంటున్న రంజనాకుమారి (70) కళాశాలలో చదివే రోజుల్లోనే హక్కుల ఉద్యమాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు.

01/19/2016 - 20:56

నెయిల్ పాలిష్ వేసుకోవడం పూర్తయ్యాక- వేడి నీటి ఆవిరి తగిలేలా అర నిమిషం పాటు వేళ్లను ఉంచితే గోళ్ల అందం మరింతగా ఇనుమడిస్తుంది. సీసాలో గోళ్ల రంగు గట్టిపడితే దాన్ని గోరువెచ్చని నీరు పోసిన గినె్నలో కాసేపు ఉంచాలి. ఇలా చేస్తే గోళ్లరంగు మెత్తబడి మళ్లీ వాడుకోవడానికి వీలుగా మారుతుంది. ఎండిపోయిన గోళ్లరంగులో రెండు, మూడు చుక్కల టర్పైన్‌టెన్ వేస్తే మెత్తబడుతుంది.

01/19/2016 - 18:21

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నేటితో ముగిసింది. మొత్తంగా దాఖలైన 4,039 నామినేషన్లలో 3,850 నామినేషన్లను అధికారులు స్వీకరించారు. మిగిలిన 189 నామినేషన్లను తిరస్కరించారు. పరిశీలన ప్రక్రియ అనంతరం తెరాస-839, భాజపా-426, తెదేపా-658, కాంగ్రెస్‌-659 నామినేషన్లు మిగిలాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 21 వరకు గడువు ఉంది.

01/19/2016 - 18:19

రైసిన్‌ : మధ్యప్రదేశ్‌లోని రైసిన్‌ జిల్లాలో భోజ్‌పురి ఆలయానికి సమీపంలో ఓ ఇంట్లో పని చేస్తున్న దౌలత్‌ సింగ్‌ భీల్‌(40) అనే వ్యక్తి తన యజమాని ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికను దగ్గర ఉన్న అడవికి తీసుకెళ్లాడు. బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేసి శవాన్ని అక్కడే ఆకులు, రాళ్ల మధ్య పాతిపెట్టి వెళ్లిపోయాడు

01/19/2016 - 18:18

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం హైదర్ గూడలో బట్టలు కొనుగోలు చేశారు. హైదర్ గూడలోని సాయిఖాదీ భండార్ లో ఆయన వస్త్రాలు కొనుగోలు చేసి... కుట్టేందుకు కొలతలు ఇచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... తాను 1990 నుంచి అదే షాపులో బట్టలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తొలిసారిగా షాపింగ్ చేశారు.

01/19/2016 - 18:17

హైదరాబాద్: రాష్ట్రంలోని పలుచోట్ల ఇవాళ వర్షం కురిసింది. నల్లగొండ పట్టణంలో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో , వరంగల్ జిల్లా హన్మకొండలో మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల చిరు జల్లులు పడ్డాయి.

Pages