నల్గొండ

అంబరాన్నంటిన జాన్‌పహాడ్ దర్గా ఉర్సు మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జనవరి 22: లౌకికత్వానికి, మత సామరస్యానికి చిహ్నమయిన తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్దిచెందిన నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ సైదులుదర్గా ఉర్సు మహోత్సవం అశేష జనభక్తవాహనిలో అత్యంత వైభవంగా, సాంప్రదాయసిద్ధంగా కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా ఎస్‌పి విక్రమ్‌జిత్ దుగ్గల్, మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, తహశీల్దార్ డి.సత్యనారాయణ, దర్గా పర్యవేక్షణాధికారి ఫయాజొద్దిన్, ఎండిఓ నాగపద్మజ, టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి శంకరమ్మ, టిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు కొణిజేటి జ్యోతిబాబులు హైద్రాబాద్ నుండి వక్ఫ్‌బోర్డు తెచ్చిన గంధం స్తానిక వక్ఫ్‌బోర్డు కార్యాలయం నుండి చందల్‌ఖానాకు తెచ్చి సాంప్రదాయసిద్ధంగా మత పెద్దలు పూజలు నిర్వహించారు. మరొకవైపు దర్గా పూజారి ఇంటి నుండి గుర్రంపై తెచ్చిన గంధం చందల్‌ఖానాకు చేరుకోగా ప్రజాప్రతినిధులు, మత పెద్దలు, రాజకీయ నాయకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు గురువారం రాత్రి దర్గాకు చేరుకోని గంధం ఊరేగింపులో పాల్గొన్నారు. ముస్లిం దేవుడయినప్పటికి అధిక సంఖ్యలో 90శాతం మంది హిందువులు పాల్గొనడంతో మత సామరస్యం వెల్లివిరిసింది. చందల్‌ఖానా నుండి కొత్తతండా, జాన్‌పహాడ్, చెరువు తండా గ్రామాలలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఊరేగింపు నిర్వహించారు. సుమారు 6కి.మీ నుండి ఊరేగింపుగా వస్తున్న గంధాన్ని తాకడానికి భక్తులు పోటీలు పడ్డారు. దర్గాలోని అజ్రత్ సయ్యద్‌మొయినొద్దిన్‌షా, జాన్‌పాక్‌సయ్యద్, రహమతుల్లా సమాదులపైకి గంధం ఎక్కించే సమయంలో తొక్కిసలాట జరిగింది. గంధం ఊరేగింపు దర్గా నుండి లోపలికి వెళ్ళిన సమయంలో భక్తులు దర్గాలోకి వెళ్లడానికి విశ్వ ప్రయత్నం చేయగా మిర్యాలగూడ డిఎస్‌పి గోనె సందీప్, సిఐలు పార్థసారధి, సత్తయ్య, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, ప్రసాద్‌రావులు భక్తులను చెల్లాచెదురు చేసి అదుపులోకి తెచ్చారు. స్థానిక దక్కన్ సిమెంట్స్ ట్యాంకులతో మంచినీరు అందచేశారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పన కోసం రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్య, అగ్నిమాపక, వక్ఫ్‌బోర్డు, ఎక్సైజ్, ఆర్టీసి, ట్రాన్స్‌కో, 108శాఖలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. పోలీసుశాఖ 400మంది సిబ్బందితో గట్టి బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరుకావడంతో దర్గా పరిసర ప్రాంతం వీదులన్ని జనసంద్రంతో నిండిపోయాయి. ఉర్సు ఉత్సవంలో గ్రంధాలయ అభివృద్ది కమిటి చైర్మన్ అల్లం ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ షేక్ ఖాజా ఫాతిమా, డిప్యూతి తహశీల్దార్ కృష్ణానాయక్, నాయకులు భూక్యా గోపాల్, కొణతం చినవెంకట్‌రెడ్డి, సాముల శివారెడ్డి, అన్నపురెడ్డి నారాయణరెడ్డి, జగన్నాధచారి, మోతిలాల్, సైదులు, కొణతం లచ్చిరెడ్డి, సుబ్బారావు, కొణతం సత్యనారాయణరెడ్డి, వీరయ్య పాల్గొన్నారు.
పరస్పర సహకారంతో ప్రమాదాల నివారణ
మిర్యాలగూడ టౌన్, జనవరి 22: పరస్పర సహకారంతోనే ప్రమాదాలను నివారించవచ్చని రవాణాశాఖ జిల్లా డిప్యూటి కమిషనర్ చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ప్రారభించిన అనంతరం లారీ, ఆటోరిక్షా డ్రైవర్లకు రోడ్డు భద్రతపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే వారు, అదే విధంగా పోలీసు, రవాణా, ఆర్టీసి వారు సమన్వయంతో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన కోరారు. యాంత్రిక, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడంలో ప్రతి ఒక్కరు పాత్ర పోషించాలని కోరారు. ప్రమాదాల నివారణకు కృషి చేస్తామని వారితో ప్రమాణం చేయించారు. తొలుత ఎన్‌ఎస్‌పి క్యాంపులో ఆటోరిక్షా ర్యాలిని ప్రారంభించారు. కార్యక్రమంలో మోటార్‌వెహికిల్ ఇన్స్‌పెక్టర్ శ్రీనివాస్‌గౌడ్, ప్రతాప్‌రాజు, టూటౌన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కె.పాండురంగారెడ్డి, రెడ్‌క్రాస్‌సొసైటి జిల్లా అధ్యక్షుడు గోలి అమరేందర్‌రెడ్డి, లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్.యాదయ్యగౌడ్, చాంద్‌పాషా, నర్సిరెడ్డి, దేవేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, సుభాన్, రామకృష్ణ, నాగభూషణం, భాస్కర్‌లు పాల్గొన్నారు.
రవాణా పన్నుల వసూళ్లలో
రాష్ట్రంలో జిల్లాది రెండో స్థానం
రవాణాశాఖ పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉందని రవాణాశాఖ జిల్లా డిప్యూటి కమీషనర్ చంద్రశేఖర్‌గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ఆర్ధిక సంవత్సరం లక్ష్యం 110.04 కోట్ల రూపాయలు కాగా నేటి వరకు 107.4 కోట్ల రూపాయలు 98 శాతం వసూలు చేశామని ఆయన అన్నారు.
ఇందులో 32 కోట్లు త్రైమాసిక, 43.39 కోట్లు లైఫ్‌ట్యాక్స్, 9.24 కోట్లు ఫీజులు, 3.57 కోట్లు సర్వీస్ ట్యాక్స్, 18.68 కోట్లు తనిఖీల ద్వారా వచ్చిన మొత్తం అని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక సంవత్సరాంతానికి లక్ష్యాన్ని 100 శాతానికి అధిగమించగలమని ఆయన అన్నారు. సూర్యాపేటలో 2 కోట్లు, నల్లగొండలో 4 కోట్ల రూపాయల వ్యయంతో డ్రైవింగ్ ట్రాక్‌లను నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు. మిర్యాలగూడలో కూడ త్వరలో భూసేకరణ చేసి ట్రాక్ నిర్మాణం చేస్తామన్నారు.
తాగడానికి నీళ్లన్నా ఇవ్వండి
కోదాడ, జనవరి 22: కోదాడ పట్టణంలో ప్రజలు తాగునీటి కొరకు లబోదిబో అంటున్నారు..కనీసం తాగడానికి వారికి కావాల్సినన్ని మంచినీటిని సరఫరా చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కోదాడ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఛైర్‌పర్సన్ వంటిపులి అనిత అద్యక్షతన జరిగింది. సమావేశంలో అన్నిపక్షాల కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పట్టణంలో నెలకొన్న మంచినీటి సమస్యను కౌన్సిల్ మొత్తం సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దం కావాలని తెరాస ఫ్లోర్‌లీడర్ పార సీతయ్య సూచించారు. అనావృష్టి పరిస్ధితులతో గతంలో ఎన్నడూలేనంతగా పట్టణంలో నీటి ఎద్దడి ఏర్పడేందుకు అవకాశం వుందన్నారు. రెండు వార్డులకు ఒక ట్యాంకర్‌ను ఏర్పాటుచేసి ప్రతి రోజు నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పట్టణంలోని 30 వార్డులకు ఏర్పాటుచేసే 15 ట్యాంకర్‌లను రెండు టెండర్‌ల ద్వారా ఫైనల్ చేయాలని ఆయన కోరారు. పట్టణంలోని మంచినీటి బావుల వద్దనుండి ట్యాంకర్‌లు నీటిని నింపుకొనేందుకు వీలుగా కావాల్సిన ఏర్పాట్లను చేయాలని సీతయ్య కోరారు. అధికారులు అశ్రద్దగా పనిచేస్తున్నారని, ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, మున్సిపాలిటీలో అవినీతి పెరిగిపోయిందని కాంగ్రెస్ కౌన్సిలర్ వాడపల్లి వెంకటేశ్వర్లు ద్వజమెత్తారు. కమీషనర్‌కు మున్సిపాలిటీ పాలనపై ఆజమాయిషీ లేదన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నదని ఆయన ద్వజమెత్తారు. ట్యాంకర్‌లపై వార్డుల నెంబర్లు వేయాలని వాడపల్లి సూచించారు. జియాలజిస్ట్ వచ్చి బోర్ పాయింట్‌లు వేసి మూడునెలలు దాటుతున్న ఎందుకు బోర్‌లు వేయలేదని కెయల్‌యన్ ప్రసాద్ ప్రశ్నించారు. మంచినీటికొరకు మున్సిపాలిటీలో 30 లక్షల నిధులు వుండి ప్రజలు త్రాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు ఉప్పుగండ్ల సరోజ, షమ్మి, రెహనా, కమదన మాధవి, కలకొండ శ్రీను, కొమరగిరి రంగారావు, తుమ్మలపల్లి భాస్కర్, షేక్ షఫీ అధికారులపై ద్వజమెత్తారు. తమ వార్డుల్లో నెలకొన్న మంచినీటి సమస్యపై సంవత్సరం నుండి అధికారుల దృష్టికి తెస్తున్నా వింటున్నారే తప్ప పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలేదని ద్వజమెత్తారు. తాము అడిగిన సమస్యలను ఏం చేశారని వారు అధికారులను నిలదీసారు. లక్షలు ఖర్చు చేసి బ్లీచింగ్ పౌడర్ కొంటున్నట్లు ఎజెండాలో పెడుతున్నారని, అధికారంలోకి వచ్చిన 19 నెలల్లో ఎక్కడ తాము బ్లీచింగ్ వాసన చూడలేదని, ఆ ప్రతిపాదనను రద్దుచేయాలని షేక్ నరుూమ్, గార్లపాటి వీరారెడ్డి, పార సీతయ్య డిమాండ్ చేశారు. పాలకవర్గం దిష్టిబొమ్మను ఒక రాజకీయపార్టీ దగ్దం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. వార్డుల్లో జరిగే పనులపై కౌన్సిలర్లు సంతృప్తి చెందిన తరువాతనే బిల్లులు చెల్లించాలని కొమరగిరి రంగారావు సూచించారు. ఛైర్‌పర్సన్ తన నిధులను అందరికి సమానంగా కేటాయించాలని షేక్ నరుూమ్ సూచనపై ఛైర్‌పర్సన్ అనిత ఆమోదించారు. ఆస్ధిపన్ను పట్టణంలో విపరీతంగా పెరగడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కౌన్సిల్ తీర్మాణించింది. వివిద మున్సిపాలిటీల్లో ఆస్ధిపన్నులపై అధ్యయనం చేయాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో వైస్‌ఛైర్మన్ తెప్పని శ్రీనివాస్, కమీషనర్ బాలోజీనాయక్ వివిద విభాగాల అధికారులు పాల్గొన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవానికి
ఏర్పాట్లు పూర్తి చేయాలి : భన్వర్‌లాల్
నల్లగొండ రూరల్, జనవరి 22: ఈనెల 25న నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ కారారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవిన్యూ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఓటర్ల దినోత్సవ నిర్వాహణపై తగు సూచనలు చేశారు. రిపబ్లిక్‌డే రోజు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో శకటాన్ని ప్రదర్శించాలని, 25వ తేదీన పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ స్థాయి అధికారులు నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు అందించాలని, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, డిఆర్‌వో రవి, జడ్పీ సిఈవో మహేందర్‌రెడ్డి, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, ఆర్‌డివోలు పాల్గొన్నారు.
1024 కోట్లతో 17 లక్షల మెట్రిక్ టన్నుల మార్కెట్ గోదాంలు
తీ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ శరత్ వెల్లడి

కోదాడ, జనవరి 22: తెలంగాణ రాష్ట్రంలోని 330 మండల కేంద్రాల్లో 1024 కోట్ల వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం వున్న మార్కెట్ గోదాంలను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ వెల్లడించారు.
కోదాడ వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం వున్న 176 గోదాంలు మాత్రమే వుండేవని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిర్వహించిన సర్వేలో 22 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన గోదాంలు అవసరమని వెల్లడి కావడంతో స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీష్‌రావు 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యం వున్న గోదాంల నిర్మాణాలకు వెంటనే మంజూరు ఇచ్చారని ఆయన వివరించారు. మొదటి దశలో 128 గోదాంలను, రెండవ దశలో 202 గోదాంలను నిర్మించేందుకు 1200 ఎకరాల భూమిని సేకరించడం జరిగిందన్నారు. గోదాంల నిర్మాణాలకు ఇ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్‌లను పిలిచి పారదర్శకంగా నిర్ధారణ చేయడం వలన 120 కోట్ల రూపాయల ఆదా ఏర్పడిందని ఆయన వెల్లడించారు. గోదాంలను ఆధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం చేస్తున్నట్లు ఆయన వివరించారు. గోదాంల పైకప్పు ద్వారా సౌరశక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. గోదాంల పైకప్పులో ఏర్పాటుచేసే ప్యానల్‌ల ద్వారా 50 మెగావాట్‌ల సౌరశక్తి ఉత్పత్తి అవుతుందని, మార్కెట్ అవసరాల మేరకు సౌరశక్తిని ఉపయోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని ఆయన వివరించారు. దేశంలో ఎక్కడ ఇలాంటి ఉత్పత్తి జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. గోదాంలోని మొదటి కంపార్ట్‌మెంట్‌లో రైతుల ఎరువులు, రెండవ కంపార్ట్‌మెంట్‌లో రైతుబంధు పధకం కింద రైతులు తనఖాపెట్టిన ధాన్యం నిల్వలు, మూడవ కంపార్ట్‌మెంట్‌లో పిడియస్ బియ్యం నిల్వలకు అవకాశం వుండేలా డిజైన్ చేసినట్లు ఆయన చెప్పారు. గోదాంల నిర్మాణం ద్వారా కార్మికులకు అన్నిరోజుల్లో పని దొరుకుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో వున్న 150 మార్కెట్లలో 67 మార్కెట్లలో మాత్రమే వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో దళారీవ్యవస్ధద్వారా రైతులు నష్టపోకుంగా వుండేందుకు రాష్ట్రంలోని 44 వ్యవసాయ మార్కెట్లను జాతీయ వ్యవసాయ మార్కెట్‌లకు అనుసంధానం చేసి ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ వున్న వ్యవసాయ మార్కెట్‌లకు వచ్చిన ఉత్పత్తులను ఫొటోతీసి, క్వాలిటీని వివరిస్తూ ఆన్‌లైన్‌లో పెడతామని, దేశంలో ఎవరైనా కొనవచ్చని ఆయన వివరించారు. దీనివలన రైతుకు ఎక్కువధర లభిస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మార్కెట్ల రూపురేఖలను మార్చేందుకు చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన చెప్పారు. కామన్ గేట్, కవర్ షెడ్, ప్లాట్‌ఫాం, రెస్ట్‌హౌజ్, మద్దతు ధర బోర్డులు, త్రాగునీరు, రైతులకు భోజనం ఏర్పాటుకు 29 కోట్లు మంజూరుచేసినట్లు ఆయన చెప్పారు. కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా నోడల్ ఏజెన్సీగా నిర్ణయించిన మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 60 వేల క్వింటాళ్ల కందులను రాష్ట్రంలోని 18 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. సరిహద్దు చెక్‌పోష్టులను పటిష్టం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
330 కోట్ల మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యానికి ఇప్పటివరకు 200 కోట్లు వసూలు చేసినట్లు శరత్ చెప్పారు.
విసిగా జిల్లా వాసి
జగదీష్‌కుమార్ ఎంపిక
తిప్పర్తి, జనవరి 22: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ ఉపకులపతిగా ఢిల్లీ ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన మామిడాల జగదీష్‌కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర మానవ వనరుల శాఖ నాలుగు పేర్లతో కూడిన జాబితాను రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీకి పంపించగా వాటి నుండి ఆయన జగదీష్‌కుమార్ పేరును ఎంపిక చేశారు. జగదీష్‌కుమార్ మద్రాస్ ఐఐటి నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో ఎంఎస్, పిహెచ్‌డి చదివి కెనాడాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఖరక్‌పూర్ ఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెస్‌ర్‌గా చేసి ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెస్‌ర్‌గా పనిచేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన జగదీష్‌కుమార్ జేఎన్‌యు విసిగా ఎంపికవ్వడం పట్ల గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కస్తూర్బాల్లో ఖాళీల భర్తీ ప్రక్రియ!
నల్లగొండ రూరల్, జనవరి 22: జిల్లాలోని కస్తూరిబా బాలికల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 19కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్స్, 14క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్స్ పోస్టుల భర్తీకి సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు అధికారి, డిఇవో విశ్వనాథం నోటిఫికేషన్ జారీ చేశారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఏదైనా డిగ్రీ, పిజిడిసిఏ, క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 10వ తరగతి ఉత్తీర్ణత, సంబంధిత విభాగంలో డిప్లోమా/ టిటిసి విద్యార్హతలు కల్గివుండాలని తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సదరు పాఠశాలల ప్రిన్సిపాల్స్ (ఎస్‌వో)లకు అందించాలని సూచించారు. కాగా వచ్చిన దరఖాస్తుల్లో 1:2 ప్రకారం దరఖాస్తులను కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న ఎంపిక కమిటీకి పంపిస్తారు. కమిటీ భర్తీ ప్రక్రియ నిర్వహించనుంది. రెమ్యూనరేషన్ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు 5వేలు, క్రాప్ట్ ఇన్‌స్ట్రక్టర్‌కు 4500 చొప్పున రెమ్యూనరేషన్ పద్ధతిలో వేతనాలు చెల్లించనున్నారు. స్థానికులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుంది. జిల్లాలోని ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, నడిగూడెం, తుంగతుర్తి, వేములపల్లి, భువనగిరి, బొమ్మలరామారం, చండూర్, గుర్రంపోడు, నాంపల్లి, పిఏపల్లి, తిరుమలగిరి, త్రిపురారం, దామరచర్ల, దేవరకొండ, గుండ్లపల్లి, నారాయణపూర్, పెద్దవూరా మండలాల్లోని కెజిబివి పాఠశాలల్లో కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఖాళీగా ఉన్నాయి. అలాగే గుండాల, తుర్కపల్లి, మోత్కూర్, మునుగోడు, పోచంపల్లి, వలిగొండ, భువనగిరి, చండూర్, మర్రిగూడ, నాంపల్లి, శాలిగౌరారం, తిరుమలగిరి, గుండ్లపల్లి, నారయణపూర్‌లలో క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఖాళీగా ఉన్నాయి.
పేదల బియ్యం కోళ్ల దాణాకు..
ౄ స్పెషల్ టాస్క్ఫోర్స్ తనిఖీలో వెల్లడి
చౌటుప్పల్, జనవరి 22: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం కోళ్ల దాణాకు వెళ్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు కడుపునిండా తిండి పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం చొప్పున సరఫరా చేస్తుంది. అధికారుల అండదండలతో రేషన్ దుకాణాల డీలర్లు అక్రమ దందా కొనసాగిస్తూ పేదల కడుపు కొడుతున్నారు. రేషన్ అక్రమ దందా జిల్లాస్థాయిలో జరుగుతోంది. స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు తీగ లాగితే డొంక కదిలింది. కోళ్లఫాంలో నిల్వ చేసి ఉన్న 48.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని శుక్రవారం సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టాస్ట్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకోని సివిల్ సఫ్లై అధికారులకు అప్పగించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలలోకి వెళ్తే గురువారం సాయంత్రం అంబర్‌పేట వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేస్తున్న సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టాస్క్ఫోర్స్ బృందానికి బియ్యం లోడ్‌తో హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వైపునకు వెళ్తున్న ఆటో పట్టుబడింది. ఆటోలో ఉన్న బియ్యాన్ని పరిశీలించగా రేషన్ సరుకుగా బయటపడింది. రేషన్ బియ్యం తీసుకు వెళ్తున్న రేసుల సుధాకర్, గోవిందు కొండయ్యలను అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో రేషన్ అక్రమ దందా బయటపడింది. ఆటోను యధావిధిగా పథకం ప్రకారం టాస్క్ఫోర్స్ అధికారులు పంపించి నిఘాపెట్టారు. ఆటో నేరుగా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి గుండ్ల సుధాకర్ ఇంటి వద్దకు వెళ్లింది. సరుకు వచ్చిందని చెప్పగానే ఎల్లగిరి శివారులోని దుబ్మాక సోమిరెడ్డి కోళ్లఫాం వద్ద దిగుమతి చేయాలని సూచించారు. అక్కడికి ఆటో వెళ్లి దిగుమతి చేస్తుండగా టాస్క్ఫోర్స్ అధికారులు దాడి చేసి సరుకులను స్వాధీనం చేసుకోని సీజ్ చేశారు. శుక్రవారం వెళ్లి పరిశీలించగా కోళ్ల దాణా బస్తాలలో కలిపి ఉన్న 50 కిలోల బరువు ఉన్న 97 బస్తాల రేషన్ సరుకులు బయటపడ్డాయి. కోళ్లఫాం యజమానిని రేషన్ బియ్యం గురించి ప్రశ్నించగా తమకు కావలసిన రేషన్ బియ్యాన్ని వ్యాపారులు సరఫరా చేస్తారని ఒప్పుకున్నారు. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి గుండ్ల సుధాకర్, సూర్యాపేటకు చెందిన సోమ సుధాకర్ సఫ్లై చేస్తారని అధికారులకు వివరించారు. ఇటీవలే సూర్యాపేట నుంచి వంద బస్తాలు వచ్చాయని చెప్పారు. కోళ్లఫాంలో ఉన్న 97 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోని సివిల్ సఫ్లై అధికారులకు అప్పగించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యాన్ని నూకగా చేసి...
పేద కుటుంబాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని దళారీలు కొనుగోలు చేసి నూకగా మార్చి కోళ్లఫాంలకు సరఫరా చేస్తూ దండిగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తతంగం గత కొంత కాలంగా యథేచ్ఛగా సాగుతుంది. రేషన్ డీలర్ల నుంచి రేషన్ బియ్యాన్ని దళారులు కొనుగోలు చేస్తారు. అదేవిధంగా గ్రామాలలో రేషన్ సరుకులను తీసుకోని వినియోగించని వారి నుంచి అతి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసిన రేషన్ బియ్యం బస్తాలను కోళ్లఫారంలకు సరఫరా చేస్తారు. కొంత మంది దళారులు పట్టుబడకుండా ఉండేందుకు రేషన్ బియ్యాన్ని నీళ్లలో తడిపి ఎండపోస్తారు. రేషన్ బియ్యం నూకగా మారుతుంది. నూకగా మారిన రేషన్ బియ్యాన్ని కోళ్ల దాణాకు సరఫరా చేస్తూ వ్యాపారులు రెండు చేతులా సంపాదిస్తున్నారు.
1,541 స్వయం సహాయక సంఘాలకు 70 కోట్ల రుణాలు
శమెప్మా పిడి కిరణ్‌కుమార్
మిర్యాలగూడ, జనవరి 22: జిల్లాలో 8,676 స్వయం సహాయక సంఘాలున్నాయని వాటిలో ఈ ఏడాది సుమారు 1,541 సంఘాలకు సుమారు 70 కోట్ల రూపాయలు పావలా వడ్డీపై ఇస్తున్నామని పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమం (మెప్మా) జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. శుక్రవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 52 శాతం రుణాలను అందించామని, మిగిలిన రుణాలను మార్చిలోగా పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో చిరువ్యాపారులు సుమారు 5,725 మంది ఉన్నారని, వారికి ఈ నెలాఖరు వరకు గుర్తింపు కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. చిరువ్యాపారులను గ్రూపులుగా ఏర్పాటు చేసుకోవాలని కోరామని, గ్రూపులుగా ఏర్పడిన అనంతరం వారికి 2 లక్షల రూపాయలు వడ్డీ, జమానత్ లేకుండా బ్యాంకుల నుండి రుణాలు అందిస్తామని ఆయన అన్నారు. అదే విధంగా రోడ్లపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా వ్యాపారం చేసుకుంటున్న చిరువ్యాపారులకే రుణాలు ఇస్తామన్నారు. మెప్మా రుణాలను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మురికివాడల సమాఖ్యల నిధులను దుర్వినియోగం చేసే వారిపై కేసులు నమోదు చేయించామని ఆయన అన్నారు. వారి నుండి రెవిన్యూ రికవరి యాక్టు కింద వసూలు చేస్తామని ఆయన అన్నారు. అనంతరం పట్టణంలోని పట్టణ స్థాయి మహిళా సమాఖ్యల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సంఘాలు పెరిగి పోయాయని వాటిని సమర్ధవంతంగా నిర్వహించేందుకు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని కోరారు. సమాఖ్యల, పట్టణ సమాఖ్యలకు నూతన లీడర్లను కూడ ఎంపిక చేయనున్నామని ఆయన అన్నారు. నూతనోత్తేజంతో పని చేయాలని ఆయన కోరారు. సమావేశంలో మునిసిపల్ చైర్మన్ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్, కమిషనర్ కందుల అమరేందర్‌రెడ్డి, మెప్మా పిఆర్‌పి శ్రీనివాస్, ఆర్‌పిలు ప్రసాద్, శివాజీ, రాంరెడ్డి, వసంత పాల్గొన్నారు.
కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం
నల్లగొండ రూరల్, జనవరి 22: రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో పలు చోట్ల కేంద్ర మంత్రులు స్మృతి ఇరాని, బండారు దత్తాత్రేయ, విసి అప్పారావుల దిష్టిబొమ్మలను దళిత, విద్యార్ధి సంఘాల నాయకులు దహనం చేశారు. నల్లగొండ గడియారం సెంటర్‌లో మాల మహానాడు ఆధ్వర్యంలో నాయకులు పంగలెక్క సంజయ్, సందా యాదగిరి తదితరులు దిష్టిబొమ్మ దహనం చేశారు. అదేవిధంగా సుభాష్ విగ్రహం వద్ద దళిత, గిరిజన సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో మంత్రులు. విసిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దర్శనం నర్సింహ, రవినాయక్, గాదె నర్సింహ, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్ధి వేదిక జిల్లా ఉపాధ్యక్షులు మేడారం అరవింద్ ఆధ్వర్యంలో ఎన్‌జి కళాశాల ఎదుట కేంద్ర మంత్రు దిష్టిబొమ్మలను దహనం చేశారు.
విచారణ నిష్పక్షపాతంగా చేపట్టాలి
అక్రమంగా తొలగించిన ఎం ఈవో అరుంధతి విషయంలో అధికారులు విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని లేకుంటే ఆందోళనలు చేస్తామని దళిత, గిరిజన సంఘాల నాయకులు దర్శనం నర్సింహ, రవినాయక్, రంజిత్‌రావు, కామేశ్వర్‌లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
మార్క్‌ఫెడ్ ద్వారా కందుల కొనుగోళ్లు
ధరలు తగ్గకుంటే కందిపప్పు అమ్మకాల్యు మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్
సూర్యాపేట, జనవరి 22: కంది రైతులకు ఖచ్చితంగా మద్దతుధర కల్పించే లక్ష్యంతో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా 18 వ్యవసాయ మార్కెట్‌లలో కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు మార్కెటింగ్‌శాఖ కమిషనర్ డాక్టర్ అగోతు శరత్ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని వ్యవసాయమార్కెట్‌ను ఆయన తనిఖీచేశారు. ఇక్కడ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి కందులు తెచ్చిన రైతులతో మాట్లాడి కొనుగోలు జరుగుతున్న తీరును గురించి అడిగి తెలుసుకున్నారు. మార్క్‌ఫెడ్ అధికారులతో కొనుగోళ్లు జరుగుతున్న తీరును ఆరా తీసి క్వింటాకు మరో 100రూపాయల ధరను పెంచి చెల్లించాలని ఆదేశించారు. అనంతరం మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ చొరువతో నేడు తెలంగాణలో కందిపంటను సాగుచేసిన రైతులకు మంచి ధర లభిస్తుందన్నారు. ఇందుకోసం మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లాలో రెండు కొనుగోలుకేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 60వేల క్వింటాళ్ల కందులను మద్ధతుధరకు కొనుగోలు చేశామని చెప్పారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించడం వల్ల మార్కెట్‌లలో ట్రేడర్‌లు సైతం కందులకు మద్ధతుధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. ట్రేడర్‌లకు పోటీగా ప్రభుత్వరంగ సంస్ధ అయిన మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు జరుపుతుండటం వల్ల వ్యాపారుల సిండికేట్ విధానానికి స్వస్తి పలికామన్నారు. మార్క్‌ఫెడ్ కొనుగోలుచేసిన కంది రైతులకు రెండురోజుల్లోనే చెల్లించే విధంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. రైతులు నాణ్యమైన కందులను తీసుకువచ్చి ఖచ్చితమైన మద్దతుధరను పొందాలని సూచించారు. కందులను కేవలం వ్యాపారులు కొనుగోలు చేయడం వల్లనో, కరవుపరిస్థితుల వల్లనో ఈ ఏడాది కందిపప్పు ధరలు నింగినంటాయని, మరోమారు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టిందని, అందులో భాగంగానే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నామని తెలిపారు. ఈ ఏడాది కందిపప్పు ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉంటే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందులను పప్పుగా మార్చి తక్కువ ధరలకు ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మార్కెటింగ్ ఎడిఎం హలీమ్, మార్కెట్ కార్యదర్శి వెంకటేశం తదితరులు ఉన్నారు.
నక్కలగండి నిర్వాసితులకు
123 జీవో రగడ!
పరిహారంపై పేచీ
శ పనులకు మళ్లీ ఆటంకాలు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, జనవరి 22: శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టు అంతర్భాగమైన నక్కలగండి ప్రాజెక్టు రిజర్వాయర్ పనులకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ ప్రాజెక్టు ముంపుతో నష్టపోతున్న నిర్వాసితులకు ఆరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారం కింద ప్రభుత్వం ఈ నెల 14న 13 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశారు. 255 ఎకరాల పరిధిలోని నిర్వాసితులకు 123 జీవో మేరకు ఎకరాకు 3.67 లక్షలు, బత్తాయి చెట్టుకు 2,470 రూపాయల పరిహారం చెల్లించారు. పరిహారం చెల్లింపు ప్రక్రియ పూర్తయినందున ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు యంత్రాలతో వెళ్లిన ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లను మరికొంతమంది నిర్వాసితులు అడ్డుకోవడంతో మరోసారి పనులకు బ్రేక్ పడింది. నక్కలగండి ప్రాజెక్టు సిస్టర్న్ కట్ట నిర్మాణం 2.85 కిలోమీటర్ల మేరకు 346 కోట్లతో నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి చందంపేట, తేల్ధేవరపల్లి, నక్కలగండి తండాల పరిధిలో 129, 128, 127, 117, 118 సర్వే నెంబర్ల పరిధిలో 3500 ఎకరాల భూసేకరణ చేయాల్సివుంది. నేరడుగొమ్ము వద్ధ ఎస్‌ఎల్‌బిసి టనె్నల్-2 ఔట్‌లెట్ నుండి పెండ్లిపాకల రిజర్వాయర్ వరకు మూడు కిలోమీటర్ల కాలువ నిర్మాణంకు సంబంధించి 55 ఎకరాలు, నక్కలగండి సిస్టర్న్ బండింగ్ ముంపుకు 80 ఎకరాలు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 255 ఎకరాలు భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు.
నిర్వాసితుల డిమాండ్లతో ఖంగుతింటున్న అధికారులు
తాజాగా నిర్వాసితులకు చెల్లించిన పరిహారం కొత్త జీవో 123 మేరకు చెల్లించినందున అంతకుముందు 2012లో పాత భూసేకరణ నిబంధనల మేరకు పరిహారం పొందిన తమకు నష్టం జరిగిందని, కొత్త భూసేకరణ ఉత్తర్వు 123 ద్వారా తమకు పరిహారం చెల్లించాలంటూ తేల్ధేవరపల్లికి చెందిన నిర్వాసితులు పేచీ పెట్టారు. గత నిబంధనల మేరకు ఎకరాకు 1.80 లక్షలు, బత్తాయి తోట ఒక్కో చెట్టుకు 1200లుగా మాత్రమే చెల్లించారని కొత్త చట్టం మేరకు తమకు కూడా ఎకరాకు 3 లక్షల 67 వేలు, చెట్టుకు 2470 రూపాయలు చెల్లించాలని, ఇళ్ల స్థలాలు, ఇళ్లు కేటాయించాలని, ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్వాసితులు డిమాండ్లు వినిపించడం అధికారులను ఖంగుతినిపించింది. ఇప్పటికే తాము నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో మొదటిసారి నిర్వాసితులమై తేల్ధేవర్‌పల్లిలో జీవిస్తున్నామని, నక్కలగండితో రెండోసారి తమను నిర్వాసితులుగా మార్చారంటూ వారు వాపోయారు.
ప్రభుత్వం దృష్టికి నిర్వాసితుల సమస్యలు
నక్కల గండి ప్రాజెక్టు నిర్వాసితులకు 123 ఉత్తర్వును అనుసరించి పరిహారం చెల్లించాలన్న డిమాండ్‌ను అక్కడి అధికారులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సివున్నందున సమస్యను ప్రభుత్వానికి నివేదించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే స్థానిక రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఈ నెల 23న గ్రామసభ ద్వారా పరిహారం పంచాయతీని పరిష్కరించే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. మరోవైపు 117, 118, 128, 129 సర్వే నెంబర్ల పరిధిలో మరో 200 ఎకరాల మేరకు భూసేకరణ బాధితులతో పాటు నక్కలగండి తండాలోని ముంపు బాధితులకు పరిహారం అందించాకే పనులు ప్రారంభించాలంటూ స్థానికులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణం పనుల ప్రారంభానికి మరెంత కాలం పడుతుందోనన్న గందరగోళం కొనసాగుతోంది.
పదిలో వంద శాతం ఫలితాలు సాధించాలి
చౌటుప్పల్, జనవరి 22: పదవ తరగతిలో వంద శాతం ఫలితాలు సాధించేందుకు శక్తివంచనలేకుండా శ్రమించాలని విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరక్టర్ ఎ.కృష్ణారావు సూచించారు. చౌటుప్పల్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం అకస్మికంగా సందర్శించారు. పాఠశాల ఆవరణను కలియతిరిగారు. తరగతి గదులను సందర్శించారు. హరితహారం, మరుగుదొడ్ల నిర్వహణ తీరు పరిశీలించారు. కంప్యూటర్ విద్య అమలుపై ఆరా తీశారు. మధ్యాహ్న బోజనం ఏజెన్సీ సభ్యులతో మాట్లాడారు. రోజు ఎంత మంది విద్యార్థులు మధ్యాహ్న బోజనం చేస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలని సూచించారు. నాసిరకం సరుకులతో మధ్యాహ్న బోజనం పెడితే సహించబోమని హెచ్చరించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రైవేటుకు ధీటుగా విద్యను అందించి వంద శాతం ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం కల్గించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఇవో కె.సైదానాయక్, ఎంఇవో రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కమల తదితరులు ఉన్నారు.
సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్ధించా: ఎంపి
నేరేడుచర్ల, జనవరి 22: ప్రస్తుత సంవత్సరంలో ఖరీఫ్, రబీలో వర్షాలు కురవక జిల్లా కరువుతో కొట్టుమిట్టాడుతున్నందున రానున్న సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి సమృద్దిగా పంటలు పండాలని జాన్‌పహాడ్ సైదులును ప్రార్ధించినట్లు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం నేరేడుచర్ల మండలంలోని జాన్‌పహాడ్ దర్గా ఉర్సు సందర్భంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్‌తో కలిసి సందర్శించి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ కరువు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం అశ్రద్ధ వహించడంతో ప్రజలు నష్టపోయారని, ఎండిన పంటలపై నష్టపరిహారం ఇవ్వ